న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఫస్ట్ సెంచరీ, రక్తపు జెర్సీతో ఆడిన మ్యాచ్ వరవలేనిది: సచిన్ టెండూల్కర్

Sachin Tendulkar remembers first of his 100 international tons

హైదరాబాద్: స‌చిన్ టెండూల్క‌ర్.. ఈ పేరు వింటేనే ఏదో తెలియ‌ని వైబ్రేష‌న్స్.! అతను బ్యాటింగ్‌కు దిగితే పూనకమే! 22 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో ఆటు పోట్లు ఎదుర్కొన్న మాస్టర్ బ్లాస్టర్ క్రికెట్‌కే వన్నెతెచ్చాడు. 16 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసి ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సొంతం చేసుకున్నాడు. వన్డేల్లో అసాధ్యమైన డబుల్ సెంచరీని సుసాధ్యం చేశాడు. 100 సెంచరీలతో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. క్రికెటంతా ఒక చరిత్ర అయితే తనే ఓ చరిత్రగా మిగిలి 'భారత రత్నం'అయ్యాడు. మైదానంలో తిరుగులేని శక్తిగా.. ప్రపంచ క్రికెట్ ముఖ చిత్రంగా నిలిచిన సచిన్ తన తొలి సెంచరీని 30 ఏళ్ల కిత్రం(1990,ఆగస్టు 14) ఇదే రోజు సాధించాడు. ఇంగ్లండ్‌తో జరిగిన నాటి టెస్ట్‌ మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీతో కదం తొక్కాడు. తద్వారా 17 ఏళ్ల వయసులోనే సెంచరీ చేసిన అత్యంత పిన్నవయస్కుడి రికార్డు నెలకొల్పాడు.

 8 టెస్ట్‌ల తర్వాత..

8 టెస్ట్‌ల తర్వాత..

ఆ మ్యచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ జట్టు 519 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్.. నాటి కెప్టెన్‌ మమ్మద్‌ అజారుద్దీన్‌( 179), సచిన్‌( 68) రాణించడంతో 432 పరుగుల చేసింది. తర్వాత ఇంగ్లండ్ 320 పరుగులు చేయడంతో భారత్‌ ముందు 407 పరుగుల విజయలక్ష్యం నమోదైంది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ దిగిన సచిన్‌ 225 నిమిషాల పాటు క్రీజులో ఉండి, 189 బంతుల్లో 119 పరుగులు చేశాడు. దీంతో భారత్‌ 343/6 చేసి మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. 1989లో అరంగేట్రం చేసిన సచిన్‌కు ఫస్ట్‌ సెంచరీ చేయడానికి 8 టెస్టుల వరకు ఆగాల్సి వచ్చింది.

అప్పుడే 30 ఏళ్ల..

అప్పుడే 30 ఏళ్ల..

ఇక తన తొలి సెంచరీకి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సచిన్ ఆసక్తికర విషయాలు వెళ్లడించాడు. ఫస్ట్ సెంచరీపై స్పందిస్తూ అప్పుడే 30 ఏళ్ల అయిందా? నిన్ననే జరిగినట్లు ఉందని తెలిపాడు. ‘నా ఫస్ట్ సెంచరీ ఆగస్ట్ 14న చేశా. ఆ మరుసటి రోజే భారత స్వాతంత్యదినోత్సవం. అందే ఆ శతకం నాకు ప్రత్యేకం. ఆ మరుసటి రోజు పత్రికల్లో హెడ్‌లైన్ కూడా చాలా విభిన్నంగా వచ్చింది. ఆ మ్యాచ్ డ్రా కావడంతో మేం సిరీస్‌లో నిలిచాం. పోటీని తదుపరి మ్యాచ్‌కు తీసుకెళ్లాం. ఆ మ్యాచ్ నాకు ఓ కొత్త అనుభవాన్ని ఇచ్చింది.

 రక్తపు జెర్సీతో..

రక్తపు జెర్సీతో..

అంతకుముందు పాకిస్థాన్‌తో కూడా ఇదే తరహా బ్యాటింగ్‌తో ఓటమి నుంచి తప్పుకున్నాం. ఆ మ్యాచ్‌లో వకార్ యూనీస్ వేసిన బంతికి నా ముక్కు పగిలి రక్తం కూడా కారింది. నా జెర్సీ మొత్తం రక్తంతో తడిసింది. అయినా బ్యాటింగ్ చేసి 57 రన్స్ చేశా. 38 పరుగులకే 4 వికెట్లు పోయిన దశ నుంచి మేం మ్యాచ్‌ను కాపాడుకున్నాం. అలాగే నేను ఫస్ట్ సెంచరీ చేసిన మ్యాచ్‌లో డేవన్ మాల్కోమ్ వేసిన ఓ బంతి నా తల వెనుక భాగం తాకింది. డెవన్, వకార్ ఆ సమయంలో 90 మైళ్ల స్పీడ్‌తో బంతులు వేసేవారు. ఆ దెబ్బలకు కనీసం నేను ఫిజియోను కూడా పిలవలేదు. ఎందుకంటే నేను నొప్పితో విలవిలలాడుతున్నట్లు బౌలర్‌కు తెలియవద్దని అలా చేశా. ఇలాంటి ఘటనలను తట్టుకునేలా ఆర్చ్‌రేకర్ సర్ నన్ను సిద్దం చేశాడు.

 షాంపైన్ బాటిల్..

షాంపైన్ బాటిల్..

ఆ మ్యాచ్‌లో నాకు జతగా మనోజ్ చక్కని సహకారం అందించాడు. మేం ఇద్దరం 160 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాం. 183/6 వికెట్లు కోల్పోయిన దశ నుంచి మ్యాచ్ గట్టెక్కించాం. ఆ మ్యాచ్‌లో నాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా షాంపైన్ బాటిల్ ఇచ్చారు. అది తాగడానికి నాకు లీగల్ ఏజ్ లేదు. దీంతో నా సహచరులంతా ఆ బాటిల్‌తో ఏం చేసుకుంటావని ఆటపట్టించారు. ఇక సెంచరీ చేసినందుకు ఆ మ్యాచ్‌లో సంజయ్ మంజ్రేకర్ నాకు ఓ వైట్ షర్ట్ గిఫ్ట్‌గా ఇచ్చాడు. అది నా మనసుకు తాకింది'అని సచిన్ చెప్పుకొచ్చాడు.

ఇదేం స్టైల్ సామీ.. పవాద్ అలామ్ బ్యాటింగ్ స్టాన్స్‌పై పేలుతున్న జోకులు, మీమ్స్!

Story first published: Friday, August 14, 2020, 14:45 [IST]
Other articles published on Aug 14, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X