న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ఓపెనర్‌గా ధావన్ వద్దు.. రోహిత్‌కి జోడీగా రాహుల్ బెటర్'

Rohit Sharma, KL Rahul should be first preference: Aakash Chopra on Indias T20I opening pair


ముంబై: టీ20ల్లో ఓపెనింగ్ జోడీ గురించి భారత మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్‌‌ ఆకాశ్ చోప్రా స్పదించాడు. టీ20ల్లో స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మకి జోడీగా శిఖర్ ధావన్ వద్దని, లోకేష్ రాహుల్ బెటర్ ఆప్షన్ అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. రోహిత్‌-రాహుల్‌లకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని భారత కామెంటేటర్‌‌ సూచించాడు. నిజానికి గత ఏడాది వరకూ రోహిత్ శర్మకి జోడీగా ఓపెనర్‌గా ఎవరైతే బాగుంటుందంటే.. ధావన్ పేరు వినిపించేది. కానీ ఇపుడు ఆ పరిస్థితి లేదు. 2019 వన్డే ప్రపంచకప్‌ తర్వాత ధావన్‌కి బదులుగా రాహుల్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది.
రోహిత్‌కి జోడీగా రాహుల్ బెటర్:

రోహిత్‌కి జోడీగా రాహుల్ బెటర్:

తాజాగా ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ ఛానెల్‌లో చాట్ షో నిర్వహించగా.. టీ20ల్లో ఓపెనింగ్ జోడీ గురించి మీ అభిప్రాయం చెప్పాలని ఓ అభిమాని ప్రశ్నించాడు. 'రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ ఓపెనింగ్ కాంబినేషన్‌ శకం ముగిసిందని నేను అనుకోవట్లేదు. ధావన్ ఇప్పటికీ మెరుగ్గా ఆడుతున్నాడు. అయితే రోహిత్, రాహుల్‌తో పోలిస్తే ప్రస్తుతం గబ్బర్ కాస్త వెనుకబడి ఉన్నాడు. నా అంచనా ప్రకారం టీ20ల్లో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌లకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. వీరిద్దరే బెస్ట్ ఓపెనింగ్ జోడి' అని చోప్రా చెప్పాడు.

 ధావన్‌ను విస్మరించలేం:

ధావన్‌ను విస్మరించలేం:

వన్డేల్లో ఓపెనింగ్ కాంబినేషన్‌ గురించి ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ... 'వన్డేల్లో మాత్రం రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ జోడీని మార్చాల్సిన అవసరం లేదు. ఇక్కడ ధావన్‌ను విస్మరించలేం. ఎందుకంటే.. రోహిత్-ధావన్ మంచి భాగస్వామ్యాలు నెలకొల్పారు. ఇద్దరూ సెంచరీల భాగస్వామ్యాలు నెలకొల్పడం మనం చూసే ఉంటాం. వన్డేల్లో రాహుల్ ఏ స్థానంలోనైనా ఆడగలడు. టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ ఎక్కడైనా అతడు పరుగులు చేస్తాడు' అని పేర్కొన్నాడు.

రాహుల్‌కు ఆ అవకాశం ఇవ్వొద్దు:

రాహుల్‌కు ఆ అవకాశం ఇవ్వొద్దు:

టెస్ట్ క్రికెట్‌లో వికెట్ కీపింగ్ చాలా ప్రత్యేకమైందని ఆకాష్ చోప్రా పేర్కొన్నాడు. చిన్న తప్పిదం చేసినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుందన్నాడు. 'క్రికెట్‌లో ఏమైనా చేయొచ్చు కానీ టెస్టుల్లో కీపర్లకు షిఫ్టింగ్‌ పద్ధతి ఉండకూడదు. సుదీర్ఘ ఫార్మాట్‌లో వికెట్‌కీపింగ్‌ అనేది ప్రత్యేక బాధ్యత. అక్కడ 100 ఓవర్ల పాటు కీపింగ్‌ చేయాల్సి ఉంటుంది. కావాలంటే ఈ విషయంపై మాజీ బౌలర్‌ సందీప్‌శర్మ అభిప్రాయం అడగండి. 1990లో లార్డ్స్‌ మైదానం వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టులో అతడి బౌలింగ్‌లోనే కిరణ్ ‌మోరే.. గ్రాహం గూచ్‌ క్యాచ్‌ను వదిలేశాడు. దీంతో అతడు 333 పరుగులు సాధించాడు. ఈ ఫార్మాట్‌లో కీపర్లు క్యాచ్‌లు వదిలేసినా, స్టంపింగ్‌ చేయడాలు వదిలేసినా అవి భారీ మూల్యానికి దారితీస్తాయి. కాబట్టి టెస్టుల్లో కీపర్లను మార్చకూడదు' అని ఆకాశ్‌చోప్రా వివరించాడు.

 టెస్టుల్లో ఆడాలంటే రాహుల్ వేచిచూడాల్సిందే:

టెస్టుల్లో ఆడాలంటే రాహుల్ వేచిచూడాల్సిందే:

లోకేష్ రాహుల్‌ వైవిధ్యమైన ఆటగాడని, ఏ స్థానంలోనైనా బ్యాటింగ్‌ చేయగల సమర్థుడని ఆకాశ్‌చోప్రా మెచ్చుకున్నాడు. అయితే అతడికి టెస్టుల్లో ఆడే అవకాశం లేదన్నాడు. స్పెషలిస్టు బ్యాట్స్‌మన్‌గా నైనా ఆడించడం కష్టమన్నాడు. టాప్‌, మిడిల్‌ ఆర్డర్లలో ఇప్పటికే సరిపడా బ్యాట్స్‌మన్‌ ఉన్నారన్నాడు. ఇక కీపింగ్‌ విభాగంలోనూ వృద్ధిమాన్‌ సాహాను తప్పించడానికి అతడు ఏ తప్పూ చేయలేదన్నాడు. ఇప్పటికైతే రాహుల్‌ టెస్టుల్లో ఆడాలంటే వేచిచూడాలని కామెంటేటర్‌‌ పేర్కొన్నాడు.

చెఫ్ అవతారమెత్తిన హార్దిక్ పాండ్యా.. ఆటపట్టించిన ధావన్!!

Story first published: Tuesday, June 23, 2020, 12:42 [IST]
Other articles published on Jun 23, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X