న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

గ్లేన్ మ్యాక్స్ వెల్ విధ్వంసం.. ఆస్ట్రేలియా ఘన విజయం.. ఆర్‌సీబీ ఆనందం!

RCB fans cant keep calm after Glenn Maxwell winning performance against new zealand
IPL 2021 : Glenn Maxwell Excited To Link Up With Virat Kohli, The “Pinnacle Of The Game” At RCB

వెల్లింగ్టన్‌: ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లేన్ మ్యాక్స్‌వెల్ చెలరేగాడు. న్యూజిలాండ్‌తో బుధవారం జరిగిన మూడో టీ20లో ఈ ఆసీస్ ఆల్‌రౌండర్ దుమ్ములేపాడు. 31 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లతో 70 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. మ్యాక్సీ విధ్వంసానికి అండగా ఇతర ఆటగాళ్లు కూడా రాణించడంతో ఈ మ్యాచ్‌లో ఆసీస్ 64 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 208 పరుగుల భారీ స్కోర్ చేసింది. మ్యాక్సీతో పాటు కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌(69), జోఫ్ ఫిలిప్‌(43) రాణించారు. కివీస్‌ బౌలర్లలో టీమ్ సౌథీ, ట్రెంట్ బౌల్ట్‌ చెరో వికెట్‌ తీయగా, ఇష్ సోధి రెండు వికెట్లు పడగొట్టాడు.

అనంతరం భారీ లక్ష్య చేధనకు దిగిన కివీస్‌ 17.1 ఓవర్లలో 144 పరుగులకే పరిమితమై ఘోర పరాజయాన్ని మూటగట్టకుంది. ఆష్టన్‌ అగర్‌ 6 వికెట్లతో చెలరేగగా, మెరెడిత్‌ రెండు, ఆడం జంపా, కేన్‌ రిచర్డ్‌సన్‌ చెరో వికెట్‌ తీశారు. ఈ విజయంతో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో ఆసీస్ ఖాతా తెరించింది. కివీస్ ఆధిక్యాన్ని 2-1కి తగ్గించింది.

ఆర్‌సీబీ సంతోషం..

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్) 2021 సీజన్ ముంగిట మ్యాక్స్‌వెల్ టచ్‌లోకి రావడం పట్ల టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ సారథ్యంలోని రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు సంతోషం వ్యక్తం చేసింది. గత సీజన్‌లో పంజాబ్ తరఫున దారుణంగా విఫలమైన మ్యాక్సీ.. ఈ సీజన్ మినీ వేలంలో ఆర్‌సీబీ రూ. 14.25 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా మ్యాచ్‌లో మాక్సీ ప్రదర్శనను కొనియాడుతూ ఆర్సీబీ ట్విటర్‌ వేదికగా ప్రశంసల జల్లు కురిపించింది. స్టన్నింగ్‌ పర్ఫామెన్స్‌తో చెలరేగి ఆస్ట్రేలియాకు అద్బుత విజయాన్నందించాడని కొనియాడింది.

మ్యాక్సీనా మజాకానా..

ఇక మ్యాక్సీ ప్రదర్శన పట్ల ఆర్సీబీ అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.'ఎవరన్నారు ఆర్సీబీ జట్టులో చేరితే ఆడరని.. ఈ యాక్షన్‌ ప్యాక్‌ మెరుపులు చూశారా? ఈసాల కప్‌ మనదే. ఆర్సీబీ ట్రోలర్స్‌కు‌ రెండు నిమిషాల పాటు మౌనం పాటించండి'అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఆర్‌సీబీ ఈ సీజన్ వేలంలో ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌(రూ. 14.25 కోట్లు), న్యూజిలాండ్‌ బౌలర్‌ కైల్‌ జేమిసన్‌(రూ. 15 కోట్లు)తో పాటు డేనియల్‌ క్రిస్టియన్‌‌లను భారీ ధరలకు కొనుగోలు చేసింది. కెఎస్‌ భరత్‌, సచిన్‌ బేబి, రజత్‌ పాటిధార్‌, మహ్మద్‌ అజారుద్దీన్‌, సుయేశ్‌ ప్రభుదేశాయ్‌ వంటి దేశీయ ఆటగాళ్లను సొంతం చేసుకుంది.

ఆర్‌సీబీ X ముంబై..

ఆర్‌సీబీ X ముంబై..

ఈ మ్యాచ్‌లోనే న్యూజిలాండ్ ఆటగాడు జిమ్మీ నీషమ్ దారుణంగా విఫలమయ్యాడు. 4 ఓవర్లలో 60 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు. అంతేకాకుండా బ్యాటింగ్‌లోనూ డకౌట్‌గా వెనుదిరిగాడు. దాంతో ముంబై ఇండియన్స్‌- ఆర్సీబీ ఫ్యాన్స్‌ మధ్య సోషల్‌ మీడియా వార్‌కు తెరతీసింది. మాక్సీ రెచ్చిపోయిన చోట నీషమ్‌ చతికిలబడ్డాడంటూ ట్రోల్‌ చేస్తున్నారు. ఇందుకు ముంబై అభిమానులు కూడా ఘాటుగానే బదులిస్తున్నారు. ఏదేమైనా కివీస్‌- ఆసీస్‌ మ్యాచ్‌పై దృష్టి సారించిన ఐపీఎల్‌ ఫ్యాన్స్‌ ఎవరికి తోచిన విధంగా వారు కామెంట్లు చేస్తున్నారు. ఇక జిమ్మీ నీషమ్‌ను ముంబై ఇండియన్స్ పంజాబ్‌ నుంచి ట్రేడ్ చేసుకున్న విషయం తెలిసిందే.

Story first published: Wednesday, March 3, 2021, 19:25 [IST]
Other articles published on Mar 3, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X