న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs ENG: ఓటమి బాధలో ఉన్న టీమిండియాకు గట్టి షాక్!

Setback For India: ICC Imposes 40 Per Cent Fine, Dock 2 WTC Points After Defeat Against England

న్యూఢిల్లీ: మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు ఉంది టీమిండియా పరిస్థితి. అసలే ఊహించని పరాజయంతో తీవ్ర బాధలో ఉన్న భారత జట్టుకు ఐసీసీ ఊహించని షాకిచ్చింది. ఇంగ్లండ్‌తో రీషెడ్యూల్ టెస్ట్‌లో అనూహ్యంగా పరాజయంపాలైన టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ మ్యాచ్‌లో నిర్ణీత సమయం కన్నా రెండు ఓవర్లు తక్కువగా వేసినందుకు భారత్‌ జట్టుపై మ్యాచ్ రిఫరీ చర్యలు తీసుకున్నాడు. ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ)లో టీమిండియాకు రెండు పాయింట్ల కోత వేయడంతో పాటు ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 40 శాతం జరిమానా విధించాడు.

మూడోసారి..

మూడోసారి..

ఇదే సిరీస్‌ తొలి టెస్టులో, ఆ తర్వాత దక్షిణాఫ్రికాతో సెంచూరియన్‌ టెస్టులో కూడా ఇదే తరహాలో స్లో ఓవర్‌ రేట్‌ శిక్షకు గురైన టీమిండియా మొత్తంగా ఈ ఏడాది డబ్ల్యూటీసీలో ఐదు పాయింట్లు ఇలాగే కోల్పోయింది. ఐసీసీ నిబంధన ప్రకారం ఓ జట్టు నిర్ణీత సమయంలో ఎన్ని ఓవర్లు తక్కువగా వేస్తే అన్ని పాయింట్లను కోల్పోవాల్సి వస్తుంది. ఆటగాళ్ల మ్యాచ్‌ ఫీజులో 20 శాతం కోత పడుతుంది. దాంతో డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబు‌ల్‌లో భారత్‌ మూడు నుంచి నాలుగో స్థానానికి పడిపోయింది.

మూడు నుంచి నాలుగుకు..

మూడు నుంచి నాలుగుకు..

ఈ మ్యాచ్ ముందు వరకు మూడో స్థానంలో కొనసాగిన భారత్.. 52.08 విజయాల శాతంతో పాటు 75 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. 84 పాయింట్లు 77.78 విజయాల శాతంతో ఆస్ట్రేలియా టాప్‌లో ఉండగా.. దక్షిణాఫ్రికా (60; 71.43 శాతం), పాకిస్థాన్‌ (44; 52.38 శాతం) భారత్‌ కన్నా ముందున్నాయి. పాయింట్ల శాతం ఆధారంగా జట్ల స్థానాలను నిర్ణయిస్తారన్న విషయం తెలిసిందే. పాయింట్స్ టేబుల్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్ మ్యాచ్ ఆడుతాయి.

6 మ్యాచ్‌లకు 6 గెలవాలి..

6 మ్యాచ్‌లకు 6 గెలవాలి..

ప్రస్తుత పరిస్థితుల్లో టీమిండియా ఫైనల్ చేరడం కష్టంగా కనిపిస్తోంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2021 -23 సైకిల్లో భాగంగా భారత్ ఆడనున్న తదుపరి సిరీస్‌ల్లోని 6 మ్యాచ్‌లకు 6 గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సెప్టెంబర్ - అక్టోబర్ మధ్య సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో 4టెస్టు మ్యాచ్‌ల్లో ఇండియా తలపడనుంది. అలాగే నవంబర్లో బంగ్లాదేశ్ పర్యటనలో రెండు మ్యాచ్‌లు ఆడనుంది. ఈ రెండు సిరీస్‌ల్లోని మొత్తం 6 మ్యాచ్‌లలో 6గెలిస్తే ఇండియాకు 68కి పైగా విన్నింగ్ పర్సంటేజీ వచ్చి ఫైనల్ చేరే అవకాశాలు లభిస్తాయి. అదే సమయంలో ఇతర జట్ల ఫలితాలను కూడా పరిశీలించాల్సి ఉంటుంది.

బంగారంలాంటి అవకాశం..

బంగారంలాంటి అవకాశం..

ఇంగ్లిష్‌ గడ్డపై పరాజయాల పరంపరకు తెరదించి, టెస్టు సిరీస్‌ గెలిచేందుకు వచ్చిన అవకాశాన్ని భారత్‌ ఉపయోగించుకోలేకపోయింది. నిరుడు సిరీస్‌ ఆగిపోయినప్పటికి.. ఇప్పుటికి చాలా మారిన ఇంగ్లిష్‌ జట్టు.. ఏకంగా 378 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి మ్యాచ్‌ను ఎగరేసుకుపోయింది. సిరీస్‌ను 2-2తో సమం చేసింది. ఓవర్‌నైట్‌ స్కోరు 259/3తో చివరి రోజు రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఇంగ్లాండ్‌.. ఇంకో వికెట్‌ కోల్పోకుండానే ఛేదన పూర్తి చేసింది. రూట్‌ (142 నాటౌట్‌; 173 బంతుల్లో 194, 16), 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' బెయిర్‌స్టో (114 నాటౌట్‌; 145 బంతుల్లో 154, 16) చివరి రోజు మరింత ధాటిగా ఆడి మిగతా పని పూర్తి చేశారు. వీళ్లిద్దరూ అభేద్యమైన నాలుగో వికెట్‌కు 269 పరుగులు జోడించారు.

Story first published: Wednesday, July 6, 2022, 8:45 [IST]
Other articles published on Jul 6, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X