న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ క్షణమే.. రాహుల్ ద్రవిడ్ ఓ పెద్ద పులి అని అర్థమైంది: రాస్ టేలర్

Ross Taylor says There Are Almost 4,000 Tigers In The Wild, But Theres Only One Rahul Dravid

న్యూఢిల్లీ: న్యూజిలాండ్ క్రికెట్‌లోని చీకటి కోణాన్ని తన ఆత్మకథ 'బ్లాక్ అండ్ వైట్' ద్వారా బయటపెట్టిన ఆ జట్టు మాజీ క్రికెటర్ రాస్ టేలర్.. ఐపీఎల్ గురించి కూడా ఆసక్తికర విషయాలను ప్రస్తావించాడు. 2011 ఐపీఎల్‌లో డకౌట్ అయ్యాననే కారణంతో రాజస్థాన్ రాయల్స్ టీమ్ ఓనర్ ఒకరు తనపై చేయి చేసుకున్నారని పేర్కొన్న రాస్ టేలర్.. టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో జరిగిన ఓ అనుభవాన్ని కూడా ప్రస్తావించాడు. అప్పుడే రాహుల్ ద్రవిడ్ ఓ పెద్ద పులి అనే విషయం అర్థమైందని తెలిపాడు.

పులులను వదిలేసి ద్రవిడ్ కోసం..

పులులను వదిలేసి ద్రవిడ్ కోసం..

'2011 ఐపీఎల్ సీజన్‌లో నేను, రాహుల్ ద్రవిడ్ కలిసి రాజస్థాన్‌లోని రణతంబోర్ నేషనల్ పార్క్‌కు వెళ్లాం. ఆ సందర్భంగా మీరు ఎన్ని సార్లు పులులను చూశారని ద్రవిడ్‌ను అడిగాను. అప్పుడు నేను 21 సార్లు సఫారీ వెళ్లినా ఒక్కసారి కూడా పులిని చూడలేదని ద్రవిడ్ బదులిచ్చాడు.

ఆ తర్వాత అందరం కలిసి ఓపెన్ టాప్ జీప్‌లో సఫారీకి వెళ్లాం. మా వెనకాల చాలా మంది పర్యాటకులు వచ్చారు. 100 మీటర్ల దూరంలో పులిని చూశాం. అయితే అప్పటి వరకు పులులు ఫొటోల కోసం చూస్తున్న అభిమానులు ద్రవిడ్ కనిపించగానే తమ కెమెరాలన్నీ అతని వైపు తిప్పారు.

ద్రవిడే ఓ పెద్ద పులి..

ద్రవిడే ఓ పెద్ద పులి..

ఎదురుగా అరుదైన పులి కనిపించినా పెద్దగా పట్టించుకోకుండా ద్రవిడ్‌ను చూడటానికి ఫొటోలు తీయడానికి పోటీ పడ్డారు. అది చూశాక భారత్‌లో క్రికెటర్లను ఇంతలా అభిమానిస్తారా? అని నాకు ఆశ్చర్యమేసింది. ప్రపంచంలోనే 4 వేల పులులు ఉండి ఉంటాయి. కానీ వాటన్నిటి కంటే ద్రవిడ్ ప్రత్యేకమైన వ్యక్తి అని, అతనే ఓ పెద్ద పులి అని నాకు అప్పుడు అనిపించింది.'అని రాస్ టేలర్ రాసుకొచ్చాడు.

డకౌటయ్యానని చెంపపై కొట్టాడు..

డకౌటయ్యానని చెంపపై కొట్టాడు..

2011 ఐపీఎల్ సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో డకౌటయ్యానని రాజస్థాన్ రాయల్స్ ఓనర్ చెంపపై కొట్టాడని రాస్ టేలర్ పేర్కొన్నాడు. 'కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన నాటి మ్యాచ్‌లో మేం 195 పరుగుల లక్ష్యాన్ని చేధించలేకపోయాం. ఆ మ్యాచ్‌లో నేను ఎల్బీడబ్ల్యూగా డకౌటయ్యాను. కనీస పోరాటం లేకుండా చిత్తుగా ఓడాం. ఆ మ్యాచ్ అనంతరం హోటల్ బార్‌లో టీమ్ పార్టీ జరిగింది. అక్కడికి రాజస్థాన్ రాయల్స్ టీమ్ మేనేజ్‌మెంట్‌తో పాటు ఓనర్స్ కూడా వచ్చారు.

రాజస్థాన్ రాయల్స్‌‌ ఓనర్ నాతో మాట్లాడుతూ..డకౌట్ అయ్యేందుకు 1 మిలియన్ డాలర్లు చెల్లించడంలేదని నా చెంపపై రెండు మూడు దెబ్బలు వేసాడు. మెళ్లిగానే నవ్వుతూనే కొట్టాడు. కానీ నేను మాత్రం సరదాగా తీసుకోలేకపోయాను. ప్రొఫెషనల్ లీగ్‌ల్లో ఇలా జరుగుతుందా? అని ఆశ్చర్యపోయాను. ఏ మాత్రం ఊహించలేకపోయాను' అని రాస్ టేలర్ పేర్కొన్నాడు.

Story first published: Monday, August 15, 2022, 8:27 [IST]
Other articles published on Aug 15, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X