న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అయ్యో దేవుడా!!.. స్పైడర్ కెమెరా ఎంతపని చేసే.. బంతి సిక్స్ వెళుతుందనుకుంటే..!!

RR vs KKR: Jaydev Unadkat ruled out after ball appears to have hit Spider cam

దుబాయ్: గత రెండు మ్యాచ్‌ల్లో భారీ స్కోర్లు సాధించిన రాజస్థాన్‌ రాయల్స్‌.. బుధవారం రాత్రి కోల్‌కతా నైట్‌రైడర్స్‌ నిర్దేశించిన మోస్తరు లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలబడింది. బ్యాట్స్‌మన్‌ విఫలమవడంతో రాజస్థాన్‌ 37 పరుగుల తేడాతో ఓడింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన కార్తీక్‌ సేన నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 174 పరుగులు చేసింది.

శుభ్‌మన్‌ గిల్‌ (34 బంతుల్లో 47; 5 ఫోర్లు, ఒక సిక్సర్‌), ఇయాన్ మోర్గాన్‌ (23 బంతుల్లో 34 నాటౌట్‌; 1 ఫోర్‌ 2 సిక్సర్లు) రాణించారు. లక్ష్య ఛేదనలో రాజస్థాన్‌ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 137 పరుగులకే పరిమితమైంది. టామ్‌ కరన్‌ (36 బంతుల్లో 54; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) టాప్‌ స్కోరర్‌. అయితే ఈ మ్యాచులో రాజస్థాన్‌కు కొన్ని ఊహించని ఘటనలు కూడా శాపంగా మారాయి.

స్పైడర్ కెమెరాకు తాకిన బంతి

స్పైడర్ కెమెరాకు తాకిన బంతి

కోల్‌కతా మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ వేసిన 17.6వ ఓవర్లో.. జయదేవ్ ఉనద్కత్ డీప్ మిడ్ వికెట్ దిశగా భారీ షాట్ ఆడాడు. గాల్లోకి లేచిన బంతి చూసి అందరూ సిక్స్ వెళుతుందనుకున్నారు. కానీ అలా జరగలేదు. బంతి అనూహ్యంగా కమలేష్ నాగర్ కోటికి క్యాచ్‌గా వెళ్లింది. బంతి స్పైడర్ కెమెరా కేబుల్‌కు తాకడం గమనించిన ఉనద్కత్.. అంపైర్లకు విషయం చెప్పాడు. దీంతో బంతిని రిప్లైలో పరిశీలించిన అంపైర్లు ఎటూ తేల్చలేకపోయారు. వారికి ఎంతకూ క్లారిటీ రాకపోవంతో.. ఉనద్కత్ ఔటైనట్లు ప్రకటించారు. దీంతో ఉనద్కత్ పెవిలియన్ చేరాడు.

ఇదేం అంపైరింగ్ సామీ

ఇదేం అంపైరింగ్ సామీ

స్పైడర్ కెమెరాకు సంబందించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీటిపై రాజస్థాన్ రాయల్స్ ఫ్యాన్స్ కామెంట్ల వర్షం కురిపితున్నారు. 'బాల్ స్పైడర్ కెమెరా కేబుల్‌కు తాకింది. అయినా అంపైర్లు ఔట్ ఇవ్వడం ఏంటి' అని ఓ అభిమాని ప్రశ్నించాడు. 'ఇదేం అంపైరింగ్ సామీ' అని మరో అభిమాని మండిపడ్డాడు. మన విజయాన్ని స్పైడర్ కెమెరా అడ్డుకుందని మరొకరు ట్వీట్ చేశారు. వాస్తవానికి బంతి స్పైడర్ కెమెరాకు తాకితే దాన్ని డెడ్ బాల్‌గా ప్రకటిస్తారు. ఒకవేళ బ్యాట్స్‌మెన్ ఔటైనా.. ఔట్ ఇవ్వరు.

క్యాచ్ అందుకోవడంలో ఇబ్బంది పడ్డ స్మిత్

క్యాచ్ అందుకోవడంలో ఇబ్బంది పడ్డ స్మిత్

స్పైడర్ కెమెరా ఇబ్బంది పెట్టడం ఇదేం మొదటిసారి కాదు. గతంలో చాలాసార్లు ఇలాంటి ఘటనలే జరిగాయి. 2015లో సిడ్నీ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన నాలుగో టెస్టులో కూడా స్పైడర్ కెమెరా ఇబ్బంది పెట్టింది. ఆ టెస్ట్ మూడో రోజు.. స్పైడర్ కెమెరా కారణంగా స్టీవ్ స్మిత్ క్యాచ్ అందుకోవడంలో ఇబ్బంది పడ్డాడు. స్పైడర్ కెమెరా కదలికలు ఇబ్బంది పెట్టడంతో.. రాహుల్ ఇచ్చిన క్యాచ్‌ను స్మిత్ అందుకోలేకపోయాడు.

మరో ఘ‌ట‌న కూడా

మరో ఘ‌ట‌న కూడా

ఈ మ్యాచులో మరో ఘ‌ట‌న కూడా చోటుచేసుకున్న‌ది. కరోనా వైర‌స్ నిబంధ‌నల నేప‌థ్యంలో ఐసీసీ నియ‌మావ‌ళి ప్ర‌కారం బంతికి ఉమ్మి రాయ‌డం నిషేధం. మ్యాచ్ మూడ‌వ ఓవ‌ర్‌లో నరైన్ కొట్టిన భారీ షాట్ గాల్లోకి ఎగిరింది. అయితే రాబిన్ ఊత‌ప్ప చేతుల్లోకి ఆ బంతి వెళ్లినా అత‌ను క్యాచ్‌ను వ‌దిలేశాడు. క్యాచ్ డ్రాప్ చేసిన వెంట‌నే అత‌ను అనుకోకుండా త‌న నోటి ఉమ్మిని బంతికి రాశాడు. ఒక ఇన్నింగ్స్‌లో తాజా రూల్స్ ప్ర‌కారం రెండు సార్లు మాత్ర‌మే ఇలాంటి పొర‌పాట్ల‌కు అవ‌కాశం ఉంటుంది. ఒక‌వేళ ప‌దేప‌దే ఇవే పొర‌పాట్లు చేస్తే అప్పుడు 5 ప‌రుగుల పెనాల్టీ విధిస్తారు.

KKR vs RR: క్రికెట్ దిగ్గజం సచిన్‌ పొగిడాక.. నేను మాట్లాడితే అర్థం ఉండదు: షారుఖ్‌

Story first published: Thursday, October 1, 2020, 17:18 [IST]
Other articles published on Oct 1, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X