న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Road Safety World Series 2020: దిగ్గజాల క్రికెట్ టోర్నీ.. సచిన్ vs లారా తలపడేదెప్పుడంటే?

Road Safety World Series 2020: Schedule, Teams & Players List, When and Where To Watch

హైదరాబాద్: రోడ్డు ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో దిగ్గజ మాజీ క్రికెటర్లతో రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ 2020 క్రికెట్ టోర్నీ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ముంబై వేదికగా జరిగిన ఓ కార్యక్రమంలో నిర్వహాకులు ఈ టోర్నీ వివరాలను వెల్లడించారు.

మహారాష్ట్ర ప్రభుత్వ రోడ్డు భద్రతా విభాగం.. అన్ అకాడమీ ఫ్రోఫెషనల్ మేనేజ్‌మెంట్ గ్రూప్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ టోర్నీ షెడ్యూల్‌ను శుక్రవారం విడుదల చేశారు. తొలి మ్యాచ్ సచిన్ టెండూల్కర్ ఆధ్వర్యంలోని భారత లెజెండ్స్, బ్రియాన్ లారా సారథ్యంలోని వెస్టిండీస్ లెజెండ్స్ మధ్య మార్చి 7న ముంబై వాంఖడే స్టేడియం వేదికగా జరగనుంది.

భారత్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్ దిగ్గజ మాజీ క్రికెటర్లు భాగస్వాములు కానున్న ఈ టోర్నీ ఫైనల్ క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియాలోని బ్రాబౌర్న్ మైదానం వేదికగా జరగనుంది.

నిజంగా అదృష్టం.. ఇన్ని మ్యాచ్‌లు ఆడుతాననుకోలేదు : టేలర్నిజంగా అదృష్టం.. ఇన్ని మ్యాచ్‌లు ఆడుతాననుకోలేదు : టేలర్

మొత్తం ఐదు టీమ్‌లు..

మొత్తం ఐదు టీమ్‌లు..

ఈ అన్ అకాడమీ రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌ టోర్నీలో భారత్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్ మాజీ క్రికెటర్లతో కూడిన ఐదు టీమ్‌లు పోటీపడనున్నాయి. ఈ ఐదు టీమ్‌లకు భారత్ లెజెండ్స్, వెస్టిండీస్ లెజెండ్స్, ఆస్ట్రేలియా లెజెండ్స్, శ్రీలంక లెజెండ్స్, సౌతాఫ్రికా లెజెండ్స్‌గా నామకరణం చేశారు.

కెప్టెన్లుగా సచిన్, లారా..

కెప్టెన్లుగా సచిన్, లారా..

ఇక ఈ టోర్నీలో మొత్తం 110 మంది మాజీ ఆటగాళ్లు బరిలోకి దిగనున్నారు. సచిన్ టెండూల్కర్ భారత జట్టును నడిపించనుండగా.. బ్రియన్ లారా( వెస్టిండీస్), బ్రెట్‌లీ(ఆస్ట్రేలియాన), జాంటీ రోడ్స్( సౌతాఫ్రికా), తిలక రత్న దిల్షాన్ (శ్రీలంక) కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు.

భారత జట్టులో..

భారత జట్టులో..

సచిన్ సారథ్యం వహిస్తున్న భారత జట్టులో మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, స్టార్ పేసర్లు జహీర్ ఖాన్, అజిత్ అగార్కర్‌, యువరాజ్ సింగ్, ఆడనున్నారు. ఇక సౌతాఫ్రికా లెజెండ్ జాక్వస్ కల్లీస్.. , శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీ దరణ్ కూడా బరిలోకి దిగనున్నారు.

మొత్తం ఎన్ని మ్యాచ్‌లంటే..

మొత్తం ఎన్ని మ్యాచ్‌లంటే..

ఈ టోర్నీలో మొత్తం 11 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. వాంఖడే మైదానంలో రెండు, ఎమ్‌సీఏ స్టేడియం పుణెలో 4, నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో నాలుగు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఫైనల్ మాత్రం బ్రాబౌర్న్ గ్రౌండ్ వేదికగా జరగనుంది.

ఈ సిరీస్ ఎందుకంటే?

