న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నేను ఇంట్లోనే ఉంటూ కరోనాపై యుద్ధం చేస్తున్నా.. మరి మీరు?: స్టార్ క్రికెటర్

Ravindra Jadeja shows off his ‘sword celebration’, requests everyone to stay at home

గుజరాత్: కరోనా వైరస్ మహమ్మారి కారణంగా క్రీడాలోకం స్తంభించిపోయిన విషయం తెలిసిందే. క్రికెట్ టోర్నీలన్నీ నిలిచిపోవడంతో క్రికెటర్లంతా ఇళ్లల్లోనే గడుపుతున్నారు. ఈ విశ్రాంతి సమయాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఆస్వాదిస్తున్నారు. అలానే సోషల్ మీడియాలో కాలక్షేపం చేస్తున్నారు. ఇక కొందరు క్రికెటర్లు ఇన్‌స్టాగ్రామ్‌ సెషన్స్‌లో పాల్గొంటూ తమ అనుభవాలను పంచుకుంటుంటుండగా.. మరికొందరు కరోనాపై ప్రజలకు సూచనలు ఇస్తున్నారు. తాజాగా టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా కరోనాపై సూచనలు ఇచ్చాడు.

ఎవరూ బయటకు వెళ్లకండి:

భారత జెర్సీలో దర్శనమిచ్చిన రవీంద్ర జడేజా.. బ్యాట్‌ పట్టుకుని తన ఇంటి పెరటిలోనే ప్రాక్టీస్‌ చేస్తున్న ఓ వీడియోను ట్విట్టర్ ఖాతాలో షేర్‌ చేశాడు. 'కరోనా మహమ్మారితో జరుగుతున్న యుద్ధంలో గెలవాలంటే ఇంకా సుదీర్ఘ దూరం ప్రయాణించాల్సి ఉంది. లాక్‌డౌన్‌ నియమాల్ని పాటిస్తూ ఇంట్లోనే ఉంటున్నా. మన ప్రాణాల్ని కాపాడుకోవడానికి ఇంట్లో ఉండటమే ఉత్తమం. ఇప్పటికీ కరోనాతో యుద్ధం ముగిసిపోలేదు. మన వంతు బాధ్యతగా ఇంట్లోనే ఉండాలి. ఎవరూ బయటకు వెళ్లొద్దు' అని కాప్షన్ ఇచ్చాడు. ఇక వీడియోలో బ్యాట్‌తో కత్తిసాము చేసి.. నేను ఇంట్లోనే ఉంటూ కరోనాపై యుద్ధం చేస్తున్నా.. మరి మీరు? అని ప్రశ్నించాడు.

జడేజానే బెస్ట్‌ ఫీల్డర్:

జడేజానే బెస్ట్‌ ఫీల్డర్:

ఈ దశాబ్దంలో రవీంద్ర జడేజానే బెస్ట్‌ ఫీల్డర్‌. బ్యాట్స్‌మన్‌, బౌలర్‌గానే కాకుండా ఫీల్డర్‌గా కూడా తనదైన ముద్ర వేశాడు. ఇప్పటికే ఎందరో మాజీలు కూడా జడేజానే బెస్ట్ ఫీల్డర్ అని ఒప్పుకున్నారు. తాజాగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా జడేజానే బెస్ట్ ఫీల్డర్ అని కితాబిచ్చాడు. తాజాగా ఓ ఛానెల్ కోహ్లీ, జడేజాలలో ఎవరు బెస్ట్ ఫీల్డరంటూ ట్వీట్ చేసింది. దీనికి కోహ్లీ మాత్రం నిజాయితీగా సమాధానం చెప్పాడు. 'కచ్చితంగా జడేజానే. అందులో సందేహం లేదు. అతడే బెస్ట్' అంటూ రిప్లే ఇచ్చాడు. దీనిపై స్పందించిన ఆ చానల్ కూడా కోహ్లీ నిజాయితీని ప్రశంశిస్తూ రీట్వీట్ చేసింది.

రనౌట్‌ అవకండి:

రనౌట్‌ అవకండి:

కరోనాపై అవగాహన కల్పించడానికి జడేజా గతంలోనూ వినూత్న పద్ధతిని ఎంచుకున్నాడు. గతేడాది భారత్-ఆస్ట్రేలియా జట్లు తలపడిన ఓ మ్యాచ్‌లో జడేజా ఆసీస్‌ బ్యాట్స్‌మన్‌ ఉస్మాన్‌ ఖవాజాను ఔట్‌ చేశాడు. ఖవాజా త్వరగా సింగిల్‌ తీసేందుకు యత్నించగా.. అక్కడే ఉన్న జడేజా ఆ బంతిని అందుకొని నేరుగా నాన్‌స్ట్రైకర్‌ ఎండ్‌లో వికెట్లకు విసిరాడు. దీంతో ఆసీస్‌ బ్యాట్స్‌మన్‌ రనౌటయ్యాడు. ఆ వీడియోను పోస్టు చేసిన జడేజా.. 'జాగ్రత్తగా ఉండండి, ఇళ్లలోనే ఉండండి, రనౌట్‌ అవకండి' అని సరికొత్తగా హెచ్చరించాడు.

ఎటువంటి ముందడుగు లేదు:

ఎటువంటి ముందడుగు లేదు:

కరోనా వైరస్ సంక్షోభం తర్వాత ఇంగ్లండ్ దేశంలో క్రికెట్‌ టోర్నీలు తిరిగి ఆరంభించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే భారత్‌లో మాత్రం బీసీసీఐ ఇంకా ఎటువంటి ముందడుగు వేయలేదు. ఇప‍్పటికే భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 80వేల దాటగా.. 2600 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో బీసీసీఐకి ఏం చేయాలో అర్ధం కావడం లేదు. మరోవైపు భారత్‌లో పరిస్థితులపై ఇంకా ఆందోళనగానే ఉంది. రోజూ కేసులు పెరుగుతూ ఉండటంతో ఐపీఎల్ 2020పై కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు.

Story first published: Friday, May 15, 2020, 19:49 [IST]
Other articles published on May 15, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X