న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నా దూకుడు ప్రేక్షకులను అలరిస్తుందంటే సంతోషిస్తా: రిషభ్ పంత్

Rishabh Pant says I’m Happy If The Crowd Is Entertained By My Brand Of Cricket

అహ్మదాబాద్: తన దూకుడైన ఆటతీరు ప్రేక్షకులను అలరిస్తుందంటే చాలా సంతోషిస్తానని టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ తెలిపాడు. జట్టును విజయాల బాటలో నడిపించేలా చేయడమే తన లక్ష్యమని, దాంతో అభిమానుల్ని రంజింపచేస్తే అదే ఆనందమన్నాడు. ఇంగ్లండ్‌తో మొతేరా మైదానం వేదికగా జరుగుతున్న ఆఖరి టెస్ట్‌లో రిషభ్ పంత్ (118 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్‌లతో 101) సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే. స్టార్ బ్యాట్స్‌మెన్ అంతా విఫలమైన వేళ.. వాషింగ్టన్ సుందర్‌తో కలిసి పంత్ అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. దాంతో భారత్ మ్యాచ్‌పై పట్టుబిగించింది.

 టీమ్ ప్లాన్‌కు తగ్గట్లే..

టీమ్ ప్లాన్‌కు తగ్గట్లే..

మ్యాచ్ అనంతరం తన మార్క్ ఇన్నింగ్స్‌పై స్పందించిన పంత్.. జట్టు ప్రణాళికలకు తగ్గట్లు ఆడానని తెలిపాడు. 'మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పడమే టీమ్ ప్లాన్. అదే నా మైండ్‌లో ఉండిపోయింది. పిచ్‌పై ఓ అంచనాకు వచ్చిన తర్వాత నా మార్క్ షాట్లు ఆడవచ్చని భావించాను. అయితే కొన్నిసార్లు బౌలర్‌ను కూడా గౌరవించాల్సిన అవసరం ఉంటుంది. మంచి బంతులకు సింగిల్ తీస్తూ.. చెడ్డ బంతులను బౌండరీలకు తరలించాలి. బంతిని చూస్తూ ఆడాను. అదే నా ఆటలోని ప్రత్యేకత.

206 టార్గెట్..

206 టార్గెట్..

ముందుగా 206 పరుగులు చేయడమే టీమ్ వ్యూహం. ఆ తర్వాత వీలైనన్ని పరుగులు చేసి ఆధిక్యంలో నిలవాలనుకున్నాం. జట్టు ప్రణాళికలకు తగ్గట్లే నడుచుకున్నాను. జేమ్స్ అండర్సన్ బౌలింగ్‌లో ఆడిన రివర్స్ స్వీప్ షాట్కు కొంచెం అదృష్టం కూడా తోడవ్వాలి. ముందు కొంచెం ప్రాక్టీస్ కూడా అవసరమే. చాలాసార్లు స్వేచ్ఛగా షాట్లు ఆడేందుకు అనుమతి లభిస్తుంది. అయితే నేను పరిస్థితులను గ్రహించి ముందుకు సాగాల్సి ఉంటుంది. జట్టును విజయాల బాటలో నడిపించేలా చేయడమే నా లక్ష్యం. దాంతో అభిమానుల్ని రంజింపచేస్తే అదే ఆనందం.'అని పంత్ చెప్పుకొచ్చాడు.

రివర్స్ స్వీప్ సూపర్..

రివర్స్ స్వీప్ సూపర్..

జేమ్స్ అండర్సన్ బౌలింగ్‌లో రిషభ్ పంత్ ఆడిన రివర్స్ స్వీప్ షాట్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. కొత్త బంతి అందుకోగానే బౌలింగ్‌కు వచ్చిన అండర్సన్‌పై పంత్ వరుస బౌండరీలతో విరుచుకుపడ్డాడు. చూడ ముచ్చటైన షాట్లతో అలరించాడు. ఇక అండర్సన్ వేసిన 83 ఓవర్ సెకండ్‌ బాల్ రివర్స్ స్వీప్ షాట్‌తో బౌండరీకి తరలించాడు. ఈ సూపర్ షాట్‌కు ఇంగ్లండ్ ఆటగాళ్లతో పాటు డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న భారత ఆటగాళ్లు, కామెంటేటర్లు సైతం ఫిదా అయ్యారు. ప్రస్తుతం ఈ షాట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

పట్టు బిగించిన భారత్‌

పట్టు బిగించిన భారత్‌

రిషభ్ పంత్(118 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్‌లతో 101) ధనాధన్ సెంచరీకి వాషింగ్టన్ సుందర్(117 బంతుల్లో 8 ఫోర్లతో 60 బ్యాటింగ్) సూపర్ ఫిప్టీ తోడవ్వడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 94 ఓవర్లలో 7 వికెట్లకు 294 పరుగులు చేసింది. క్రీజులో సుందర్‌తో పాటు అక్షర్ పటేల్(11 బ్యాటింగ్) ఉన్నాడు. ఓ దశలో 146 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ జట్టును ఈ యువ ఆటగాళ్లు 113 పరుగుల భాగస్వామ్యంతో గట్టెక్కించారు. ప్రస్తుతానికి భారత్ 89 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇంగ్లండ్ బౌలర్లలో జేమ్స్ అండర్సన్(3/40) మూడు, బెన్ స్టోక్స్(2/73), జాక్ లీచ్ (2/66) రెండేసి వికెట్లు తీశారు.

Story first published: Friday, March 5, 2021, 20:20 [IST]
Other articles published on Mar 5, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X