న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్రికెట్‌లో ఆ నిబంధనను మార్చాలి: సచిన్ టెండూల్కర్

Sachin Tendulkar Says If DRS shows that the ball is hitting the stumps, batsman should be given out

న్యూఢిల్లీ: క్రికెట్‌లో అంపైర్ల తప్పిదాలను సవాల్ చేసేందుకు ఆటగాళ్లకు కల్పించిన వెసులు బాటు డిసిషన్ రివ్యూ సిస్టమ్(డీఆర్ఎస్). ఈ సమీక్ష పద్దతిని ఐసీసీ 2008లో తొలిసారి ప్రవేశపెట్టింది. ఇక ఈ పద్దతిపై భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్.. వెస్టిండీస్ లెజెండ్ బ్రియాన్ లారాతో కలిసి చర్చించాడు. కరోనా నేపథ్యంలో డీఆర్‌ఎస్‌ల సంఖ్యను పెంచుతూ ఐసీసీ తీసుకున్న నిర్ణయాన్ని మాస్టర్ స్వాగతించాడు. అయితే డిఆర్‌ఎస్ విషయంలో 'అంపైర్స్ కాల్' అనే నిబంధనను మార్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా ఎల్బీడబ్ల్యూ విషయంలో దీన్ని సవరించాల్సిన అవసరం ఉందని అపెక్స్ బోర్డుకు సూచించాడు.

అంపైర్స్ కాల్ అంటే..

అంపైర్స్ కాల్ అంటే..

రివ్యూలో బంతి వికెట్లకు తాకితే బ్యాట్స్‌మన్‌ను ఔటివ్వాలన్నాడు. ఇక క్లిష్టమైన ఎల్బీడబ్ల్యూ నిర్ణయాల్లో అంపైర్లకు ఐసీసీ ఈ డీఆర్ఎస్ విషయంలో కొంత వెసులుబాటు కల్పించింది. బంతి 50 శాతం వికెట్లను హిట్ చేయగలిగితే ఔటివ్వాలని, అంతకు తక్కువగా ఉంటే అంపైర్ తీసుకునే నిర్ణయం(అంపైర్స్ కాల్) ఫైనలనే నిబంధన పెట్టింది. అంటే 50 శాతం కంటే తక్కవగా బంతి వికెట్లను తాకితే అంపైర్ ఔటిస్తే ఔట్ లేకుంటే లేదు. దీన్నే అంపైర్స్ కాల్ అంటారు.

వికెట్లకు తాకితే..

వికెట్లకు తాకితే..

అయితే సచిన్ మాత్రం బంతి వికెట్లకు తాకితే ఔటివ్వాల్సిందేనంటున్నాడు. లారాతో చర్చించిన వీడియోను తన అధికారిక ట్విటర్‌లో షేర్ చేశాడు.‘ఇక్కడ బంతి ఎంత శాతం వికెట్లను తాకిందనేది అనవసరం. రివ్యూలో బంతి వికెట్లు తాకితే ఫీల్డ్ అంపైర్ నిర్ణయంతో సంబంధం లేకుండా ఔటివ్వాల్సిందే. క్రికెట్‌లో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం వెనుక ఉన్న ఉద్దేశ్యమే ఇది. అయితే టెక్నాలజే 100 శాతం సరైనదని చెప్పలేం. కానీ మానవులతో పోలిస్తే కొంచెం బెటరే'అని సచిన్ చెప్పుకొచ్చాడు.

100 శాతం కరెక్ట్

ఇక సచిన్ సూచించిన ప్రతిపాదనతో భారత వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఏకీభవించాడు. సచిన్ చెప్పింది 100 శాతం సరైనది ట్విటర్ వేదికగా వెల్లడించాడు. ‘పాజీ మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నా. మీరు చెప్పింది 100 శాతం కరెక్ట్. బంతి వికెట్లను తాకినా.. ముద్దాడినా ఔట్ ఇవ్వాల్సిందే. ఇక్కడ బంతి ఎంత శాతం తాకిందనేది అనవసరం. మెరుగైన ఆటకోసం కొన్ని నిబంధనలు మార్చాలి. అందులో ఇదొకటి'అని భజ్జీ ట్వీట్ చేశాడు.

అంపైర్లపై విమర్శలు..

అంపైర్లపై విమర్శలు..

ఇక డీఆర్‌ఎస్ పుణ్యమా అంపైర్ల ఘోర తప్పిదాలు బయటపడ్తున్నాయి. ఇక కరోనా నేపథ్యంలో స్థానిక అంపైర్లను ఉపయోగించుకోవాలని ఐసీసీ కల్పించిన వెసులుబాటు కొత్త తలనొప్పులను తీసుకొస్తుంది. ప్రస్తుతం ఇంగ్లండ్-వెస్టిండీస్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్‌లో అంపైర్ల ఘోర తప్పిదాలు తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఇద్దరు అంపైర్లు రెండు రోజుల్లోనే ఐదు తప్పిదాలు చేయడం.. అవి కూడా ఆతిథ్య జట్టుకు అనుకూలంగా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది.

Story first published: Sunday, July 12, 2020, 13:07 [IST]
Other articles published on Jul 12, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X