ఈ సిరీస్ ఎందుకంటే?

ప్రతీ ఏడాది రోడ్డు ప్రమాదాల్లో మరణించే వారి సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా 1.35 మిలియన్లు ఉండగా.. కేవలం భారత్‌లోనే 1,49000 ఉండటం గమనార్హం. అంతేకాకుండా దేశంలో ప్రతీ నాలుగు నిమిషాలకు ఒకరు రోడ్డు ప్రమాదంలో చనిపోతున్నారు. రోజుకు సరాసరిగా సుమారు 1214 మంది ప్రమాదాల బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు. గత ఐదేళ్లలో సుమారు 65 లక్షల మంది దివ్యాంగులుగా మారారు.

దేశంలో క్రికెట్‌కు ఆదరణ ఎక్కువగా ఉండటంతో ఆ దిశగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తే మరింత ఎక్కువ మందికి రీచ్ అవుతామనే సదుద్దేశంతో ఈ టోర్నీ జరుపుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

టోర్నీ షెడ్యూల్..

టోర్నీ షెడ్యూల్..

మార్చి 7 - భారత్ లెజెండ్స్ vs వెస్టిండీస్ లెజెండ్స్, వాంఖడే (ముంబై)

మార్చి 8 - ఆస్ట్రేలియా లెజెండ్స్ vs శ్రీలంక లెజెండ్స్, వాంఖడే (ముంబై)

మార్చి 10 - భారత్ లెజెండ్స్ vs శ్రీలంక లెజెండ్స్, డీవై పాటిల్, (నవీ ముంబై)

మార్చి 11 - వెస్టిండీస్ లెజెండ్స్ vs దక్షిణాఫ్రికా లెజెండ్స్, డీవై పాటిల్, (నవీ ముంబై)

మార్చి 13 - దక్షిణాఫ్రికా లెజెండ్స్ vs శ్రీలంక లెజెండ్స్, డీవై పాటిల్, (నవీ ముంబై)

మార్చి 14 - భారత్ లెజెండ్స్ vs దక్షిణాఫ్రికా, ఎంసీఏ స్టేడియం(పుణె)

మార్చి 16 - ఆస్ట్రేలియా లెజెండ్స్ vs వెస్టిండీస్ లెజెండ్స్, ఎంసీఏ స్టేడియం(పుణె)

మార్చి 17 - వెస్టిండీస్ లెజెండ్స్ vs శ్రీలంక లెజెండ్స్, ఎంసీఏ స్టేడియం(పుణె)

మార్చి 19 - ఆస్ట్రేలియా లెజెండ్స్ vs దక్షిణాఫ్రికా లెజెండ్స్, ఎంసీఏ స్టేడియం(పుణె)

మార్చి 20 - భారత్ లెజెండ్స్ vs ఆస్ట్రేలియా లెజెండ్స్, డీవై పాటిల్, (నవీ ముంబై)

మార్చి 22 - ఫైనల్

రాత్రి 7 గంటలకు ప్రారంభం..

రాత్రి 7 గంటలకు ప్రారంభం..

అన్ని మ్యాచ్‌లు రాత్రి 7 గంటలకు ప్రారంభం కానున్నాయి. కలర్స్, సిన్‌ప్లాక్స్, కలర్స్ కన్నడ, సినిమా చానెల్స్‌లో ప్రత్యక్ష ప్రసారంకానున్నాయి. వూట్, జియో డిజిటల్ పార్టనర్స్‌గా వ్యవహరించనున్నాయి.

బుక్‌మై షోలో టికెట్లు..

బుక్‌మై షోలో టికెట్లు..

ఈ టోర్నీకి సంబంధించిన మ్యాచ్ టికెట్లు బుక్‌మైషోలో లభిస్తాయి. శుక్రవారం (ఫిబ్రవరి) సాయంత్రం 6 గంటలనుంచి టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. టికెట్ ధరలు రూ.50 నుంచి రూ. 500 వరుకు ఉన్నాయి. ఈ డబ్బులను రోడ్ సేఫ్టీ అవగాహన కల్పించడానికే వాడనున్నారు.

Story first published: Friday, February 14, 2020, 17:06 [IST]
Other articles published on Feb 14, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X