న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Shahid Afridi: ‘నిద్రపట్టడం లేదు మామ.. అంటూ షాహిన్ ఫోన్ చేశాడు’

Shahid Afridi Reveals Shaheen Afridi Called Him Before India-Pakistan T20 World Cup Clash

కరాచీ: ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాను దాయాదీ పాకిస్థాన్ చిత్తుగా ఓడించిన విషయం తెలిసిందే. మెగా టోర్నీల్లో ఓటమెరుగని జట్టుగా కొనసాగిన భారత జట్టుకు బాబర్ ఆజామ్ నేతృత్వంలోని పాకిస్థాన్ జట్టు దిమ్మతిరిగే షాకిచ్చింది. ఏకంగా 10 వికెట్ల తేడాతో గెలుపొంది భారత్‌పై ఉన్న చెత్త రికార్డును మెరుగుపరుచుకుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు పాకిస్థాన్ పేసర్ షాహిన్ షా అఫ్రిది తనకు ఫోన్ చేశాడని ఆ జట్టు మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది తెలిపాడు. ఈ కీలక మ్యాచ్‌కు ముందు షాహీన్ అఫ్రిది తీవ్ర ఒత్తిడికి గురయ్యాడని, దాంతో తనకు ఫోన్‌ చేశాడని గుర్తు చేసుకున్నాడు. తాజాగా పాకిస్తాన్‌కు చెందిన ఓ టీవీ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు.

'టీమిండియాతో షాహిన్‌ తన తొలి గేమ్‌ ఆడకముందు నాకు వీడియోకాల్‌ చేసి ఒత్తిడికి గురవుతున్నట్లు చెప్పాడు. మేం సుమారు 12 నిమిషాలు మాట్లాడుకున్నాం. దాంతో.. దేవుడు నీకు మంచి అవకాశం ఇచ్చాడు. మైదానంలోకి వెళ్లి అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వు. టీమిండియా వికెట్లు తీసి హీరో అవ్వు' అని అతడికి సూచించానని అఫ్రిది పేర్కొన్నాడు. ఇక అఫ్రిది చెప్పినట్లుగానే షాహిన్ బంతితో చెలరేగి.. టీమిండియా పతనాన్ని శాసించాడు.

ఇక తాను ఆడే రోజుల్లో కూడా టీమిండియాతో మ్యాచ్‌ అంటే.. ముందురోజు తమ ఆటగాళ్లకు రాత్రి నిద్ర పట్టకపోయేదని పాక్ కెప్టెన్ షాహీద్ అఫ్రిది గుర్తు చేసుకున్నాడు. 'నేను ఆడే రోజుల్లోనూ మా జట్టు ఆటగాళ్లు భారత్‌తో మ్యాచ్‌కు ముందు రోజు రాత్రి అస్సలు నిద్రపోయేవాళ్లు కాదు. కొందరైతే ఎప్పుడెప్పుడు మ్యాచ్‌ ఆరంభమవుతుందా.. అని ఎదురుచూసేవాళ్లు. ఎందుకంటే ఎంతో మంది ప్రజలు తమ పనులను పక్కనపెట్టి మరీ అలాంటి మ్యాచ్‌లను తిలకించేవారు' అని అఫ్రిది చెప్పుకొచ్చాడు.

టీ20 ప్రపంచకప్‌లో భారత్‌పై గెలిచిన పాక్.. న్యూజిలాండ్‌ను కూడా అదే రీతిలో ఓడించి గ్రూప్-1 టాపర్2గా సెమీస్ చేరింది. అయితే సెమీస్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైంది. సునాయసంగా గెలిచే మ్యాచ్‌లో మాథ్యూ వేడ్ సూపర్ బ్యాటింగ్‌తో చెలరేగడంతో ఓటమిపాలైంది. గెలుపు ఖాయం అనుకున్న సమయంలో పట్టు విడిచి మాథ్యూ వేడ్ ఇచ్చిన కీలక క్యాచ్‌ను హసన్ అలీ చేజార్చడంతో పాక్ ఇంటిదారిపట్టింది. షాహిన్ అఫ్రిది బౌలింగ్‌లో మూడు సిక్స్‌లు బాదిన మాథ్యూ వేడ్ ఆసీస్‌ను ఫైనల్‌కు చేర్చాడు. ఇక ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించిన ఆసీస్.. తొలి సారి టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడింది. ఇక షాహిద్ అఫ్రిది పెద్ద కూతురితో షాహిన్ అఫ్రిది పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయించిన విషయం తెలిసిందే. అఫ్రిది కూతురు చదువు పూర్తవ్వగానే వీరి వివాహం జరగనుంది.

Story first published: Sunday, December 26, 2021, 16:43 [IST]
Other articles published on Dec 26, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X