న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అంతా నా వల్లే అంటూ.. వెక్కివెక్కి ఏడ్చిన షెఫాలీ

Shafali Verma in tears after India lose T20 World Cup final against Australia


హైదరాబాద్:
అంతర్జాతీయ మహిళల దినోత్సవం నాడు.. కట్టుబాట్లను తెంచుకొని అమ్మాయిలు ఎదుగుతున్నారని గర్జించాలనుకున్న అమ్మాయిలకు చేదు అనుభవమే ఎదురైంది. కంగారు జట్టును కంగారెత్తించి తొలిసారి విశ్వవిజేతగా నిలవాలని ఉవ్విళ్లూరిన మన మహిళలకు నిరాశే మిగిలింది. అప్రహిత విజయాలతో ఓటమెరుగని జట్టుగా తుదిపోరుకు చేరిన హర్మన్‌ప్రీత్ సేన.. అనూహ్య రీతిలో తుది మెట్టుపై బోల్తా పడి చెమర్చిన కళ్లతో వెనుదిరిగింది.
Women's T20 World Cup : Shafali Verma Got Emotional After India Loses Against Australia | Oneindia
మూడోసారి..

మూడోసారి..

ప్రపంచకప్ గెలవాలనేది ప్రతీ ఒక్కరి కల. ఆ కల సాకారమయ్యే రోజు వచ్చినట్టు వచ్చి దూరమైతే ఆ బాధ వర్ణాతీతం. ఇప్పుడే అదే వ్యథను భారత అమ్మాయిలు అనుభవిస్తున్నారు. ఒకసారి కాదు.. గత నాలుగేళ్లలో మూడు సార్లు చేజార్చుకొని కన్నీటి పర్యంతమయ్యారు.. 2017 వన్డే ప్రపంచకప్ ఫైనల్.. 2018 టీ20 సెమీఫైనల్.. 2020 టీ20 ప్రపంచకప్ ఫైనల్.. వేదిక మారినా.. ప్రత్యర్థి ఏదైనా.. ఫలితం మాత్రం అదే..!! ఇప్పుడదే బాధను తట్టుకోలేకపోయింది యువ ప్లేయర్ షెఫాలీ వర్మ. తొలిసారి ప్రపంచకప్ ఆడిన ఈ 16 ఏళ్ల సంచలనం అద్భుతమైన బ్యాటింగ్‌తో ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకు సొంతం చేసుకుంది. అసలు భారత్ ఇక్కడి వరకు వచ్చిందంటే షెఫాలి సంచలన బ్యాటింగే కారణం.

తనవల్లే ఓడిందని..

తనవల్లే ఓడిందని..

ఇక ఆస్ట్రేలియా భారీ స్కోర్ చేయడంలో టీమిండియా ఫిల్డింగ్ వైఫల్యం ఓ కారణం. తొలి ఓవర్‌లో అలిసా హీలీ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను షెఫాలీ జారవిడిచింది. అప్పుడు ఆమె వ్యక్తిగత స్కోర్ 8 పరుగులు మాత్రమే. ఈ అవకాశంతో రెచ్చిపోయిన అలిసా.. ఏకంగా 39 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 75 పరుగులతో వీరవిహారం చేసింది. మరో ఓపెనర్ బెత్ మునీతో కలిసి తొలి వికెట్‌కు 115 పరుగుల విధ్వంసకర భాగస్వామ్యాన్ని అందించింది. అనంతరం 185 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ జట్టు ఆదిలోనే వికెట్ కోల్పోయింది. కేవలం 3 బంతుల్లో రెండు పరుగులే చేసి షెఫాలీ విఫలమైంది. అటు ఫీల్డింగ్, ఇటు బ్యాటింగ్‌లో విఫలమవడం.. ఫలితంగా భారత్ ఓడటంతో ఈ 16 ఏళ్ల యువ సంచలనం బాధను ఆపుకోలేకపోయింది. తనవల్లే మ్యాచ్ ఓడిపోయిందని, తాను క్యాచ్ పట్టి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని సహచరులతో చెబుతూ కన్నీటి పర్యంతమైంది.

ఓదార్చిన హర్మన్..

ఓదార్చిన హర్మన్..

అయితే సారథి హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, సహచర క్రికెటర్లు ఆమెను ఓదార్చే ప్రయత్నం చేసినప్పటికీ షెఫాలీ వెక్కివెక్కి ఏడ్చింది. సమష్టి వైఫల్యమని, నీవు ఆడటం వల్లనే మనం ఇక్కడ వరకు వచ్చామని ఓదార్చిన ఆమె తన బాధను దిగమింగకపోయింది.

అండగా నెటిజన్లు..

అండగా నెటిజన్లు..

ప్రస్తుతం షెఫాలీ కన్నీరు పెట్టుకున్న ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌ అయ్యాయి. దీంతో నెటిజన్లు ఆమెకు అండగా నిలిచారు. ‘కేవలం పదహారేళ్ల వయసులోనే ప్రపంచ శ్రేణి బౌలర్లను గడగడలాడించావు. నీ ప్రతిభకు అనుభవం తోడైతే టీమిండియాకు మరెన్నో చిరస్మరణీయ విజయాలను అందిస్తావు. టైటిల్‌ గెలవకున్నా మా హృదయాలను గెలుచుకున్నావ్.. సిస్టర్'అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

Story first published: Sunday, March 8, 2020, 20:03 [IST]
Other articles published on Mar 8, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X