For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చెఫ్ అవతారమెత్తిన హార్దిక్ పాండ్యా.. ఆటపట్టించిన ధావన్!!

Hardik Pandya showcases his culinary skills, makes Cheese Butter Masala for family

ముంబై: కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశంలో లాక్‌డౌన్ విధించడంతో దాదాపు మూడు నెలలుగాఆటగాళ్లు అందరూ ఇంటికే పరిమితమయ్యారు. లాక్‌డౌన్‌ సడలింపుల నేపథ్యంలో ఇప్పుడిప్పుడే కొందరు భారత క్రికెట్ ఆటగాళ్లు మైదానంలోకి అడుగుపెడుతున్నారు. మరోవైపు ముంబైలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న కారణంగా ఆల్‌రౌండర్‌ హార్దిక్ పాండ్యా ఇంటికే పరిమితమయ్యాడు. అయితే సోషల్ మీడియాలో తనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నాడు.

పాండ్యా సరికొత్త అవతారం:

పాండ్యా సరికొత్త అవతారం:

హార్దిక్​ పాండ్యా సరికొత్త అవతారమెత్తాడు. వంటింట్లో గరిటె తిప్పాడు. కలర్​ఫుల్ ఆఫ్రాన్ వేసుకొని వంట చేస్తూ నవ్వుతున్న ఫొటోను హార్దిక్ సోమవారం ఇన్​స్టాగ్రామ్​లో పోస్ట్ చేశాడు. 'నా చేత్తో కొత్త విషయాలు నేర్చుకునేందుకు మరీ ఆలస్యం కాలేదు. చీస్ బటర్ మసాలా చేసేందుకు ఇంట్లో చెఫ్​డ్యూటీకి మారా' అని హార్దిక్ పాండ్యా రాసుకొచ్చాడు. హార్దిక్ పోస్ట్ చేసిన ఫొటోకు అభిమానులు లైక్​లు, కామెంట్ల వర్షం కురిపించారు.

ఆటపట్టించిన ధావన్:

ఆటపట్టించిన ధావన్:

వంట చేస్తున్న హార్దిక్ పాండ్యాను ఓపెనర్ శిఖర్ ధావన్ సరదా కామెంట్​తో ఆటపట్టించాడు. 'ఆ వంటకం నువ్వే చేసి ఉంటావని నేను నమ్ముతున్నా సోదరా' అని గబ్బర్​ కామెంట్ చేశాడు. హార్దిక్ సతీమణి నటాషా స్టాంకోవిచ్, భారత పేసర్ మునాఫ్ పటేల్ కూడా చెఫ్ విధులను నిర్వర్తిస్తున్న పాండ్యాను ప్రశంసించారు. తాను తండ్రి కాబోతున్న విషయాన్ని కూడా ఇటీవల హార్దిక్ ఇన్​స్టాగ్రామ్​ ద్వారా అభిమానులకు తెలియజేశాడు.

వెన్నుగాయంతో టీమిండియాకు దూరం:

వెన్నుగాయంతో టీమిండియాకు దూరం:

గతేడాది సెప్టెంబర్‌లో వెన్నుగాయంతో టీమిండియాకు దూరమైన హార్దిక్‌ పాండ్యా .. శస్త్ర చికిత్స తర్వాత గత ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌ 'ఎ' పర్యటనకు వెళ్లాల్సి ఉంది. కాగా చివరి నిమిషంలో హార్దిక్‌ ఇంకా కోలుకోలేకపోవడంతో ఆ పర్యటనకు దూరమయ్యాడు. పాండ్యా కోసం బీసీసీఐ కొన్ని రోజులు జట్టు ఎంపికను కూడా వాయిదా వేసింది. ఆపై దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌కు ఎంపికైనా.. అది కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా జరగలేదు. అయితే ప్రొటీస్ సిరీస్ ముందు హార్దిక్‌ తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకునే క్రమంలో రెచ్చిపోయి ఆడాడు. దేశవాళీ టోర్నీలో భాగంగా డివై పాటిల్‌ టీ20 కప్‌లో రిలయన్స్‌-1 తరఫున ఆడిన హార్దిక్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.

మూడు నెలల తర్వాత బ్యాట్ పట్టిన పుజారా!!

Story first published: Tuesday, June 23, 2020, 11:55 [IST]
Other articles published on Jun 23, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+