న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మరో టీమిండియా మాజీ క్రికెటర్‌కు కరోనా పాజిటివ్.. ఆందోళనలో మిగతావారు!!

Road Safety World Series: Irfan Pathan tests positive for Coronavirus

ముంబై: టీమిండియా మాజీ క్రికెటర్లను కరోనా వైరస్ మహమ్మారి వెంటాడుతోంది. ఇటీవల ముగిసిన రోడ్‌ సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌లో పాల్గొన్న వారికి వరుసగా కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అవుతుండటంతో.. మరికొంతమంది మాజీ క్రికెటర్‌లలో ఆందోళన పెరుగుతోంది. శనివారం క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌, మాజీ ఆల్‌రౌండర్ యూసఫ్ పఠాన్‌కు కొరోనా సోకగా.. ఆదివారం మాజీ బ్యాట్స్‌మన్‌ ఎస్‌ బద్రీనాథ్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. ఇక సోమవారం మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్‌కు కూడా కరోనా సోకింది.

ఇర్ఫాన్‌ పఠాన్‌కు కరోనా

పరీక్షలు చేయించుకోగా.. సోమవారం కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయినట్లు ఇర్ఫాన్ పఠాన్ ట్వీట్ చేశాడు. తనకు ఎలాంటి లక్షణాలు లేవని, అయినప్పటికీ కరోనా పాజిటివ్‌గా కావడంతో ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉన్నట్లు వెల్లడించాడు. 'నాకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఎలాంటి లక్షణాలు లేవు. ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉన్నా. ఈ మధ్య కాలంలో నన్ను కలిసిన వాళ్లందరూ పరీక్ష చేయించుకోండి. మాస్కులు పెట్టుకుని, సోషల్ డిస్టెన్స్ పాటించాలని అందరినీ కోరుతున్నా. అందరూ బాగుండాలని కోరుకుంటున్నా' అని పఠాన్ ట్వీట్ చేశాడు.

 ఆందోళనలో మిగతావారు

ఆందోళనలో మిగతావారు

తాజాగా ఇర్ఫాన్ పఠాన్‌కు కరోనా సోకడంతో రోడ్‌ సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌లో పాల్గొన్న వారిలో కోవిడ్ సోకిన వారి సంఖ్య నాలుగుకు చేరింది. ఇటీవల రాయ్‌పూర్‌లో జరిగిన సిరీస్‌లో సచిన్, యూసఫ్, బద్రీనాథ్, ఇర్ఫాన్ పాల్గొన్నారు. వీరంతా ఇండియా లెజెండ్స్ తరుపున బరిలోకి దిగారు. అందరూ డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకోవడంతో వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, మొహ్మద్ కైఫ్, మునాఫ్ పటేల్, ప్రజ్ఞాన్ ఓజా, నమన్ ఓజా, ఆర్ వినయ్ కుమార్‌లలో ఆందోళన మొదలైంది. రాయ్‌పుర్‌లో జరిగిన రోడ్‌సేఫ్టీ సిరీస్‌కు వేల సంఖ్యలో ప్రేక్షకులను అనుమతించారు.

అక్కడ కరోనా నిబంధనలేవీ పాటించలేదని నిర్వాహకులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంకా ఎంతమందికి కరోనా సోకుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

క్వారెంటైన్‌లో ఉన్నా:

క్వారెంటైన్‌లో ఉన్నా:

'ఇటీవ‌ల నిత్యం క‌రోనా టెస్టింగ్ చేయించుకుంటూనే ఉన్నాను. కరోనాకు దూరంగా ఉండేందుకు అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నాను. ఏదేమైనా ఈరోజు నిర్వ‌హించిన టెస్టింగ్‌లో క‌రోనా పాజిటివ్ వచ్చింది. స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు మాత్రమే ఉన్నాయి. ఇంట్లో ఉన్న ప్ర‌తి ఒక్క‌రికి నెగ‌టివ్‌గా వచ్చింది. ఇంట్లోనే క్వారెంటైన్‌లో ఉన్నాను. డాక్ట‌ర్లు ఇచ్చిన సూచ‌న‌ల ప్ర‌కార‌మే అన్ని మార్గ‌ద‌ర్శ‌కాల‌ను పాటిస్తున్నా. నాతో పాటు దేశంలోని అనేక మందికి మ‌ద్ద‌తు ఇస్తున్న హెల్త్‌కేర్ ప్రొఫెష‌న‌ల్స్‌కు థ్యాంక్స్ చెబుతున్నా' అని మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్‌ స‌చిన్ శనివారం త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఇండియా లెజెండ్స్‌ విజేత

ఇండియా లెజెండ్స్‌ విజేత

సచిన్ టెండూల్క‌ర్‌‌ సారథ్యంలోని ఇండియా లెజెండ్స్‌ ఫైనల్లో శ్రీలంక లెజెండ్స్‌పై విజయం సాదించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 181 పరుగులు చేసింది. యువరాజ్ సింగ్ (41 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 60), యూసఫ్ పఠాన్ (36 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 62 నాటౌట్) హాఫ్ సెంచరీలతో దుమ్మురేపగా.. సచిన్ (23 బంతుల్లో 5 ఫోర్లతో 30)మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నారు. అనంతరం శ్రీలంక 20 ఓవర్లలో 7 వికెట్లకు 167 పరుగులు చేసి ఓడింది.

India vs England: ఇంగ్లండ్‌పై సిరీస్‌ విజయం.. రెండో ర్యాంకుకు దూసుకెళ్లిన భారత్!!



Story first published: Tuesday, March 30, 2021, 7:38 [IST]
Other articles published on Mar 30, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X