న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్ డకౌట్ అయ్యానని చెంపపై కొట్టాడు: రాస్ టేలర్

Ross Taylor says RR owner slapped me 3-4 times when I got out for a duck in 2011 IPL

న్యూఢిల్లీ: న్యూజిలాండ్ క్రికెట్‌లోని చీకటి కోణాన్ని తన ఆత్మకథ ద్వారా బయటపెట్టిన ఆ జట్టు మాజీ క్రికెటర్ రాస్ టేలర్.. ఐపీఎల్ గురించి కూడా ఆసక్తికర విషయాలను ప్రస్తావించాడు. 2011 ఐపీఎల్ మెగా వేలంలో తనను రాజస్థాన్ రాయల్స్ భారీ ధరకు కొనుగోలు చేసిందని పేర్కొన్న రాస్ టేలర్.. ఓ మ్యాచ్‌లో డకౌట్ అయినందుకు ఆ జట్టు ఓనర్ తన చెంపపై కొట్టాడని ప్రస్తావించాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన రాస్ టేలర్ ఇటీవలే తన ఆత్మకథ రాస్ టేలర్ 'బ్లాక్ అండ్ వైట్‌' బుక్‌ను అభిమానుల ముందుకు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. తన జీవితానికి సంబంధించిన ప్రతీ విషయాన్ని రాస్ టేలర్ ఈ బుక్‌లో పేర్కొన్నాడు.

 భారీ ధర పలకడంతో..

భారీ ధర పలకడంతో..

‘2011 ఐపీఎల్ మెగా వేలం జరుగుతున్న సమయంలో సెడన్ పార్క్‌లో పాకిస్థాన్‌తో తొలి టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నా. ఆట రెండో రోజు పాకిస్థాన్ 235/4 బరిలోకి దిగుతోంది. డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న బ్రెండన్ మెక్‌కల్లమ్ ఐపీఎల్ వేలాన్ని మొబైల్‌లో చూస్తూ మాకు కామెంట్రీలా చెబుతున్నాడు. ఏబీ డివిలియర్స్‌ను ఆర్‌సీబీ 1.1 మిలియన్ అమెరికా డాలర్లకు కొనుగోలు చేసిందని, రాస్ టేలర్ కోసం ఆయా జట్లు పోటీపడుతున్నాయని చెప్పాడు. నాపై 950,000 అమెరికా డాలర్ల వరకు బిడ్ చేస్తున్నారని తెలిపాడు. ఇక నేను డ్రెస్సింగ్ రూమ్‌లోకి వచ్చే సరికి సహచర ఆటగాళ్లంతా ఓహో.. అని అరుస్తున్నారు. నేను ఏ జట్టు నా కోసం పోటీపడుతుందని ఆతృతగా చూశాను. నా పాత టీమ్ ఆర్‌సీబీనే రేసులో ఉంది. అయితే రాజస్థాన్ రాయల్స్ 1 మిలియన్ అమెరికా డాలర్లకు నన్ను దక్కించుకుంది.

ఆర్‌సీబీ తీసుకుంటే బాగుండనుకున్నా..

ఆర్‌సీబీ తీసుకుంటే బాగుండనుకున్నా..

నేను ఒక్కసారిగా ఏం జరిగుతుంది అంటూ వణికిపోయాను. ఒక మిలియన్ డాలర్లకు అమ్ముడుపోయినందుకు ఆశ్చర్యకరంగా సంతోషంగా ఉన్నప్పటికీ.. 950,000 డాలర్లకు ఆర్‌సీబీకి దక్కుంటే బాగుండు అనిపించింది. ఎందుకంటే అప్పటికే ఆ జట్టుకు నేను మూడేళ్లు ఆడాను. నాలుగో ఏడాది కొనసాగేవాడిని. తద్వారా ఒకే ఫ్రాంచైజీకి సుదీర్ఘ కాలం ఆడిన ప్లేయర్‌గా నిలిచేవాడిని. అయితే నేను ఆర్‌సీబీలోనే ఉంటే వీరేంద్ర సెహ్వాగ్, షేన్ వార్న్, మహేల జయవర్దనే, యువరాజ్ సింగ్ వంటి గొప్ప ఆటగాళ్లతో డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకునే అవకాశం వచ్చేది కాదు.

టీమ్ అంచనాలు కూడా..

టీమ్ అంచనాలు కూడా..

అయితే భారీ ధర దక్కినప్పుడు సహజంగానే మన సత్తా ఏంటో నిరూపించుకోవడానికి ఆసక్తి కనబరుస్తాం. అదేవిధంగా మనపై భారీగా ఖర్చుపెట్టిన జట్టు సైతం అదే స్థాయిలో ప్రదర్శనను ఆశిస్తోంది. అదే పాత టీమ్ అయితే మనకు మద్దతు లభిస్తోంది. మన గురించి పూర్తిగా తెలుసు కాబట్టి ఒకటి రెండు మ్యాచ్‌లు విఫలమైనా అండగా ఉంటారు. కానీ కొత్త టీమ్ అయితే పక్కనపెట్టేస్తారు. 2011 ఐపీఎల్ సీజన్‌లోనే నాకు అలాంటి పరిస్థితి ఎదురైంది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన నాటి మ్యాచ్‌లో మేం 195 పరుగులు చేదించలేకపోయాం.

T20 ప్రపంచకప్‌కు వాళ్లిద్దరూ దూరం,మరెలా? *Cricket | Telugu OneIndia
చెంపపై మూడు సార్లు కొట్టాడు..

చెంపపై మూడు సార్లు కొట్టాడు..

ఆ మ్యాచ్‌లో నేను ఎల్బీడబ్ల్యూగా డకౌటయ్యాను. కనీస పోరాటం లేకుండా చిత్తుగా ఓడాం. ఆ మ్యాచ్ అనంతరం హోటల్ బార్‌లో టీమ్ పార్టీ జరిగింది. అక్కడికి రాజస్థాన్ రాయల్స్ టీమ్ మేనేజ్‌మెంట్‌తో పాటు ఓనర్స్ కూడా వచ్చారు. రాజస్థాన్ రాయల్స్‌‌ ఓనర్ నాతో మాట్లాడుతూ..‘డకౌట్ అయ్యేందుకు 1 మిలియన్ డాలర్లు చెల్లించడంలేదని నా చెంపపై రెండు మూడు దెబ్బలు వేసాడు. మెళ్లిగానే నవ్వుతూనే కొట్టాడు. కానీ నేను మాత్రం సరదాగా తీసుకోలేకపోయాను. ప్రొఫెషనల్ లీగ్‌ల్లో ఇలా జరుగుతుందా? అని ఆశ్చర్యపోయాను. ఏ మాత్రం ఊహించలేకపోయాను'అని రాస్ టేలర్ చెప్పుకొచ్చాడు.

Story first published: Saturday, August 13, 2022, 17:56 [IST]
Other articles published on Aug 13, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X