న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నా మద్దతు ఎప్పుడూ భారత్‌కే అని మాలిక్‌తో వాదిస్తా: సానియా మీర్జా

Sania Mirza narrates an old banter with hubby Shoaib Malik

హైదరాబాద్: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా.. పాకిస్థాన్ సీనియర్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరి వివాహంపై భారత్‌లో ఓ వర్గం అభిమానులు అప్పట్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 2010 ఏప్రిల్‌లో వీరి వివాహం జరగ్గా.. రెండేళ్ల క్రితం 2018 అక్టోబర్‌లో ఇజాన్ మీర్జా మాలిక్ జన్మించాడు. వీరి వివాహం నేపథ్యంలో ఇప్పటికీ సానియా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటూనే ఉంటుంది. ముఖ్యంగా భారత్-పాక్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు, ఇరుదేశాల మధ్య రాజకీయంగా ఉద్రిక్తతలు చోటుచేసుకున్నప్పుడు కొంతమంది సానియా మీర్జాను టార్గెట్ చేస్తూ ట్రోల్ చేస్తుంటారు. వీటికి ఈ హైదరాబాద్ స్టార్‌కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తోంది. అయితే భారత్-పాక్ మ్యాచ్‌ల విషయంలో మాలిక్‌తో కూడా తనకు సరదాగా వాగ్వాదం జరుగుతుందని సానియా మీర్జా తాజాగా వెల్లడించింది. తన మద్దతు ఎప్పుడూ భారత్‌కే ఉంటుందని అంటే.. మాలిక్ భారత్‌పై ఉన్న తన వ్యక్తిగత రికార్డులను ప్రస్తావిస్తాడని స్పోర్ట్స్ కీదాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది.

 మాలిక్ ఎప్పుడూ అదే చెబుతాడు..

మాలిక్ ఎప్పుడూ అదే చెబుతాడు..

‘మా రిలేషన్‌షిప్ చాలా ఫన్నీగా ఉంటుంది. మేం కూడా అలా ఉండటానికే ఇష్టపడతాం. భారత్‌‌తో ఆడేందుకు మాలిక్ తెగ ఇష్టపడుతాడు. మేం డేటింగ్‌లో ఉన్నప్పుడు.. కలిసి మాట్లాడుకునేటప్పుడు.. నా సపోర్ట్ ఎప్పుడూ భారత్‌కే ఉంటుందంటా. అతను ‘భారత్‌పై నా రికార్డ్ బాగుంది'అని తరుచూ చెబుతుంటాడు. ఇలా ఇద్దరం సరదాగా వాదులాడుకుంటాం. సుదీర్ఘకాలంగా క్రికెట్ ఆడుతున్న మాలిక్ పట్ల నేను గర్వంగా ఫీలవుతున్నా.'అని సానియా తెలిపింది.

 నాలుగు సెంచరీలు..

నాలుగు సెంచరీలు..

ఇక సానియా అన్నట్లు మాలిక్‌కు భారత్‌పై మంచి రికార్డు ఉంది. అతను భారత్‌తో 52 వన్డేలు ఆడి 46.89 సగటుతో 1,782 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలున్నాయి. కొలంబో వేదికగా చేసిన సెంచరీ టాప్ స్కోర్ 143. ఇక 2019 వన్డే ప్రపంచకప్ అనంతరం మాలిక్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. ప్రస్తుతం టీ20 సిరీస్‌కోసం ఇంగ్లండ్‌లో ఉన్నాడు.

 ధోనీని చూస్తే మాలిక్ గుర్తొస్తాడు..

ధోనీని చూస్తే మాలిక్ గుర్తొస్తాడు..

ఇదే ఇంటర్వ్యూలో ధోనీ వ్యక్తిత్వం తన భర్త వ్యక్తిత్వాన్ని గుర్తు చేస్తుందని సానియా మీర్జా తెలిపింది. ధోనీ ప్రవర్తన ఎప్పుడూ తన భర్తను గుర్తు చేస్తుందని, ఇద్దరూ చాలా కూల్‌గా, సరదాగా ఉంటారని చెప్పారు. ధోనీ ఓ లెజెండ్ అని, తన ఆల్‌టైం ఫేవరెట్ ఆటగాళ్లలో ధోనీకి ప్రత్యేక స్థానం ఉందని సానియా పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ధోనీ రిటైర్మెంట్‌పై మాట్లాడిన సానియా.. ధోనీ కోరుకుంటే అతడి కోసం కచ్చితంగా ఫేర్‌వెల్ మ్యాచ్ నిర్వహించాలని ఆమె అన్నారు. అయితే ధోనీ.. మైదానంలో తన ప్రదర్శనపై తప్ప గొప్ప వీడ్కోలపై ఆశచూపడని సానియా అభిప్రాయపడ్డారు.

నీ తరంలో అథ్లెట్‌ అయినందుకు గర్విస్తున్నా..

నీ తరంలో అథ్లెట్‌ అయినందుకు గర్విస్తున్నా..

అంతకుముందు ధోనీ రిటైర్మెంట్‌పై‌ సానియా మీర్జా ట్విటర్ వేదికగా స్పందించింది. మహీ ఆడిన తరంలోనే అథ్లెట్‌ అయినందుకు గర్విస్తున్నానని తెలిపింది. 'ఎంఎస్ ధోనీ నువ్వో దిగ్గజం. నా ఆల్‌టైమ్‌ ఫేవరెట్‌ క్రీడాకారుల్లో నువ్వూ ఒకడివి. దేశం కోసం నువ్వు చేసిన సేవకు ధన్యవాదాలు. నీ భవిష్యత్‌ మరింత బాగుండాలని ఆశిస్తున్నా. నువ్వు ఆడిన తరంలోనే, ఇదే దేశం తరఫున నేను కూడా ఒక క్రీడాకారిణి‌ అయినందుకు గర్విస్తున్నా' అని సానియా మీర్జా ట్వీట్ చేసింది.

గంగూలీపై వేటు వేయడం నాకేం పెద్ద నిర్ణయం అనిపించలేదు: కేకేఆర్ సీఈవో

Story first published: Monday, August 24, 2020, 14:47 [IST]
Other articles published on Aug 24, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X