విరాట్ కోహ్లీలో సగం ఫిట్‌నెస్ ఉన్నా.. రోహిత్ క్రికెట్ ప్రపంచాన్ని శాసించేవాడు: పాక్ మాజీ క్రికెటర్

కరాచీ: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ బట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీలో సగం ఫిట్‌నెస్ రోహిత్ శర్మకు ఉన్నా.. అతను క్రికెట్ ప్రపంచాన్ని శాసించేవాడని తెలిపాడు. అతనికి అపారమైన నైపుణ్యం ఉందని చెప్పాడు. క్రికెట్‌లో ఎంత టాలెంట్ ఉన్నా ఫిటెనెస్ లేకుండా ఏం చేయలేమని చెప్పాడు.

మైదానంలో పరుగుల సునామీ సృష్టించే హిట్‌మ్యాన్‌ ఓ చిన్న మార్పు చేసుకుంటే అతన్ని ఎవరూ ఆపలేరని పేర్కొన్నాడు. ప్రపంచ క్రికెట్‌లో ఏబీ డివిలియర్స్‌ స్థాయిని అందుకొంటాడని తెలిపాడు. సల్మాన్‌ బట్‌ తన యూట్యూబ్‌ చానల్‌ వేదికగా ఈ వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచ నెంబర్ వన్, టూ ర్యాంకుల్లో ఉన్న పాక్ ప్లేయర్లు బాబర్ ఆజామ్, మహమ్మద్ రిజ్వాన్‌లతో రోహిత్‌ను పోల్చలేమని సల్మాన్ బట్ చెప్పుకొచ్చాడు.

'రోహిత్‌ శర్మను బాబర్‌ ఆజామ్, మమమ్మద్ రిజ్వాన్‌తో పోల్చలేము. అతనికి ఉన్న నైపుణ్యానికి విరాట్ కోహ్లీలో సగం ఫిట్‌నెస్‌ సాధించినా.. ప్రపంచంలో అతడంత విధ్వంసకర ఆటగాడు మరొకడు ఉండడు. అతని పోలిక కేవలం ఏబీ డివిలియర్స్‌తోనే ఉంటుంది. ఒక వేళ కోహ్లీ స్థాయిలో పూర్తి ఫిట్‌నెస్‌ సాధిస్తే.. అతను ఏం చేస్తాడో అంచనాలకు అందదు' అని సల్మాన్‌ బట్‌ చెప్పుకొచ్చాడు.

తాజాగా వెలువడిన టీ20 ర్యాంకింగ్స్‌లో పాక్‌ ఆటగాళ్లు బాబర్‌ ఆజామ్‌, మహమ్మద్‌ రిజ్వాన్‌ తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. అయినా.. సల్మాన్‌ వారిని రోహిత్‌ పోల్చేందుకు నిరాకరించడం గమనార్హం. ఆ ర్యాంకింగ్స్‌లో రోహిత్‌ 14, కోహ్లీ 29వ ర్యాంకుల్లో ఉన్నారు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఇప్పటికే రోహిత్‌ను విధ్వంసకర ఆటగాడిగా పరిగణిస్తారు. ఇక ఇటీవల కాలంలో దూకుడు మంత్రం జపిస్తున్న రోహిత్ శర్మ.. తన శైలికి భిన్నంగా తొలి బంతి నుంచే ధాటిగా ఆడుతున్నాడు. ఆసియాకప్‌లో హాఫ్ సెంచరీతో రాణించి ఫామ్‌లోకి వచ్చాడు.

టీ20 ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ రాణించడంపైనే టీమిండియా విజయవకాశాలు ఆధారపడి ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. పవర్ ప్లేలో అతను చేసే పరుగులు జట్టుకు ఉపయోగపడనున్నాయి.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Tuesday, September 13, 2022, 16:38 [IST]
Other articles published on Sep 13, 2022

Latest Videos

  + More
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Yes No
  Settings X