న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Chetan Sakariya స్టన్నింగ్ క్యాచ్.. బిత్తరపోయిన నికోలస్ పూరన్ (వీడియో)

RR vs PBKS: Chetan Sakariya Takes Spectacular Diving Catch To Remove Nicholas Pooran

ముంబై: రాజస్థాన్ రాయల్స్ యువ పేసర్ చేతన్ సకారియా అరంగేట్ర మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. పంజాబ్ కింగ్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో సీనియర్ బౌలర్లంతా విఫలమైనా వేళ అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ ఆకాశమే హద్దుగా చెలరేగినా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి (3/31) మూడు వికెట్లు తీసాడు. ఇక క్రిస్ మోరిస్ బౌలింగ్‌లో అతను పట్టిన క్యాచ్ మ్యాచ్‌కే హైలైట్. అతని సూపర్ డైవ్ క్యాచ్‌కు పంజాబ్ ఫించ్ హిట్టర్ నికోలస్ పూరన్(0) డకౌట్‌గా వెనుదిరిగాడు. యువ ఆటగాడి సూపర్ ఫీల్డింగ్‌కు బిత్తరపోయాడు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఇదే ది బెస్ట్ క్యాచ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.

సకారియా సూపర్ డైవ్..

ఇక సకారియా స్టన్నింగ్‌ క్యాచ్‌కు మైదానంలోని ఆటగాళ్లతో పాటు కామెంటేటర్లు సైతం ఫిదా అయ్యారు. క్రిస్ మోరిస్ వేసిన 18 ఓవర్ ఆఖరి బంతిని పూరన్ ఫైన్ లెగ్ షాట్ ఆడగా.. షార్ట్ ఫైన్‌ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సకారియా సూపర్ డైవ్‌తో బంతిని ఒడిసి పెట్టుకున్నాడు. అయితే గాల్లోనే బంతిని అందుకున్న సకారియా కిందపడే క్రమంలో బంతిని నేలకు తాకిందా? అనే సందేహం కలగడంతో థర్డ్ అంపైర్ పలుకోణాల్లో పరిశీలించాడు. అయితే బంతి నేలకు తాకిందనే ఆధారం లభించకపోవడంతో థర్డ్ అంపైర్ ఫిల్డ్ అంపైర్ సాఫ్ట్ సిగ్నల్‌కు కట్టుబడి క్యాచ్ ఔట్ ఇచ్చాడు. అయితే సకారియా సూపర్ ఫీల్డింగ్‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది.

తెవాటియా బ్రిలియంట్ క్యాచ్..

ఇక పంజాబ్ ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో రాహుల్ తెవాటియా కూడా బౌండరీ లైన్ వద్ద అద్భుత క్యాచ్ అందుకున్నాడు. సకారియా వేసిన ఆ ఓవర్ సెకండ్ బాల్‌ను మిడ్ వికెట్ బౌండరీ దిశగా భారీ షాట్ ఆడగా.. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న రాహుల్ తెవాటియా అద్భుతంగా అందుకున్నాడు. అయితే సమన్వయం కోల్పోతున్నట్లు గ్రహించిన అతను చాకచక్యంగా మైదానంలోకి బంతిని విసిరేసి మళ్లీ అందుకున్నాడు. దాంతో రాహుల్ సెంచరీ చేయకుండానే వెనుదిరిగాడు.

వాంఖడేలో సిక్సర్ల వర్షం..

ఈ మ్యాచ్‌లో కెప్టెన్ కేఎల్ రాహుల్(50 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 91), దీపక్ హుడా(28 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 64) ఆకాశమే హద్దుగా చెలరేగారు. మూడో వికెట్‌కు 105 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించారు. వీరికి అండగా యూనివర్స్ బాస్ క్రిస్ గేల్(28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 40) కూడా ఓ చేయి వేయడంతో పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 221 పరుగుల భారీ స్కోర్ చేసింది. రాజస్తాన్ బౌలర్లలో సకారియాకు తోడు మోరీస్ 2 వికెట్లు తీయగా.. రియాన్ పరాగ్ ఓ వికెట్ పడగొట్టాడు. పంజాబ్ ఇన్నింగ్స్‌లో మొత్తం 12 సిక్స్‌ర్లు నమోదయ్యాయి.

Story first published: Monday, April 12, 2021, 22:58 [IST]
Other articles published on Apr 12, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X