న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

RR vs PBKS: చెలరేగిన దీపక్ హుడా, రాహుల్.. వాంఖడేలో సిక్సర్ల వర్షం.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం!

RR vs PBKS: KL Rahul 91, Deepak Hooda 64 fire Punjab Kings to 221 for 6

ముంబై: ఐపీఎల్ 2021 సీజన్‌ను పంజాబ్ కింగ్స్ బ్యాట్స్‌మన్ గ్రాండ్‌గా మొదలుపెట్టారు. రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సిక్సర్ల వర్షం కురిపించారు. కెప్టెన్ కేఎల్ రాహుల్(50 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 91), దీపక్ హుడా(28 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 64) పరుగుల సునామీ సృష్టించారు. వీరికి అండగా యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ కూడా ఓ చేయి వేయడంతో పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 221 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఇదే అత్యధిక స్కోర్. పంజాబ్ ఇన్నింగ్స్‌లో మొత్తం 13 సిక్సర్లు, 18 ఫోర్లు వచ్చాయి. ఇక రాజస్థాన్ బౌలర్లంతా విఫలమైన వేళ అరంగేట్ర ప్లేయర్, యువ పేసర్ చేతన్ సకారియా ఆకట్టుకున్నాడు. ఫస్ట్ మ్యాచ్‌లోనే (3/31) మూడు వికెట్లు పడగొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. క్రిస్ మోరిస్‌కు రెండు వికెట్లు దక్కగా.. రియాన్ పరాగ్ ఓ వికెట్ దక్కింది.

జిగేల్..

జిగేల్..

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్‌.. ఆదిలోనే ఓపెనర్ మయాంక్ అగర్వాల్(14) వికెట్ కోల్పోయినా.. మంచి శుభారంభం దక్కింది. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్, యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించడంతో పవర్ ప్లే ముగిసే సరికి పంజాబ్ కింగ్స్ వికెట్ నష్టానికి 46 రన్స్ చేసింది. అనంతరం జోరు పెంచిన ఈ జోడి స్కోర్ బోర్డును పరుగెత్తించింది. అయితే కేఎల్ రాహుల్, క్రిస్ గేల్ ఇచ్చిన సునాయస క్యాచ్‌లను రాజస్థాన్ ఫీల్డర్లు నేలపాలు చేశారు. ఈ అవకాశాలను అందిపుచ్చుకున్న ఈ ఇద్దరూ విజృంభించారు. ప్రమాదకరంగా మారిన ఈ జోడీని రియాన్ పరాగ్ విడదీసాడు. క్రిస్ గేల్‌ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు.

హుడా విధ్వంసం..

హుడా విధ్వంసం..

అనంతరం క్రీజులోకి వచ్చిన దీపక్ హుడా.. సెట్ అవ్వడానికి టైమ్ తీసుకున్నా.. ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగాడు. దూబే వేసిన 13 ఓవర్‌లో సిక్సర్‌తో కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా..దీపక్ హుడా రెండు భారీ సిక్సర్లు కొట్టాడు. దాంతో ఆ ఓవర్‌లో 20 రన్స్ వచ్చాయి. ఆ తర్వాత ప్రతీ ఓవర్‌కు సిక్స్ కొట్టిన ఈ జోడీ రాజస్థాన్ బౌలర్లకు చుక్కలు చూపించింది. ఇక క్రిస్ మోరిస్ వేసిన 16 ఓవర్‌లో సిక్స్ , సింగిల్ తీసిన దీపక్ హుడా 20 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం మరింత ధాటిగా ఆడిన అతను మోరిస్ బౌలింగ్‌లోనే క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేరాడు. దాంతో మూడో వికెట్‌కు నమోదైన 105 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

 సకారియా స్టన్నింగ్ క్యాచ్..

సకారియా స్టన్నింగ్ క్యాచ్..

క్రీజులోకి నికోలస్ పూరన్ రాగా.. రాహుల్ మూమెంటమ్‌ను కొనసాగించాడు. మరసటి బంతినే భారీ సిక్సర్ కొట్టడంతో పంజాబ్ 17.4 ఓవర్లలోనే 200 మార్క్ అందుకుంది. అదే ఓవర్ ఆఖరి బంతికి పూరన్ ఫైన్ లెగ్ మీదుగా షాట్ ఆడగా.. చేతన్ సకారియా సూపర్ డైవ్‌తో అద్భుత క్యాచ్ అందుకున్నాడు. తర్వాత షారూఖ్ ఖాన్ క్రీజులోకి రాగా.. రాహుల్ జోరును కొసాగిచాడు. ముస్తాఫిజుర్ వేసిన 19వ ఓవర్‌లో 15 పరుగులు పిండుకున్నాడు. ఇక చివరి ఓవర్ ఫస్ట్ బాల్‌ను బౌండరీ తరలించిన రాహుల్.. సెకండ్ బాల్‌ను భారీ షాట్ ఆడగా.. బౌండరీ లైన్ వద్ద రాహుల్ తెవాటియా సూపర్ క్యాచ్‌తో ఆకట్టుకున్నాడు. దాంతో రాహుల్ సెంచరీ చేయకుండానే వెనుదిరిగాడు. ఆఖరి బంతికి జయ్ రిచర్డ్ సన్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరగడంతో పంజాబ్ 221 పరుగులకు పరమితమైంది.

Story first published: Monday, April 12, 2021, 21:58 [IST]
Other articles published on Apr 12, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X