వన్డే సిరీస్ విజయానందంలో ఉన్న న్యూజిలాండ్‌కు ఐసీసీ షాక్ !!

ఆక్లాండ్: అద్భుతమైన ఆటతో న్యూజిలాండ్‌పై టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన భారత్.. వన్డే సిరీస్‌లో మాత్రం వరుస పరాజయాలతో తలవంచింది. శనివారం జరిగిన రెండో వన్డేలోనూ ఓడి ఒక మ్యాచ్ మిగిలుండగానే 2-0తో సిరీస్‌ను సమర్పించుకుంది. ఇటీవలి కాలంలో ఎన్నడూ లేని విధంగా బ్యాటింగ్ వైఫల్యం భారత్‌ను దెబ్బ తీస్తే.. కివీస్ జట్టు ఆటగాళ్ల సమష్టి ప్రదర్శనతో విజయాలు సాధించి ప్రతీకారం తీర్చుకుంది.

షాకిచ్చిన ఐసీసీ..
అయితే ఈ విజయానందంలో ఉన్న న్యూజిలాండ్ ఆటగాళ్లకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ దిమ్మతిరిగే షాకిచ్చింది. రెండో వన్డే మ్యాచ్ ఫీజులో 60 శాతం కోత విధంచింది. స్లో ఓవర్ రేట్ కారణంగా కివీస్ ఆటగాళ్లకు మ్యాచ్ రిఫరీ ఈ కోత విధించినట్లు ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. నిర్ణీత సమయం కన్నా మూడు ఓవర్ల పాటు ఆలస్యంగా వేయడంతో ఐసీసీ నిబంధనల మేరకు ప్రతీ ఓవర్‌కు 20 శాతం చొప్పున కోత విధించింది. తాత్కలిక కెప్టెన్ టామ్ లాథమ్ ఈ శిక్షను అంగీకరించడంతో తదుపరి వాదోవాదాలు వినాల్సిన అవసరం లేదని ఐసీసీ పేర్కొంది.
ఇక ఐసీసీ ప్రవర్తనా నియమావళి ఆర్టికల్ 2.22 ప్రకారం ప్రతి ఓవర్ నిర్ణీత సమయంలో పూర్తి కావాలి. లేనిపక్షంలో ఒక ఓవర్‌కు 20 శాతం చొప్పున ఆటగాళ్లు, ఆ జట్టు సిబ్బంది మ్యాచ్ ఫీజులో కోత విధిస్తారనే విషయం తెలిసిందే..
Under-19 World Cup ఫైనల్ ప్రివ్యూ: భారత్ vs బంగ్లా గెలిచేదెవరో? యువ రాజులుగా నిలిచేదెవరో?

భారత్‌కు వరుసగా మూడు సార్లు..
ఇక స్లోఓవర్ రేట్ కారణంగా భారత ఆటగాళ్లు వరుసగా మూడు మ్యాచ్‌ల్లో మ్యాచ్ ఫీజు కోతకు గురయ్యారు. తొలి వన్డేలో నిర్ణీత సమయం కన్నా నాలుగు ఓవర్లు తక్కువ వేసినందుకు ఐసీసీ 80 శాతం కోత విధించగా.. ఐదు టీ20ల సిరీస్ భాగంగా జరిగిన చివరి టీ20లో నిర్ణీత సమయానికి ఒక ఓవర్ తక్కువగా వేయడంతో 20 శాతం మ్యాచ్ ఫీజు కోత విధించారు. వెస్ట్‌ప్యాక్ స్టేడియం వేదికగా జరిగిన నాలుగో టీ20లోనూ టీమిండియా రెండు ఓవర్లు ఆలస్యంగా మ్యాచ్‌ను ముగించింది. దీంతో భారత ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 40 శాతం పెనాల్టీ విధించింది. ఇక మొన్నటిదాక భారత్ ఆటగాళ్లు ఐసీసీ కోతకు గురవ్వగా.. రెండో వన్డేతో మ్యాచ్ ఫీజు కోతకు గురవ్వడం న్యూజిలాండ్ ఆటగాళ్ల వంతైంది.

మరోసారి టేలర్, గప్టిల్..
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 273 పరుగులు చేసింది. మార్టిన్ గప్టిల్ (79; 79 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లు), నికోలస్ (41; 59 బంతుల్లో 5 ఫోర్లు), రాస్ టేలర్ (73 నాటౌట్; 74 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు)లు రాణించగా.. బ్లండెల్ (22), జెమీసన్ (25 నాటౌట్; 24 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించారు. టీమిండియా బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 2, యుజువేంద్ర చాహల్ 3 వికెట్లు తీశారు.

అరంగ్రేట మ్యాచ్‌లోనే
అనతరం 274 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ 48.3 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌటై 22 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. రవీంద్ర జడేజా (73 బంతుల్లో 55; 2 ఫోర్లు, 1 సిక్స్), శ్రేయస్ అయ్యర్ (57 బంతుల్లో 52; 7 ఫోర్లు, 1 సిక్స్), నవదీప్ సైనీ (49 బంతుల్లో 45; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. 6 అడుగుల 8 అంగుళాల పొడగరి, ఈ మ్యాచ్‌తోనే అరంగేట్రం చేసిన కివీస్ బౌలర్ కైల్ జేమీసన్ ఆల్‌రౌండ్ ప్రదర్శనకుగాను ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'గా నిలిచాడు. చివరి వన్డే మంగళవారం మౌంట్ మాంగనీలో జరుగుతుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications