|
క్యాచ్ డ్రాప్ లేదా అంపైర్ కాల్స్..
ఈ సీజన్‌లో సిరాజ్ వేయక వేయక ఒక్క బంతి మంచిగా వేస్తే అది కాస్త క్యాచ్ డ్రాపవ్వడం లేకపోతే అంపైర్ కాల్స్‌గా వెళ్లడమో జరుగుతుంది. మిగిలిన బంతులన్నిటినీ అతను ఏ మాత్రం దిమాక్ లేకుండా బౌలింగ్ చేస్తున్నాడని నెటిజన్లు మండిపడుతున్నారు. ఇప్పటి వరకు 13 మ్యాచ్‌లు ఆడిన సిరాజ్ కేవలం 8 వికెట్లు మాత్రమే తీసాడు. అంతేకాకుంగా ధారళంగా పరుగులు సమర్పించుకున్నాడు. అతని ఎకానమీ 9.44గా ఉంది. గత సీజన్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చడంతో ఆర్‌సీబీ అతన్నీ రిటైన్ చేసుకుంది.
|
ఉతికారేసిన బెయిర్ స్టో..
పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న తాజా మ్యాచ్‌లో సిరాజ్ 2 ఓవర్లలోనే 36 పరుగులిచ్చుకున్నాడు. సిరాజ్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో శిఖర్ ధావన్ బౌండరీ బాదగా.. బెయిర్ స్టో మరో భారీ సిక్సర్ బాది 13 పరుగులు పిండుకున్నాడు. ఇక అతను వేసిన 6వ ఓవర్‌లో బెయిర్ స్టో విశ్వరూపం చూపించాడు. తొలి బంతిని బౌండరీకి తరలించిన అతను.. మూడు, ఐదు, ఆరో బంతిని సిక్సర్లుగా బాది 23 పరుగులు పిండుకున్నాడు. ఈ ఓవర్‌లోనే బెయిర్ స్టో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
|
మరో శ్రీశాంత్‌లా..
ఈ ఓవర్ చూసిన అనంతరమే అభిమానులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. సిరాజ్ మరో శ్రీశాంత్‌లా మారాడని, అతని బౌలింగ్ మరీ నాసిరకంగా ఉందని విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ చెత్త ప్రదర్శనతో అతని కెరీర్ ప్రశ్నార్థకంగా మారిందని, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అతను మళ్లీ కనబడకపోవచ్చని కామెంట్ చేస్తున్నారు. సిరాజ్ బౌలింగ్ వైఫల్యం ఆర్‌సీబీకి తీవ్ర నష్టంగా మారిందంటున్నారు. మరికొందరు మాత్రం త్వరలోనే అతను కమ్ బ్యాక్ చేస్తాడని మద్దతిస్తున్నారు.