న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వారెవ్వా సచిన్.. ఆరున్నరేళ్ల తర్వాత బ్యాట్ పట్టి తొలిబంతినే..

 Sachin Tendulkar bats for an over against Ellyse Perry in Bushfire charity match

మెల్‌బోర్న్: అంతర్జాతీయ క్రికెట్ వీడ్కోలు పలికి ఆరున్నరేళ్లు గడిచినా.. త‌న‌లో ఏ మాత్రం సత్తా తగ్గ‌లేద‌ని భార‌త దిగ్గ‌జ బ్యాట్స్‌మెన్ స‌చిన్ టెండూల్క‌ర్ నిరూపించాడు. ఎదుర్కొన్న తొలి బంతినే బౌండరీకి తరలించి ఔరా అనిపించాడు. బుష్‌ఫైర్ బాధితుల సహాయార్థం మెల్ బోర్న్ వేదికగా క్రికెట్ ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లతో పాంటింగ్ ఎలెవన్ vs గిల్‌క్రిస్ట్ ఎలెవన్ మధ్య 'బుష్‌ఫైర్ క్రికెట్ బాష్ చారిటీ మ్యాచ్‌' నిర్వహించింది.

ఓడామనే బాధలేదు.. మూడో వన్డేలో మార్పులుంటాయి: కోహ్లీఓడామనే బాధలేదు.. మూడో వన్డేలో మార్పులుంటాయి: కోహ్లీ

ఇన్నింగ్స్ విరామంలో..

ఈ మ్యాచ్‌లో రికీపాంటింగ్ ఎలెవన్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించిన సచిన్.. ఇన్నింగ్స్ విరామంలో సరదాగా బ్యాటింగ్ చేశాడు.

అద్భుతమైన ఫ్లిక్ షాట్‌తో తొలి బంతినే బౌండ‌రీకి తరలించాడు. ఆసీస్ మ‌హిళా బౌల‌ర్ ఎలీసా పెర్రీ, అన్నాబెల్ స‌ద‌ర్లాండ్ బౌలింగ్‌ను ఎదుర్కొన్నాడు. చాలా బంతుల‌ను మిడిల్ చేసిన స‌చిన్‌.. త‌న టైమింగ్‌లో ఎలాంటి మార్పు లేద‌ని నిరూపించాడు. అయితే ఎలీసా పెర్రీ ఛాలెంజ్ నేపథ్యంలోనే మాస్టర్ బ్యాటింగ్ చేశాడు.

సచిన్ జట్టే గెలుపు..

సచిన్ జట్టే గెలుపు..

ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో గిల్‌క్రిస్ట్ ఎలెవ‌న్‌పై ఒక్క ప‌రుగు తేడాతో పాంటింగ్ ఎలెవ‌న్ విజ‌యం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాంటింగ్ లెవ‌న్ నిర్ణీత 10 ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్ల‌కు 104 ప‌రుగులు చేసింది. వెస్టిండీస్ దిగ్గ‌జం బ్రియాన్ లారా (11 బంతుల్లో 30 రిటైర్డ్ ఔట్‌, 3 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. కెప్టెన్ రికీ పాంటింగ్ (26), మ‌థ్యూ హేడెన్ (16) రాణించారు. టీమిండియా ఆల్‌రౌండ‌ర్ యువ‌రాజ్ సింగ్‌తోపాటు కోట్నీ వాల్ష్‌, అండ్రూ సైమండ్స్ త‌లో వికెట్ తీశారు.

వన్డే సిరీస్ విజయానందంలో ఉన్న న్యూజిలాండ్‌కు ఐసీసీ షాక్ !!

యువ రాజ్ సింగ్ విఫలం..

యువ రాజ్ సింగ్ విఫలం..

ఛేజింగ్ 10 ఓవర్లు ఆడిన గిల్‌క్రిస్ట్ ఎలెవ‌న్ ఆరు వికెట్ల‌కు 103 ప‌రుగులు చేసి ఓడిపోయింది. ఓపెన‌ర్ షేన్ వాట్స‌న్ (9 బంతుల్లో 30 రిటైర్డ్ ఔట్‌, 2 ఫోర్లు, 3 సిక్స‌ర్లు), అండ్రూ సైమండ్స్ (13 బంతుల్లో 29 రిటైర్డ్ ఔట్‌, 3 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) జ‌ట్టును గెలిపించేందుకు విఫ‌ల‌యత్నం చేశారు. యువ‌రాజ్ సింగ్ (2) మాత్రం విఫ‌ల‌మ‌య్యాడు. చివరి ఓవ‌ర్లో 17 ప‌రుగులు చేయాల్సిన ద‌శ‌లో గిల్‌క్రిస్ట్ లెవ‌న్ 15 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. పాంటింగ్ ఎలెవెన్ జట్టు బౌల‌ర్ల‌లో బ్రెట్ లీకి రెండు వికెట్లు ద‌క్కాయి. ల్యూక్ హోడ్జ్ ఒక వికెట్ తీశాడు.

Story first published: Sunday, February 9, 2020, 15:39 [IST]
Other articles published on Feb 9, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X