న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రోహిత్ Vs గేల్: ఇనిస్టాగ్రామ్‌లో ఫోటో, కొత్త విషయం వెలుగులోకి!

India vs West Indies 2019 : Rohit Sharma Shared A Photo With Chris Gayle In Instagram || Oneindia
Rohit Sharma shared instagram photo with chris gayle

హైదరాబాద్: టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ తన ఇనిస్టాగ్రామ్‌లో పోస్టు చేసిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఫోటోలో రోహిత్ శర్మ పక్కనే వెస్టిండిస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్, యానివర్సల్ బాస్ క్రిస్ గేల్ ఉన్నాడు. ఈ ఫోటోలో వీరిద్దరి మధ్య ఉన్న ఓ పోలికను రోహిత్ శర్మ వెల్లడించాడు.

అదేంటంటే రోహిత్‌ శర్మ, క్రిస్‌ గేల్‌ పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో ఒకే నంబర్‌ జెర్సీ(45)ని ధరించి ఆడటం. ఈ విషయం కొంతమంది అభిమానులకు తెలియపోవచ్చు. దీంతో ఇందుకు సంబంధించిన ఫోటోని రోహిత్ శర్మ తన ఇనిస్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.

<strong>స్టీవ్ స్మిత్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన మెక్‌గ్రాత్</strong>స్టీవ్ స్మిత్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన మెక్‌గ్రాత్

జెర్సీ నంబర్‌ కనపడేలా ఫోజు

ఈ ఫోటోలో ఇద్దరూ తమ జెర్సీ నంబర్‌ కనపడేలా ఫోజులిచ్చారు. రోహిత్ శర్మను భారత అభిమానులు హిట్ మ్యాన్ అని పిలుచుకుంటే... గేల్‌ను యూనివర్సల్ బాస్ అని పిలుస్తుంటారు. ఇద్దరూ క్రీజులో కుదురుకున్నారంటే పరుగుల వరద పారాల్సిందే. ప్రత్యర్థి బౌలర్ల బౌలింగ్‌లో సిక్సర్లు బాదడంలో ఇద్దరూ సిద్దహస్తులే.

క్రిస్ గేల్‌కు ఇదే ఆఖరి సిరిస్

క్రిస్ గేల్‌కు ఇదే ఆఖరి సిరిస్

ఇదిలా ఉంటే ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన వన్డే వరల్డ్‌కప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు క్రిస్ గేల్ వీడ్కోలు పలుకుతానని ప్రకటించాడు. అయితే, తన నిర్ణయాన్ని మార్చుకుని స్వదేశంలో టీమిండియాతో జరగబోయే వన్డే సిరిస్ తర్వాత ఆటకు వీడ్కోలు పలుకుతానని చెప్పాడు. దీంతో ఈ సిరీస్‌తో గేల్ క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నాడు.

అరుదైన రికార్డుకి చేరువలో గేల్

అరుదైన రికార్డుకి చేరువలో గేల్

ఈ సిరిస్‌లో క్రిస్ గేల్ కోసం ఓ అరుదైన రికార్డు ఎదురు చూస్తోంది. వెస్టిండిస్ తరుపున వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా బ్రియన్‌లారా(10,405) కొనసాగుతున్నాడు. ఈ సిరిస్‌లో క్రిస్ గేల్‌ మరో 12 పరుగులు చేస్తే బ్రియాన్ లారా రికార్డుని అధిగమిస్తాడు.

చాహల్‌ పాత్ర పోషించిన రోహిత్.. మరి చాహల్‌ ఏమన్నాడో తెలుసా!!

తొలి వన్డే‌కి వర్షం అడ్డంకి

తొలి వన్డే‌కి వర్షం అడ్డంకి

మూడు వన్డేల సిరిస్‌‌లో భాగంగా భారత్-వెస్టిండిస్ జట్ల మధ్య తొలి వన్డే గురువారం గుయానా వేదికగా జరగనుంది. ఇప్పటికే మూడు టీ20ల సిరిస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా ఇప్పుడు వన్డే సిరిస్‌పై కన్నేసింది. అయితే, తొలి వన్డేకి వరుణుడు ఆటంకం కలిగించే అవకాశం ఉంది. మ్యాచ్‌ ఆరంభమయ్యే సమయంలో వర్షం కురిసే అవకాశముందని స్థానిక వాతావరణ శాఖ తెలిపింది.

Story first published: Thursday, August 8, 2019, 12:37 [IST]
Other articles published on Aug 8, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X