న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అభిమానులకు నిరాశే.. ప్రేక్షకుల్లేకుండానే తొలి రెండు టెస్టులు!!

India vs England: First two Tests to be played without Crowd in Chennai
IND vs ENG: BCCI Likely To Allow 50% Crowd | Oneindia Telugu

చెన్నై: కరోనా వైరస్ మహమ్మారి సుదీర్ఘ విరామం తర్వాత దేశంలో జరగనున్న తొలి అంతర్జాతీయ క్రికెట్‌ సిరీస్‌ను మైదానంలో ప్రత్యక్షంగా వీక్షిద్దామనుకున్న అభిమానులకు నిరాశే ఎదురుకానుంది. ఇంగ్లండ్‌తో చెన్నైలోని చెపాక్‌లో జరిగే తొలి రెండు టెస్టులను ఖాళీ స్టేడియంలోనే నిర్వహించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్ణయించినట్లు సమాచారం. రెండు మ్యాచ్‌లు ఫ్యాన్స్‌ లేకుండానే జరుగుతాయని తమిళనాడు క్రికెట్‌ సంఘం (టీఎన్‌సీఏ) కార్యదర్శి ఆర్‌ఎస్‌ రామసామి కూడా తెలిపారు.

'కరోనా వైరస్‌ పరిస్థితులు కారణంగా ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ఇంగ్లండ్‌తో జరగనున్న తొలి రెండు టెస్టులకు ప్రేక్షకులను అనుమతించట్లేదు' అని టీఎన్‌సీఏ కార్యదర్శి ఆర్‌ఎస్‌ రామసామి పేర్కొన్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో వచ్చే నెలలో ఆరంభమయ్యే ఇంగ్లండ్‌తో సిరీస్‌లో ఆటగాళ్ల ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా చూడాలనే బీసీసీఐ నిర్ణయం మేరకు ఖాళీ స్టేడియంలోనే మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు టీఎన్‌సీఏ సభ్యులకు సమాచారం అందింది.

కరోనా తర్వాత భారత్‌లో ఇప్పటి వరకూ కనీసం ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా జరగలేదు. దాంత. భారత్-ఇంగ్లండ్ మధ్య జరగనున్న సిరీస్‌ని ప్రత్యక్షంగా వీక్షించాలని అభిమానులు ఆశించారు. అయితే వారికి నిరాశ ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వైరస్ వ్యాప్తి కారణంగా ఈ సిరీస్‌ని బయో-బబుల్ వాతావరణంలో బీసీసీఐ నిర్వహిస్తుండగా.. స్టేడియంలోకి ప్రేక్షకుల్ని అనుమతిస్తే రిస్క్ అని బీసీసీఐ పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. దాంతో 50000 సీటింగ్ సామర్థ్యం ఉన్న చెపాక్ స్టేడియం ఖాళీగా దర్శనమివ్వనుంది.

ఈనెల 27న భారత్-ఇంగ్లండ్ జట్లు చెన్నైకి చేరుకుని బయో బబుల్‌లో ఉంటాయి. తొలి టెస్టు వచ్చే నెల 5న ఆరంభం కానుంది. 17 నుంచి రెండో టెస్ట్ ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 24 నుంచి మూడో టెస్టుతో పాటు మార్చి 4 నుంచి నాలుగో టెస్టుకి కూడా అహ్మదాబాద్‌లోని మొతెరా స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ఇరు జట్ల మధ్య మొత్తం నాలుగు టెస్టులు, ఐదు టీ20లు, మూడు వన్డేల సిరీస్ జరగనుంది.

ISL 2020 21: ముంబై సిటీ జోరు.. ఈస్ట్ బెంగాల్‌ చిత్తు!!ISL 2020 21: ముంబై సిటీ జోరు.. ఈస్ట్ బెంగాల్‌ చిత్తు!!

Story first published: Saturday, January 23, 2021, 11:44 [IST]
Other articles published on Jan 23, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X