న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నిజం చెప్పాలంటే ఎలాంటి బాధలేదు! సిరాజ్ కోసం.. ఆ దేవుడికి థ్యాంక్స్ చెప్పా‌: శార్దూల్‌

Shardul Thakur happy for Mohammed Siraj after his five-wicket haul in Gabba Test
Shardul Thakur Happy For Mohammed Siraj After His 5 Wicket Haul In Gabba Test | Oneindia Telugu

ముంబై: చివరి టెస్టులో ఐదు వికెట్లు తీయలేకపోయినందుకు తనకెలాంటి బాధ లేదని టీమిండియా ఆటగాడు శార్దూల్‌ ఠాకూర్‌ తెలిపాడు. అయిదు వికెట్ల ఘనత హైదరాబాదీ పేసర్ మొహ్మద్ సిరాజ్‌ సాధించినందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందని, అతడు అయిదు వికెట్లు సాధించాలని కోరుకున్నానని తెలిపాడు. ఇకపై తనని పేసర్‌గా మాత్రమే భావించరని, బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌గా పిలుస్తారని శార్దూల్‌ పేర్కొన్నాడు. గబ్బా టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో శార్దూల్ నాలుగు వికెట్లు తీయగా,‌ సిరాజ్‌ అయిదు వికెట్లతో సత్తాచాటాడు. ఏడు వికెట్లతో పాటు అర్ధ శతకంతో శార్దూల్‌ సత్తాచాటిన సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో 188/6తో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు వాషింగ్టన్ సుందర్‌తో కలిసి శతక భాగస్వామ్యం నెలకొల్పాడు.

బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా పిలువొచ్చు:

బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా పిలువొచ్చు:

ఆసీస్ పర్యటన ముగించుకుని స్వదేశానికి చేరుకున్న శార్దూల్‌ ఠాకూర్‌ సిరీస్‌లో తన అనుభవాలు పంచుకున్నాడు. 'ఇక నుంచి నన్ను బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా పిలుస్తారు. నాకు బ్యాటింగ్ చేసే సామర్థ్యం ఉంది. భవిష్యత్‌లోనూ రాణిస్తా. క్రీజులోకి దిగాల్సిన పరిస్థితి వస్తే పరుగులు సాధించి జట్టుకు తోడ్పడతా. అయితే బ్రిస్బేన్‌లో ఆస్ట్రేలియాతో ఆడటం అంత సులువు కాదు. గబ్బాలో వారి రికార్డులు అందరికీ తెలుసు. అయినా వాళ్లని ఓడించాం. ఆఖరి టెస్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించినందుకు ఎంతో సంతోషంగా ఉంది' అని శార్దూల్‌ తెలిపాడు.

ఎక్కువ సేపు క్రీజులో నిలబడాలనుకున్నాం:

ఎక్కువ సేపు క్రీజులో నిలబడాలనుకున్నాం:

సుందర్‌తో కలిసి నెలకొల్పిన 123 పరుగుల భాగస్వామ్యం గురించి శార్దూల్‌ ఠాకూర్‌ మాట్లాడుతూ... 'తొలి ఇన్నింగ్స్‌లో జట్టు 186/6తో కష్టాల్లో ఉన్నపుడు క్రీజులో అడుగుపెట్టా. మరోవైపు సుందర్‌ ఉన్నాడు. ఆ పరిస్థితుల్లో ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా వీలైనంత ఎక్కువ సేపు క్రీజులో నిలబడాలనుకున్నాం. ఆ సమయంలో వికెట్లు కాపాడుకోవడం మాకెంతో ముఖ్యం. ఒక్కో అర్ధగంట బ్యాటింగ్‌ చేస్తూ పోయాం. స్కోరుబోర్డు వైపు అసలు చూడలేదు. ప్రత్యర్థి బౌలర్ల గురించి చర్చించుకుంటూ బ్యాటింగ్‌ కొనసాగించాం. కమిన్స్‌, హేజిల్‌వుడ్‌, స్టార్క్‌.. ఇలా ఆ పేసర్లు ఎలాంటి బంతులు వేస్తారో అని మాట్లాడుకున్నాం. ఏకాగ్రత కోల్పోయినట్లు అనిపించగానే.. జాగ్రత్తగా ఆడాలని ఒకరికొకరం చెప్పుకున్నాం. అలా మాట్లాడుకోవడంతోనే ఏడో వికెట్‌కు 123 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయగలిగాం' అని చెప్పాడు.

దేవుడికి కృతజ్ఞతలు చెప్పా:

దేవుడికి కృతజ్ఞతలు చెప్పా:

రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీయలేకపోయినందుకు ఏమైనా బాధపడ్డారా అని అడిగిన ప్రశ్నకు శార్దూల్‌ స్పదించాడు. 'ఎలాంటి బాధ లేదు. నిజం చెప్పాలంటే ఆ ఘనత సిరాజ్‌ సాధించినందుకు ఎంతో సంతోషంగా ఉంది. అతడు 5 వికెట్లు సాధించాలని కోరుకున్నా. ఎందుకంటే అతడు ఎన్నో క్లిష్టపరిస్థితుల మధ్య ఈ సిరీస్ ఆడాడు. సిరాజ్‌కు ఈ సిరీస్ ఎంతో కీలకం‌. ఇటీవల అతడు తన తండ్రిని కోల్పోయాడు. సిరాజ్‌ టెస్టు క్రికెట్‌ ఆడాలనేది అతడి తండ్రి కల. అయితే ఆయన ఈ లోకంలో లేనప్పటికీ, పైనుంచి సిరాజ్‌ ప్రదర్శన చూశాడనుకుంటున్నా. 5 వికెట్ల ఘనత అందుకున్న సిరాజ్‌ను చూసి ఆయన కచ్చితంగా సంతోషించి ఉంటారు. సిరాజ్‌ తీసిన ఐదో వికెట్‌లో నేను భాగస్వామ్యం అయినందుకు ఎంతో ఆనందించా. అతడు 5 వికెట్లు సాధించిన క్షణంలో దేవుడికి కృతజ్ఞతలు చెప్పా' అని శార్దూల్‌ అన్నాడు.

పది బంతులు వేయగానే:

పది బంతులు వేయగానే:

రెండేళ్ల కిత్రం టెస్టు అరంగేట్ర మ్యాచ్‌లో పది బంతులు వేయగానే గాయంతో మ్యాచ్‌ మొత్తానికే దూరమైన శార్దూల్‌ ఠాకూర్‌‌.. దాదాపు రెండేళ్ల తర్వాత కంగారూ గడ్డపై వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ కీలక ప్రదర్శన చేసి బ్రిస్బేన్‌లో జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఇప్పటికే టీ20, వన్డేల్లో కూడా విలువైన ఇన్నింగ్స్ ఆడాడు.

అభిమానులకు నిరాశే.. ప్రేక్షకుల్లేకుండానే తొలి రెండు టెస్టులు!!

Story first published: Saturday, January 23, 2021, 12:22 [IST]
Other articles published on Jan 23, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X