న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అందుకే గెలిపించలేకపోయా: సంజూ శాంసన్ (వీడియో)

 Sanju Samson Reveals The Reason Why Team India Could Not Finish Match in 1st IND vs SA ODI

లక్నో: ఓ రెండు షాట్లు ఆడకపోవడం వల్లనే సౌతాఫ్రికాతో తొలి వన్డేలో భారత్‌కు విజయాన్నందుకోలేకపోయానని స్టార్ వికెట్ కీపర్ సంజూ శాంసన్ అన్నాడు. 86 పరుగులతో అజేయంగా నిలిచినప్పటికీ ఓ సిక్స్, బౌండరీ కొడితే ఫలితం భారత్‌కు అనుకూలంగా ఉండేదన్నాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా గురువారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 9 పరుగుల తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లు బాదిన శాంసన్ 86 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన సంజూ శాంసన్.. టాపార్డర్ నెమ్మదిగా ఆడటం వల్లే ఓటమి ఎదురైందా? అనే ప్రశ్నకు తనదైన శైలిలో బదులిచ్చాడు.

 తప్పిదాలు సహజమే..

తప్పిదాలు సహజమే..

ఆటలో తప్పిదాలు చేయడం సహజమన్న సంజూ.. తాను కూడా రెండు షాట్లను సరిగా కనెక్ట్ చేయలేకపోయానని చెప్పాడు. ఈ తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకొని భవిష్యత్తులో మెరుగ్గా రాణించేందుకు ప్రయత్నిస్తానని తెలిపాడు. 'పిచ్ చాలా కఠినంగా ఉంది. బ్యాటింగ్‌కు ఏ మాత్రం అనుకూలంగా లేదు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్ చూస్తే ఈ విషయం అర్థమవుతోంది. తొలి 20 ఓవర్ల పాటు కొత్త బంతితో పరుగులు చేయడం కష్టంగా మారింది. ఆ తర్వాత బంతి పాతబడటంతో బ్యాటింగ్‌కు ఈజీ అయ్యింది.

పిచ్ కఠినంగా..

పిచ్ కఠినంగా..

మిల్లర్, క్లాసెన్ ఈ విషయాన్ని పసిగట్టి చెలరేగారు. 20 ఓవర్ల తర్వాత అయ్యర్, నేను కూడా ఇలానే ధాటిగా ఆడాం. ఈ ఓటమికి ఒకరిని నిందించాల్సిన పనిలేదు. తప్పులు సహజమే. 86 పరుగులతో అజేయంగా నిలిచిన నేను కూడా కొన్ని తప్పిదాలు చేశాను. ఇది ఓ గుణపాఠమే. ఈ తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకొని తదుపరి మ్యాచ్‌కు సిద్దమవ్వాల్సిందే.'అని సంజూ బదులిచ్చాడు. లక్ష్యాన్ని చేధించడంలో విఫలమైనప్పటికీ.. టీమిండియాకు తనవంతు సహకారం అందించడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు.

షంసీ టార్గెట్‌గా..

షంసీ టార్గెట్‌గా..

సౌతాఫ్రికా బౌలర్లు చక్కగా బౌలింగ్ చేశారన్న శాంసన్.. షంసీ కొంచెం ఎక్కువగా పరుగులు ఇచ్చాడని.. దీంతో అతణ్ని టార్గెట్ చేయొచ్చని అనిపించిందన్నాడు. 'షంసీ చివరి ఓవర్ బౌలింగ్ చేస్తాడని మాకు తెలుసు. చివరి ఓవర్లో 24 పరుగులు చేయాల్సి వస్తే నాలుగు సిక్స్‌లు కొట్టగలనని నాకు నమ్మకం ఉంది. అందుకే ఆటను సాధ్యమైనంత వరకూ పొడిగించుకుంటూ పోయాను. అదే మా ప్లాన్.. బ్యాటర్లు చక్కగా రెస్పాండ్ అయ్యారు'' అని శాంసన్ వ్యాఖ్యానించాడు.

కేవలం 9 బంతులే..

చివరి 18 బంతుల్లో భారత్ విజయానికి 45 పరుగులు అవసరం కాగా.. అందులో శాంసన్ 9 బంతులను మాత్రమే ఎదుర్కొన్నాడు. 39వ ఓవర్లో శాంసన్ అసలు స్ట్రయికింగ్‌కు రాలేదు. రబడా వేసిన ఆ ఓవర్లో 7 పరుగులు మాత్రమే వచ్చాయి. శాంసన్ 39వ ఓవర్లోనూ స్ట్రయికింగ్ చేసి ఉండుంటే బాగుండేదని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఫైనల్ ఓవర్లో భారత్ విజయానికి 30 పరుగులు అవసరమైన దశలో మూడో బంతి వరకూ శాంసన్ భారత్‌ను రేసులో ఉంచాడు. కానీ నాలుగో బంతిని కనెక్ట్ చేయలేకపోవడంతో మ్యాచ్ సౌతాఫ్రికా వైపు మొగ్గింది.

Story first published: Friday, October 7, 2022, 15:27 [IST]
Other articles published on Oct 7, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X