న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రికార్డులు బద్దలు కొట్టి.. సచిన్, వార్నర్‌ల సరసన రోహిత్

Rohit Sharma breaks Sachin Tendulkar and David Warner’s joint record

హైదరాబాద్: వెస్టిండీస్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. గౌహతిలో అదివారం జరిగిన తొలి వన్డేలో కెప్టెన్ విరాట్ కోహ్లీ(140: 107 బంతుల్లో 21 ఫోర్లు, 2 సిక్సర్లు), ఓపెనర్ రోహిత్ శర్మ(152 నాటౌట్: 110 బంతుల్లో 15 ఫోర్లు, 8 సిక్సర్లు) సెంచరీలతో చెలరేగడంతో విండీస్‌పై భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.

 సచిన్, వార్నర్‌ల పేరిట ఉన్న రికార్డును

సచిన్, వార్నర్‌ల పేరిట ఉన్న రికార్డును

అయితే విన్నింగ్స్ షాట్ సిక్సర్ కొట్టి 150 పరుగుల మార్క్ చేరుకున్న రోహిత్.. సచిన్ టెండూల్కర్, ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ల పేరిట ఉన్న రికార్డును అదిగమించాడు. వన్డేల్లో అత్యధిక ఇన్నింగ్స్‌లలో 150 లేక అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన తొలి క్రికెటర్‌గా రోహిత్ నిలిచాడు. సచిన్, వార్నర్‌లు వన్డేల్లో 5 పర్యాయాలు 150 మార్కు చేరుకోగా, విండీస్‌తో జరిగిన తొలి వన్డేలో 152నాటౌట్‌తో రోహిత్ 6 పర్యాయాలు ఆ అరుదైన ఫీట్ చేసిన తొలి ఆటగాడిగా అరుదైన రికార్డు నెలకొల్పాడు.

క్రికెటర్ల భార్యలను పర్యటనలకు అనుమతించాల్సిందే..!!

భారత క్రికెటర్ల 200 పరుగుల భాగస్వామ్యం

భారత క్రికెటర్ల 200 పరుగుల భాగస్వామ్యం

ఆ వన్డేలో కోహ్లీతో కలిసి రెండొందల పైచిలుకు భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. విండీస్‌పై వన్డేల్లో భారత క్రికెటర్లు నెలకొల్పిన తొలి 200 పరుగుల భాగస్వామ్యం కావడం గమనార్హం. బుధవారం విశాఖపట్నంలో భారత్, విండీస్ రెండో వన్డేలో తలపడనున్నాయి.

వన్డేల్లో 150 లేక అంతకంటే ఎక్కువ:

వన్డేల్లో 150 లేక అంతకంటే ఎక్కువ:

రోహిత్ శర్మ- 6 ఇన్నింగ్స్‌లు

సచిన్, వార్నర్ - 5 ఇన్నింగ్స్‌లు

క్రిస్ గేల్, సనత్ జయసూర్య, హషీం ఆమ్లా - 4 ఇన్నింగ్స్‌లు

రోహిత్ శర్మ ఇప్పటివరకూ 150కి పైగా స్కోరు చేసిన ఇన్నింగ్స్‌లివే:

రోహిత్ శర్మ ఇప్పటివరకూ 150కి పైగా స్కోరు చేసిన ఇన్నింగ్స్‌లివే:

2013లో బెంగళూరు వేదికగా ఆస్ట్రేలియాపై 203

2014లో కోల్‌కత్తా వేదికగా శ్రీలంకపై 264

2015లో కాన్పూర్ వేదికగా దక్షిణాఫ్రికాపై150

2016లో పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాపై 171

2017లో మొహాలీ వేదికగా శ్రీలంకపై 208

2018లో గువాహటి వేదికగా వెస్టిండీస్‌పై 152

Story first published: Tuesday, October 23, 2018, 10:19 [IST]
Other articles published on Oct 23, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X