రాత్రిపూట గల్లీ క్రికెట్ ఆడిన సచిన్ వీడియో వైరల్

Posted By:
Sachin Tendulkar Tries His Hand at Gully Cricket, Take a Look

హైదరాబాద్: సచిన్ టెండూల్కర్... క్రికెట్ ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. అంతర్జాతీయ క్రికెట్‌కు 24 ఏళ్ల పాటు తన సేవలందించారు. తన పేరిట ఎన్నో ప్రపంచ రికార్డులను నెలకొల్పాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినప్పటికీ, ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీకి మార్గనిర్దేశనం చేస్తూ ఇంకా క్రికెట్‌తో తన అనుబంధాన్ని కొనసాగిస్తున్నాడు.

ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్

రిటైర్‌మెంట్‌ తర్వాత సచిన్ టెండూల్కర్ కుటుంబంతో ఎక్కువ సమయాన్ని గడుపుతున్నాడు. తాజాగా సచిన్ ముంబై గల్లీలో కొంతమంది యువకులతో కలిసి క్రికెట్ ఆడాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌ అయింది. సచిన్‌ బ్యాటింగ్‌ చేస్తుండగా, కొంత మంది యువకులు ఫీల్డింగ్‌ చేశారు.

పరిసరాలను బట్టి అది విల్లే పార్లేలోని రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతమని తెలుస్తోంది. రోడ్డుపైనే క్రికెట్‌ ఆడుతుండటంతో వికెట్లుగా ప్లాస్టిక్‌ డివైడర్‌ని వాడారు. అంతర్జాతీయ క్రికెట్‌కు 2013లో రిటైర్మెంట్ ప్రకటించిన సచిన్ తన ఐపీఎల్ కెరీర్‌లో 78 మ్యాచ్‌ల్లో 2,334 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీతో పాటు 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Tuesday, April 17, 2018, 10:09 [IST]
Other articles published on Apr 17, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి