న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

RR vs KXIP: ఏంది సామీ ఆ ఫీల్డింగ్.. పిచ్చెక్కించిన పూరన్.. ఐపీఎల్‌కే హైలైట్!!

RR vs KXIP: Nicholas Pooran does the best stop in entire IPL

షార్జా: కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో దిగిన రాజస్థాన్‌ రాయల్స్‌ ఎదురీదుతోంది. రెండు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్ జొస్ బట్లర్ (4) ఆదిలోనే పెవిలియన్ చేరగా.. కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్ మెరుపులు మెరిపించాడు. సంజూ శాంసన్‌ అండతో రెచ్చిపోయాడు. బౌండరీలు, సిక్సులు బాదుతూ హాఫ్ సెంచరీ చేశాడు. అయితే నీషమ్‌ బౌలింగ్‌లో‌ భారీ షాట్‌ ఆడిన స్మిత్ (50)‌.. మొహమ్మద్ షమీ చేతికి చిక్కాడు. రెండో వికెట్‌కు స్మిత్‌, శాంసన్‌ జోడీ 81 పరుగులు జోడించింది.

ఫామ్‌లో శాంసన్:

ఫామ్‌లో శాంసన్:

ఈ మ్యాచులో కింగ్స్ లెవన్ పంజాబ్ బ్యాట్స్‌మన్‌ నికోలస్ పూరన్ చేసిన ఫీల్డింగ్ అద్భుతం. ఇంకా చెప్పాలంటే.. ఐపీఎల్‌కే హైలైట్ అనొచ్చు. మరి అంతలా ఫీల్డింగ్ చేశాడు మరి. రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 8వ ఓవర్ మురుగన్ అశ్విన్ వేశాడు. ఆ సమయంలో సంజూ శాంసన్, స్టీవ్ స్మిత్ మంచి ఫామ్‌లో ఉన్నారు. అప్పటికే కింగ్స్ బౌలర్ల మీద విరుచుకుపడుతూ పరుగుల వరద పారిస్తున్నారు. అలాంటి సమయంలో వారిని ఆపేందుకు అశ్విన్ బౌలింగ్‌కి వచ్చాడు.

పూరన్ ఫీల్డింగ్ అద్భుతం:

పూరన్ ఫీల్డింగ్ అద్భుతం:

అశ్విన్ వేసిన మొదటి బంతికి సింగల్ తీసిన స్టీవ్ స్మిత్.. స్ట్రైకింగ్ సంజూ శాంసన్‌కు ఇచ్చాడు. సంజూ రెండో బంతిని భారీ షాట్ ఆడాడు సిక్స్ వెళ్లిందని అందరూ అనుకున్నారు. అయితే సిక్స్ వెళ్లే బంతిని పంజాబ్ ఫీల్డర్ నికోలస్ పూరన్ అద్భుతంగా క్యాచ్ పట్టాడు. బంతి బౌండరీ దాటిన తర్వాత ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి అందుకున్నాడు. ఇక బౌండరీల ఆవల పడే సమయంలో బంతిని మళ్లీ ఫీల్డ్‌లోకి విసిరేశాడు. దీంతో ఆరు పరుగులు రావాల్సింది.. కేవలం రెండు పరుగులే వచ్చాయి. ఆ ఫీల్డింగ్‌ను అందరూ చూడాల్సిందే. చూస్తే వావ్ అనలేక ఉండరు.

ఐపీఎల్‌కే ఇది హైలైట్:

ఐపీఎల్‌కే ఇది హైలైట్:

నికోలస్ పూరన్ చేసిన అద్భుత ఫీల్డింగ్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అభిమానులు, మాజీ క్రికెటర్లు తమదైన శైలిలో ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు. 'ఇది నా జీవితంలో చూసిన ఉత్తమ ఫీల్డింగ్' అని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ ట్వీట్ చేశాడు. 'నికోలస్ పూరన్ అద్భుత ఫీల్డింగ్. గతంలో ఎప్పుడైనా ఇలా చూసారా?' అని హాట్‌స్టార్ ట్వీట్ చేసింది. ఏంది సామీ ఆ ఫీల్డింగ్, పిచ్చెక్కించిన పూరన్, ఐపీఎల్‌కే ఇది హైలైట్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

శాంసన్‌ అర్ధ శతకం:

శాంసన్‌ అర్ధ శతకం:

పంజాబ్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ యువ బ్యాట్స్‌మన్ సంజూ శాంసన్‌ వరుసగా రెండో అర్ధశతకం సాధించాడు. తన ఐపీఎల్‌ కెరీర్‌లో 12వ హాఫ్‌సెంచరీ నమోదు చేశాడు. 224 పరుగుల లక్ష్య ఛేదనలో శాంసన్‌ బౌండరీల మోత మోగించాడు. కేవలం 27 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. పంజాబ్‌ బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ ఇన్నింగ్స్‌ను ముందుండి నడిపిపించాడు. అయితే భారీ షాట్ ఆడే క్రమంలో పెవిలియన్ చేరాడు. రాయల్స్‌ 17 వర్లలలో మూడు వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది.

Story first published: Sunday, September 27, 2020, 23:05 [IST]
Other articles published on Sep 27, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X