న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఓయ్ రోహిత్ ఏందీ ఈ పొట్ట లాక్‌డౌన్ ఎఫెక్టా..నెట్టింట పేలుతున్న జోక్స్, మీమ్స్!

Rohit Sharma and Co fat-shamed for lockdown waistlines during MI vs CSK match 1

హైదరాబాద్: అనుభవంతో కూడిన ఆటతో చెలరేగిన చెన్నై సూపర్ కింగ్స్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2020 సీజన్ ఫస్ట్ ఫైట్‌లోనే డిఫెండింగ్ చాంపియన్స్ ముంబై ఇండియన్స్‌కు చెక్‌పెట్టింది. ఆల్‌రౌండ్‌షోతో అదరగొడుతూ.. శనివారం అబుదాబి వేదికగా జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో గెలిచింది. స్టో స్టార్టర్‌గా పేరున్న ముంబై ఇండియన్స్ బ్యాటింగ్, బౌలింగ్‌లోనూ తేలిపోయింది. ఓవరాల్‌గా ఫ్యాన్స్ లేకున్నా.. హంగామా లేకపోయినా.. తీవ్రతలో ఏమాత్రం తేడా లేకుండా సాగిన మ్యాచ్.. టీవీ ప్రేక్షకులను కట్టిపడేసింది. అయితే ఈ మ్యాచ్‌ బరిలో దిగిన ఇరు జట్ల ఆటగాళ్లను చూస్తే వారిపై కరోనా లాక్‌డౌన్ ప్రభావం పడినట్లు స్పష్టంగా కనిపించింది.

ఫిట్‌నెస్ కోల్పోయిన ఆటగాళ్లు..

దాదాపు 6 నెలల తర్వాత మైదానంలోకి దిగడం.. ఇన్ని రోజులు కనీసం ప్రాక్టీస్ కూడా చేయకపోవడంతో వారంత మునపటి లయ తప్పారు. ఫీల్డింగ్‌లో ఘోర తప్పిదాలు చేశారు. ఇక ఫిట్‌నెస్ విషయంలో కూడా అందరూ బరువుపెరిగినట్లు కనిపించింది. రోహిత్ శర్మ, మహేంద్ర సింగ్ ధోనీ వంటి స్టార్ ఆటగాళ్లకు కూడా పొట్టలు వచ్చాయి. ఇప్పుడే ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఓ ఆట ఆడుకుంటున్నారు. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మను తెగ ట్రోల్ చేస్తున్నారు. ఫన్నీ మీమ్స్‌తో నవ్వులు పూయిస్తున్నారు.

రోహిత్ ఏందీ ఈ పొట్ట..

ఇక టాస్‌కు వచ్చినప్పుడే రోహిత్ శర్మ బరువు పెరిగినట్లు, తన్నుకొచ్చిన అతని పొట్టతో స్పష్టమైంది. దీంతో రోహిత్‌పై నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘లాక్‌డౌన్ ఎఫ్టెక్ట్ రోహిత్ శర్మలో స్పష్టంగా కనిపించింది'అని ఒకరంటే.. రోహిత్ పరిస్థితి బరువెక్కిన సల్మాన్‌లా ఉందని మరొకరు కామెంట్ చేశారు. పొట్టలేసుకొని రోహిత్ శర్మ, సౌరభ్ తివారీ బౌండరీ వద్ద నానా తిప్పలు పడ్డారని, రోహిత్ శర్మ పొట్ట చూసి దిమ్మతిరిగిందని, ఆ పొట్టేసుకొని రోహిత్ నానా ఇబ్బంది పడ్డాడని ట్రోల్ చేశారు. ఇక ఈ ట్రోలింగ్‌ను రోహిత్ ఫ్యాన్స్ కూడా తిప్పికొట్టారు. రోహిత్ బరువు పెరిగినా.. ఇతర ఆటగాళ్ల కంటే మెరుగ్గా రాణిస్తాడని, ఆరు నెలలు ఇంట్లో కూర్చుంటే ఎవరైనా అలానే అవుతారని బదులిస్తున్నారు.

మైదానానికే బొక్కపడేట్టుంది..

ఇక ఇరు జట్లలోని ఆటగాళ్ల బరువు కారణంగా మైదానానికే బొక్కపడేట్లు ఉందనే మీమ్‌ను ట్రెండ్ చేశారు. అధిక బరువున్న బెర్ముడా క్రికెటర్ డ్వేన్ లెవెరాక్ ఐపీఎల్ 2020లో లేకపోవడం మంచిదైందని సెటైరిక్‌గా కామెంట్ చేశారు. లాక్‌డౌన్ ఎఫెక్ట్ క్రికెటర్లలోననూ కనిపించింది. ఐపీఎల్ ఆడుతున్న వారందరికీ పొట్టలు పెరిగిపోయి కనిపిస్తున్నాయి. రోహిత్ శర్మతో సహా అని ట్వీట్ చేశారు. ఇక ధోనీ ఫిట్‌గా మహీ ఫ్యాట్‌గా కనిపించాడని వ్యంగ్యస్త్రాలు సంధించారు. ఇక ప్రముఖ కామెంటేర్ హర్షబోగ్లే సైతం ఆటగాళ్ల పొట్టలపై కామెంట్ చేస్తూ ట్వీట్ చేశాడు. ఆటగాళ్ల ఫిట్ నెస్ చూసి షాకయ్యానని భారత హాకీ మాజీ కెప్టెన్ విరెన్ రస్క్‌న్హా ట్విటర్ వేదికగా అసహనం వ్యక్తం చేశారు. ‘నేను గల్లీ క్రికెట్‌కు మించి ఆడలేదు. కానీ ఐపీఎల్ 2020 సీజన్‌లో ఆటగాళ్ల ఫిట్‌నెస్ చూసి అవాక్కయ్యా. ఏ ఇతర క్రీడలో కూడా నాకు ఇలా కనిపించలేదు'అని ట్వీట్ చేశారు.

రఫ్ఫాడించిన రాయుడు..

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై ఫీల్డింగ్ ఎంచుకోగా.. ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 162 రన్స్ చేసింది. సౌరభ్ తివారీ(31 బంతుల్లో 3 ఫోర్లు, 1 సి‌క్స్‌తో 42), క్వింటన్ డికాక్(20 బంతుల్లో 5 ఫోర్లతో 33) టాప్ స్కోరర్లుగా నిలిచారు. చెన్నై బౌలర్లలో లుంగి ఎంగిడి 3 వికెట్లు తీయగా.. చాహర్, జేడేజా రెండేసి వికెట్ల పడగొట్టారు. చావ్లా, సామ్ కరన్‌లకు చెరొక వికెట్ లభించింది. అనంతరం చెన్నై 19.2 ఓవర్లలో 5 వికెట్లకు 166 పరుగులు చేసి 4 బంతులు మిగిలుండగానే విజయాన్నందుకుంది. తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు(48 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 71), ఫాఫ్ డూప్లెసిస్( 44 బంతుల్లో 6 ఫోర్లతో 58 నాటౌట్), సామ్ కరన్(6 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లతో 18)మెరుపులు మెరిపించారు.

ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, ప్యాటిన్సన్, పాండ్యా, చాహర్, బుమ్రా తలో వికెట్ తీశారు.

MI vs CSK match 1: ముంబై ఇండియన్స్‌ను ముంచిన మూడు తప్పిదాలు!

Story first published: Sunday, September 20, 2020, 8:44 [IST]
Other articles published on Sep 20, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X