Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

క్రికెటర్ల భార్యలను పర్యటనలకు అనుమతించాల్సిందే..!!

BCCIs respond to Virat Kohlis request in wives on tour matter

హైదరాబాద్: విదేశీ పర్యటనల్లో భారత క్రికెటర్లతో వారి భార్యలను రెండు వారాలకు మించి ఉండనివ్వరాదన్న బీసీసీఐ విధానంపై కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. భార్యలను పర్యటన ఆసాంతం ఉండనివ్వాలని బోర్డును అభ్యర్థించాడు. దీనిపై బీసీసీఐ ఇంకా నిర్ణయం తీసుకోవాల్సివుండగా.. కోహ్లి విజ్ఞప్తిని బోర్డు మన్నించాలని మాజీ కెప్టెన్‌ గావస్కర్‌ అభిప్రాయపడ్డాడు.

 కోహ్లి విజ్ఞప్తిని బీసీసీఐ అంగీకరించాలి

కోహ్లి విజ్ఞప్తిని బీసీసీఐ అంగీకరించాలి

‘క్రికెటర్ల భార్యలను పర్యటన మొత్తం వారితో ఉండనివ్వాలన్న కోహ్లి విజ్ఞప్తిని బీసీసీఐ అంగీకరించాలి. ఏ ఉద్యోగి అయినా కార్యాలయంలో పని ముగించుకున్నాక ఇంటికొచ్చి భార్య, పిల్లలతో ఉంటాడు. భారత క్రికెటర్ల విషయంలోనూ అలాగే జరగాలి. ఆటగాళ్లు ఆట పూర్తయ్యాక హోటల్‌కు వచ్చి భార్యలతో కలిసుండే వీలుండాలి' అని గావస్కర్‌ చెప్పాడు.

మరో రికార్డు: సచిన్, హెడెన్, జో రూట్‌ల ఎలైట్ జాబితాలోకి విరాట్ కోహ్లీ

గదిని పంచుకుని మరో ఆటగాణ్ని మరో గదికి

గదిని పంచుకుని మరో ఆటగాణ్ని మరో గదికి

‘అదృష్టవశాత్తు ఇప్పుడు ప్రతి ఆటగాడికీ ఒక గది ఇస్తున్నారు. గతంలోలా గదిని పంచుకునే మరో ఆటగాణ్ని మరో గదికి వెళ్లమని చెప్పాల్సిన అవసరం లేదు. భార్యలను అనుమతించడానికి సంబంధించి నిర్ణయం తీసుకునేవాళ్లు తమ స్థితి గురించి ఆలోచించాలి. వాళ్లు పనయ్యాక ఇంటికి వెళ్తారా. వెళ్లరా? ఆటగాళ్లూ అంతే మరి' అని అన్నాడు. క్రికెటర్లు కూడా అందరిలాంటి వాళ్లేనని గావస్కర్‌ చెప్పాడు.

క్రికెటర్ల భార్యలను వారితో ఉండనివ్వాలని

క్రికెటర్ల భార్యలను వారితో ఉండనివ్వాలని

మొదటి పది రోజులు మినహా పర్యటన పూర్తయ్యే వరకు క్రికెటర్ల భార్యలను వారితో ఉండనివ్వాలని బీసీసీఐ నిర్ణయించినట్లు వచ్చిన వార్తలపైనా అతడు స్పందించాడు. ‘పది రోజుల తర్వాత పంపాలన్న ఆలోచనలో అర్థముంది. ఎందుకంటే ఈ లోపు ప్రాక్టీస్‌, జట్టు సమావేశాలు, అధికారిక కార్యక్రమాలు, స్పాన్సర్లకు సంబంధించిన కార్యక్రమాలు ముగుస్తాయి. జట్టు మ్యాచ్‌లకు సర్వసన్నద్ధంగా ఉంటుంది. అప్పుడు భార్యలు వచ్చినా ఆటగాళ్ల ఏకాగ్రతకు భంగం కలగదు' అని గావస్కర్‌ అన్నాడు.

కొత్త వాళ్లను.. టీమ్‌ మేనేజ్‌మెంట్‌ హెచ్చరించాలని

కొత్త వాళ్లను.. టీమ్‌ మేనేజ్‌మెంట్‌ హెచ్చరించాలని

ఆస్ట్రేలియాలో పర్యటించే భారత ఆటగాళ్లను, ముఖ్యంగా కొత్త వాళ్లను.. ఆసీస్‌ జట్టు సహాయ సిబ్బంది, మీడియా గురించి టీమ్‌ మేనేజ్‌మెంట్‌ హెచ్చరించాలని గావస్కర్‌ అన్నాడు. ‘వాళ్లు సమస్యలు సృష్టించడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తారు. ఆటగాళ్ల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తారు. ఆ పనిలో వాళ్లు సిద్ధహస్తులు' అని చెప్పాడు.

Story first published: Tuesday, October 23, 2018, 9:20 [IST]
Other articles published on Oct 23, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+