న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

SA vs ENG: అంపైర్ గారూ.. మ్యాచ్ జరుగుతుందనే విషయం మరిచిపోయారా? (వీడియో)

SA vs ENG: Fans Reaction after Umpire Marais Erasmus gets distracted, misses entire delivery

బ్లోమ్‌ఫోంటెయిన్: సౌతాఫ్రికా-ఇంగ్లండ్ మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన తొలి వన్డేలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. సీనియర్ అంపైర్ అయిన మరాయిస్ ఎరాస్మస్ మైదానంలో ప్రవర్తించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆటను పట్టించుకోకుండా ఎరాస్మస్ తన పనిని తాను చేసుకోవడం టీవీ కెమెరాల్లో కనిపించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు ఎరాస్మస్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. మ్యాచ్ జరుగుతుందనే విషయాన్ని ఎరాస్మస్ మరిచిపోయినట్లున్నాడని కామెంట్ చేస్తున్నారు.

అసలేం జరిగిందంటే..?

ఇంగ్లండ్ ఇన్నింగ్స్ సందర్భంగా 24వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. క్రీజులో జేసన్ రాయ్ బ్యాటింగ్ చేస్తుండగా.. ఎరాస్మస్ లెగ్ అంపైర్‌గా ఉన్నాడు. అయితే బౌలర్ బంతి వేసే క్రమంలో ఎరాస్మస్ ఆటను గమనించకుండా పక్కకు జరిగి తన పనిని తాను చేసుకున్నాడు. ఆటతో తనకు సంబంధం లేదన్నట్లుగా ప్రవర్తించాడు. బ్యాటర్ షాట్ ఆడి పరుగు తీసే క్రమంలో మేల్కొన్నట్లు ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు.

వన్డేలపై ఆసక్తి లేదని..

వన్డేలపై ఆసక్తి లేదని..

దాంతో ఫ్యాన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. వన్డేలను ఎవడు చూస్తాడని ఎరాస్మస్ ఫీలింగ్ అని ఒకరంటే.. థర్డ్ అంపైర్‌ చూసుకుంటాడులే అనే భరోసా ఎరాస్మస్‌కు ఉన్నట్లు మరొకరు సెటైర్ పేల్చాడు. అంపైరింగ్‌పై ఎరాస్మస్‌కు ఆసక్తి తగ్గినట్లుందని మరొకరు కామెంట్ చేశారు. మాజీ క్రికెటర్లు మాత్రం అంపైర్లు కూడా మనుషులేనని, అప్పుడప్పుడు ఇలాంటివి జరగడం సహజమని అండగా నిలుస్తున్నారు. ఎరాస్మస్ లెజండరీ అంపైరని, అతను నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయని గుర్తు చేస్తున్నారు.

సౌతాఫ్రికాదే విజయం..

సౌతాఫ్రికాదే విజయం..

ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా 27 పరుగుల తేడాతో గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 298 పరుగులు చేసింది. వాండర్ డుసెన్(117 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్‌తో 111) సెంచరీతో చెలరేగగా.. డేవిడ్ మిల్లర్(53) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో సామ్ కరన్ మూడు వికెట్లు తీయగా.. జోఫ్రా ఆర్చర్, మొయిన్ అలీ, ఆదిల్ రషీద్, ఒల్లీ స్టోన్ తలో వికెట్ తీసారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఇంగ్లండ్ 44.2 ఓవర్లలో 271 పరుగులకు కుప్పకూలింది. జాసన్ రాయ్(91 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లతో 113) సెంచరీ, డేవిడ్ మలాన్(59) హాఫ్ సెంచరీతో రాణించినా ఫలితం లేకపోయింది. సౌతాఫ్రికా బౌలర్లలో అన్రిచ్ నోర్జ్ నాలుగు వికెట్లు తీయగా.. సిసండా మగళ మూడు వికెట్లతో ఇంగ్లండ్ పతనాన్ని శాసించారు. కగిసో రబడా రెండు వికెట్లు తీయగా.. టబ్రైజ్ షంసీ ఓ వికెట్ పడగొట్టాడు.

Story first published: Saturday, January 28, 2023, 19:17 [IST]
Other articles published on Jan 28, 2023
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X