న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సీఎస్‌కే చేతిలో మా ఓటమికి అదే కారణం: రోహిత్ శర్మ

Rohit Sharma reveals reason behind the Mumbai Indians defeat against CSK

అబుదాబి: బ్యాట్స్‌మన్ వైఫల్యం కారణంగానే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్‌లో శుభారంభాన్ని అందుకోలేకపోయామని ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో శనివారం అబుదాబి వేదికగా జరిగిన ఫస్ట్ మ్యాచ్‌లో రోహిత్ సేన 5 వికెట్లతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. మ్యాచ్‌కు ముందు పేపర్‌పై చాలా బలంగా కనిపించిన ఆ జట్టు.. మైదానంలో మాత్రం పూర్తిగా తేలిపోయింది. అటు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో సమష్టిగా విఫలమై మూల్యం చెల్లించుకుంది. అయితే మ్యాచ్ అనంతరం ఈ ఓటమిపై కెప్టెన్ రోహిత్ స్పందించాడు.

సీఎస్‌కేదే క్రెడిట్..

సీఎస్‌కేదే క్రెడిట్..

ఈ విజయం క్రెడిట్ పూర్తిగా సీఎస్‌కేదేనని, తమ కన్నా మెరుగ్గా ఆడి విజయాన్నందుకుందని అభినందించాడు. ఈ మ్యాచ్‌లో తాము చేసిన తప్పిదాలను సరిదిద్దుకొని తదుపరి మ్యాచ్‌కు సిద్దమవుతామన్నాడు. ‘డూప్లెసిస్, రాయుడులా మా బ్యాట్స్‌మెన్ రాణించలేకపోయారు. మాకు లభించిన శుభారంభంతో ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించే విషయంలో మేం విఫలమయ్యాం. కానీ ఈ క్రెడిట్ చెన్నై బౌలర్లదే. అద్భుతంగా బౌలింగ్ చేశారు. వారి నుంచి మేం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఈ విజయం క్రెడిట్ పూర్తిగా ఆ జట్టుదే.

మా తప్పులు తెలిసాయి..

మా తప్పులు తెలిసాయి..

ఇది ప్రారంభమే కాబట్టి మేం మెరుగవ్వడానికి చాలా సమయం ఉంది. మేం అద్భుతంగా ప్రారంభించాలనుకున్నాం. ఈ టోర్నీలో సమతూకమైన జట్టుతో బరిలోకి దిగడం చాలా కీలకం. ఈ ఓటమి ద్వారా మా జట్టులోని లోపాలను తెలిసాయి. వీటిని మెరుగుపరుచుకొని తదుపరి మ్యాచ్‌కు సిద్దమవుతాం. మేం తరుచుగా ఆడే పరిస్థితులకన్నా ఇది పూర్తి విభిన్నంగా ఉంది. మమ్మల్ని ఉత్సాహరిచేందుకు నిర్వాహకులు ఫేక్ ఆడియన్స్ సౌండ్స్‌తో మంచి ఏర్పాట్లు చేశారు.

పిచ్‌లను అర్థం చేసుకోవాలి..

పిచ్‌లను అర్థం చేసుకోవాలి..

మేం ఇక్కడి పిచ్‌లు, పరిస్థితులను అర్థం చేసుకోవడంతో పాటు అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. మ్యాచ్ సాగేకొద్ది పిచ్ అనుకూలంగా మారింది. మేం పెద్ద మైదానంలో ఆడలేదని కాదు. కానీ ఎంత సేపు షాట్స్ ఆడకుండా సింగిల్స్, డబుల్స్‌తో కూడా స్కోర్ బోర్డును ముందుకు నడిపించే ప్రయత్నం చేయాల్సింది. ఈ విషయాలన్నిటిపై మేం కసరత్తులు చేయాల్సిన అవసరం ఉంది.'అని రోహిత్ చెప్పుకొచ్చాడు. ఇక టాస్ ఓడి మంచి ఆరంభాన్ని అందుకున్న ముంబై.. మిడిల్ ఓవర్లలో భారీ షాట్స్ ఆడి వికెట్లు చేజార్చుకుంది. దీంతో స్వల్ప స్కోర్‌కే పరిమితమై ఓటమిపాలైంది.

రాయుడో.. రాయుడు..

రాయుడో.. రాయుడు..

మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై ఫీల్డింగ్ ఎంచుకోగా.. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 162 రన్స్ చేసింది. సౌరభ్ తివారీ(31 బంతుల్లో 3 ఫోర్లు, 1 సి‌క్స్‌తో 42), క్వింటన్ డికాక్(20 బంతుల్లో 5 ఫోర్లతో 33) టాప్ స్కోరర్లుగా నిలిచారు. చెన్నై బౌలర్లలో లుంగి ఎంగిడి 3 వికెట్లు తీయగా.. చాహర్, జేడేజా రెండేసి వికెట్ల పడగొట్టారు. చావ్లా, సామ్ కరన్‌లకు చెరొక వికెట్ లభించింది.

అనంతరం చెన్నై 19.2 ఓవర్లలో 5 వికెట్లకు 166 పరుగులు చేసి 4 బంతులు మిగిలుండగానే విజయాన్నందుకుంది. తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు(48 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 71), ఫాఫ్ డూప్లెసిస్( 44 బంతుల్లో 6 ఫోర్లతో 58 నాటౌట్), సామ్ కరన్(6 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లతో 18)మెరుపులు మెరిపించారు. ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, ప్యాటిన్సన్, పాండ్యా, చాహర్, బుమ్రా తలో వికెట్ తీశారు.

ఓయ్ రోహిత్ ఏందీ ఈ పొట్ట లాక్‌డౌన్ ఎఫెక్టా..నెట్టింట పేలుతున్న జోక్స్, మీమ్స్!

Story first published: Sunday, September 20, 2020, 15:09 [IST]
Other articles published on Sep 20, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X