Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇదేం స్టైల్ సామీ.. పవాద్ అలామ్ బ్యాటింగ్ స్టాన్స్‌పై పేలుతున్న జోకులు, మీమ్స్!

England vs Pakistan: Twitter trolls Fawad Alam for his unique batting stance
NZ v PAK 2020 : Twitter Trolls Fawad Alam For His Unique Batting Stance

సౌతాంప్టన్: దశాబ్ద కాలం తర్వాత పాకిస్థాన్ జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చిన మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ ఫవాద్ ఆలమ్‌‌పై నెట్టింట జోకులు పేలుతున్నాయి. 11 ఏళ్ల నిరీక్షణ తర్వాత వచ్చిన అవకాశాన్ని ఫవాద్ చేజార్చుకోవడం ఓ కారణమైతే.. క్రీజులో అతని బ్యాటింగ్ స్టాన్స్ మరొక కారణం. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన పవాద్ అలామ్.. వెస్టిండీస్ మాజీ క్రికెటర్ శివనరైన్ చందర్‌పాల్ తరహాలో బ్యాటింగ్ స్టాన్స్ తీసుకుని అందర్నీ ఆశ్చర్యపరిచాడు. కొత్త స్టాన్స్ కారణంగా క్రీజులో సౌకర్యంగా కదల్లేకపోయిన అతను.. ఆఫ్ స్టంప్‌ లైన్‌కి వెళ్లి బంతిని ఆడే ప్రయత్నం చేసి వికెట్ల ముందు అడ్డంగా దొరికిపోయాడు. దీంతో తన 10 సంవత్సరాల 259 రోజులు... సరిగ్గా చెప్పాలంటే 3911 రోజులు నిరీక్షణ బూడిదపాలైంది. గురువారం సౌతాంప్టన్‌లో ప్రారంభమైన రెండో టెస్టులో బరిలోకి దిగిన ఫవాద్, దీనికి ముందు తన ఆఖరి టెస్టును 28 నవంబర్, 2009న ఆడాడు. ఈ మధ్య కాలంలో పాక్‌ ఆడిన 88 టెస్టుల్లో అతనికి అవకాశం దక్కలేదు.

మాటల్లో వర్ణించలేం..

తన తొలి 3 టెస్టుల్లో 1 సెంచరీ సహా 41.66 సగటుతో 250 పరుగులు చేసినా... దురదృష్టవశాత్తూ అతనికి వేర్వేరు కారణాలతో మళ్లీ టెస్టు ఆడే అవకాశం రాలేదు. ఆ తర్వాత పాక్‌ దేశవాళీ క్రికెట్‌లో టన్నుల కొద్దీ పరుగులు సాధించి పలు రికార్డులు నెలకొల్పిన తర్వాత ఎట్టకేలకు ఇప్పుడు మళ్లీ దేశం తరఫున టెస్టు ఆడాడు. కానీ తొలి ఇన్నింగ్స్‌లో క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో ‘డకౌట్‌'గా వెనుదిరిగాడు. రివ్యూ తర్వాత అంపైర్‌ అవుట్‌గా ప్రకటించిన సమయంలో అతని మొహంలో కనిపించిన విషాద భావాన్ని మాటల్లో వర్ణించలేం.

అంపైరే అయోమయం..

అంపైరే అయోమయం..

వాస్తవానికి పవాద్ అలామ్ విచిత్రమైన స్టాన్స్‌తో అయోమయానికి గురైన ఫీల్డ్ అంపైర్ తొలుత ఔట్ ఇవ్వలేదు. దీంతో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ డీఆర్‌ఎస్ కోరగా.. బంతి మిడిల్ స్టంప్‌ను తాకుతున్నట్లు రిప్లైలో స్పష్టమవడంతో అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. దీంతో పవాద్ అలామ్ స్టాన్స్‌పై ఇప్పుడు సోషల్ మీడియాలో అభిమానులు కుళ్లు జోకులు, ఫన్నీ మీమ్స్‌ను పేల్చుతున్నారు.

ఫవాద్ ఫైదా ఏముంది..?

ఫవాద్ ఫైదా ఏముంది..?

నీదేం బ్యాటింగ్ స్టాన్స్ సామీ అని ఒకరంటే.. అయినా ఆ రకమైన స్టాన్స్‌తో ఏం చేద్దాం అనుకున్నావని ఇంకొకరు కామెంట్ చేశారు. వెస్టిండీస్ క్రికెటర్ శివ నరైన్ చందర్ పాల్‌లా ఉందని మరికొందరూ కామెంట్ చేశారు. ఫవాద్ బ్యాటింగ్ స్టాన్స్ చూసి ఇంగ్లండ్ బౌలర్లకు పిచ్చెక్కిందని, ఈ బ్యాటింగ్ స్టాన్స్‌తో ఫవాద్ మూల్యం చెల్లించుకున్నాడని ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. 11 ఏళ్ల తర్వాత అవకాశం వచ్చిన మ్యాచ్‌లో 100 పరుగులతో సెంచరీ చేజార్చుకున్న ఫవాద్ అని వ్యంగ్యాస్త్రాలు కూడా సంధిస్తున్నారు.

పాక్ 126/5

పాక్ 126/5

ఓవైపు వర్షంతో అంతరాయం.. మరోవైపు ఇంగ్లండ్ బౌలర్ల విజృంభణ.. ఈ నేపథ్యంలో నిలకడలేని పాకిస్థాన్ బ్యాటింగ్ మరోసారి తడబాటుకు గురైంది. స్పూర్తిదాయక పోరాటం చేయాల్సిన చోట ఓపికను చూపట్టలేక చేజేతులా వికెట్లు పారేసుకుంది. దీంతో ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి పాక్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 45.4 ఓవర్లలో 5 వికెట్లకు 126 రన్స్ చేసింది. క్రీజులో బాబ ర్‌ ఆజమ్‌ (25 బ్యాటింగ్‌), రిజ్వాన్‌ (4 బ్యాటింగ్‌) ఉన్నారు.

England vs Pakistan: Twitter trolls Fawad Alam for his unique batting stance
Story first published: Friday, August 14, 2020, 12:59 [IST]
Other articles published on Aug 14, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+