
ఐపీఎల్‌లో విఫలం..
అంతర్జాతీయ క్రికెట్‌లో ఇంత సక్సెస్ అందుకున్న దాదా.. ఐపీఎల్ మాత్రం ఆ మ్యాజిక్‌ను రిపీట్ చేయలేకపోయాడు. కోల్‌కతా ప్రిన్స్‌గా 2008 ఆరంభ సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు పగ్గాలందుకున్నాడు. కానీ ఆశించిన మేర ఫలితాన్ని చూపించలేకపోయాడు. ఆ సీజన్‌లో జట్టు ఆరోస్థానంతో సరిపెట్టుకోగా.. అనంతరం జరిగిన రెండు సీజన్లలో దారుణంగా విఫలమైంది. మధ్యలో గంగూలీ కెప్టెన్సీ కూడా కోల్పోయి.. మళ్లీ అందుకున్నాడు. అయినా కోల్‌కతా రాత మారలేదు.

2011లో వేటు..
ఈ పరిస్థితుల్లో కోల్‌కతా యాజమాన్యం పెద్ద సాహసమే చేసింది. 2011 సీజన్‌కు ముందు జరిగి మెగా వేలంలో గంగూలీని రిటైన్ చేసుకోకుండా వదిలేసింది. అప్పట్లో ఇది పెద్ద సంచలనమైంది. వీపరితమైన అభిమాన గణం ఉన్న బెంగల్ గడ్డపై సొంతఫ్రాంచైజీ దాదాను తప్పించడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అనంతరం రెండు సీజన్లు ఆడిన దాదా పుణె వారియర్స్ తరఫున బరిలోకి దిగాడు. ఇక దాదాకు బదులు గంభీర్‌ను తీసుకున్న కేకేఆర్ అనుకున్న ఫలితాన్ని సాధించింది. 2011 సీజన్‌లో ప్లే ఆఫ్‌కు చేరిన ఆ జట్టు.. 2012లో టైటిల్ గెలుచుకుంది.

అప్పుడే జట్టులో చేరడంతో..
తాజాగా దాదా వేటు నిర్ణయంపై కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్ స్పందించాడు. అప్పట్లో గంగూలీపై వేటు వేయడం తనకేం పెద్ద నిర్ణయం అనిపించలేదన్నాడు. ఓ యూట్యూబ్ చానెల్‌తో మాట్లాడుతూ.. తాను అప్పుడే జట్టులోకి రావడంతో గంగూలీతో పెద్దగా అటాచ్ లేకపోవడం ఈ నిర్ణయం తీసుకోవడానికి సులువైందన్నాడు.‘గంగూలీని రిటైన్ చేసుకోకపోవడం వ్యక్తిగతంగా నాకేం పెద్ద నిర్ణయం అనిపించలేదు. ఎందుకంటే అతనితో నాకేం అంత అటాచ్ లేదు. ప్రారంభం నుంచి ఫ్రాంచైజీతో ఉంటే ఈ నిర్ణయం తీసుకోవడం కష్టమయ్యేది. ఓ రెండేళ్లు ముందు వచ్చినా నాకు కఠినమయ్యేది'అని తెలిపాడు. ఇక వెంకీ మైసూర్ 2010లో కోల్‌కతా సీఈవోగా నియమితులయ్యారు.

షారుఖ్ అండగా నిలిచాడు..
ఇక తన ప్రతిపాదనకు సహయజమానులు అండగా నిలిచారని, బయట నుంచి వచ్చిన కాబట్టే సులువుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. ‘బయట నుంచి వచ్చిన కాబట్టే సులువుగా నిర్ణయం తీసుకున్నా. కానీ ఫ్రాంచైజీకి, సహయజమానులకు అది ఎంతో కష్టమో నేను గ్రహించాను. ఓ విధానాన్ని రూపొందించమన్నారు కాబట్టి నేను ఈ నిర్ణయం తీసుకున్నా. ఇక ఈ విషయం చెప్పే ముందు సరైందో కాదో నాకు తెలియదు. కానీ అందరం ఎదుర్కోవాల్సిందేనని చెప్పా. నా ప్రతిపాదనకు షారుఖ్ ఖాన్, జయ్, జుహీ అండగా నిలిచారు'అని వెంకీ మైసూర్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం కోల్‌కతా జట్టును దినేశ్ కార్తీక్ నడిపిస్తుండగా.. ఆ జట్టు ఇప్పటికే దుబాయ్ చేరుకుంది.


Click it and Unblock the Notifications

బీజేపీలోకి సౌరవ్ గంగూలీ.? అందుకేనా అలా చేసింది?










