న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టిమ్‌ పైన్.. గబ్బాలో మా దెబ్బ ఎలా ఉంది? క్లీన్ స్వీప్ అన్న దిగ్గజాలు మీరేమంటారు.. అశ్విన్ సెటైర్స్!

Ravichandran Ashwin takes a sly dig at Tim Paine and former Australia cricketers
Ind vs Aus 4th Test : History At Gabba,India Defeat Australia By 3 Wickets,Win Series 2-1

బ్రిస్బేన్: ఓటమి బాధలో ఉన్న ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్‌‌ను టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ట్రోల్ చేశాడు. గబ్బాలో భారత్ ఘనవిజయాన్ని ప్రస్తావిస్తూ పైన్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఆఖరి మ్యాచ్‌లో అశ్విన్ ఆడకపోయినా.. సిడ్నీ టెస్ట్‌లో అసాధారణ పోరాటం చేశాడు. హనుమ విహారితో కలిసి ఆసీస్ భీకర బౌలింగ్‌కు ఎదురొడ్డి నిలిచాడు. ఓవైపు వెన్ను నొప్పి ఇబ్బంది పెడుతున్నా.. జట్టు కోసం నిలబడ్డాడు. ఈ క్రమంలో అశ్విన్‌పై పైన్ నోరుపారేసుకున్నాడు. భారత ఆటగాళ్ల ఆటను ఓర్వలేక స్లెడ్జింగ్‌కు దిగాడు. 'నిన్ను గబ్బాలో ఎదుర్కొవడానికి ఎంతో ఆసక్తిగా ఉన్నా.. అశ్విన్'అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు.

గబ్బాలో భారత్ దెబ్బ..

వీటికి అశ్విన్ కూడా తనదైన శైలిలో 'మేము కూడా మిమ్మల్ని భారత్​లో కలుసుకునేందుకు ఆసక్తిగా ఉన్నాం. బహుశా నీకు అదే చివరి సిరీస్​ కావొచ్చు.'అని బదులిచ్చాడు. ఈ స్లెడ్జింగ్‌ను మనసులో పెట్టుకున్న అశ్విన్.. తాజా విజయానంతరం పైన్‌ పేరు ప్రస్తావించకుండానే చురకలంటించాడు. 'గుడ్ ఈవ్‌నింగ్ గబ్బా!! ఈ మైదానం నేను ఆడలేకపోయాను క్షమించండి. కఠినమైన సమయంలో మాకు ఆతిథ్యం ఇచ్చినందుకు, గట్టి పోటీ ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ సిరీస్‌ను ఎప్పటికీ మరిచిపోలేం'అని ట్వీట్ చేశాడు.

దిగ్గజాలను వదల్లేదు..

అంతటితో ఆగకుండా తమ జట్టును తక్కువ అంచనా వేసిన ఆస్ట్రేలియా మాజీ ఆటగాళ్లను అశ్విన్ ఎత్తిపొడిచాడు. అడిలైడ్‌లో 36 పరుగులకే పరిమితమై ఘోర పరాజయం చవిచూసిన తర్వాత, కోహ్లీ గైర్హాజరీలోని భారత జట్టు 4-0తో క్లీన్ స్వీప్‌కు గురవుతుందని ఆసీస్ దిగ్గజ క్రికెటర్లు రికీపాంటింగ్, మార్క్ వా, మైఖెల్ క్లార్క్, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ అన్నారు. అయితే సిరీస్ విజయానంతరం ఈ వ్యాఖ్యలకు సంబంధించిన పేపర్ క్లిప్‌ను పంచుకున్న అశ్విన్.. ఇప్పుడేం చెబుతారు దిగ్గజాలంటూ నిలదీశాడు.

ఓవైపు ట్రోఫీ అందుకున్న భారత్ జట్టును.. మరోవైపు ఆసీస్ దిగ్గజాల వ్యాఖ్యలను ఉంచిన అశ్విన్.. సింపులుగా ఎల్‌హెచ్ఎస్ నాట్ ఈక్వెల్ టూ ఆర్‌హెచ్‌ఎస్ అని మ్యాథ్స్ తరహాలో వ్యంగ్యస్త్రాలు సంధించాడు. గత నాలుగు వారాలుగా తమకు దక్కిన మద్దతుకు ధన్యవాదాలు తెలిపాడు. ప్రస్తుతం ఈ ట్వీట్లు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.

చిరస్మరణీయ విజయం..

చిరస్మరణీయ విజయం..

ఆతిథ్య జట్టు నిర్థేశించిన 328 పరుగుల విజయ లక్ష్యాన్ని అనూహ్య రీతిలో ఛేదించింది. రిషభ్‌ పంత్‌(89 నాటౌట్), శుభ్‌మన్ గిల్(91) దూకుడు కనబర్చగా.. పుజారా(56) తనదైన డిఫెన్స్‌తో మెరిసాడు. ఫలితంగా నాలుగు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ను భారత్‌ 2-1తో కైవసం చేసుకుని గబ్బా చరిత్రను తిరగరాసింది. ఈ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 369 పరుగుల భారీ స్కోర్ చేయగా.. భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 336 పరుగులే చేసింది. 186 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును శార్దూల్ ఠాకూర్(67), వాషింగ్టన్ సుందర్(62) అద్వితీయ బ్యాటింగ్‌తో ఆదుకున్నారు. ఏడో వికెట్‌కు 123 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత్‌ను పోటీలో నిలిపారు.

అనంతరం ఆసీస్... మహ్మద్ సిరాజ్(5/73), శార్దూల్(4/61) ధాటికి రెండో ఇన్నింగ్స్‌లో 294 పరుగులే చేసింది. ఫస్ట్ ఇన్నింగ్స్ 33 పరుగుల లీడ్ అందుకొని భారత్ ముందు 328 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఈ టఫ్ టార్గెట్‌ను భారత్.. శుభ్‌మన్, పంత్ పుణ్యామా ఆడుతూ పాడుతూ ఏడు వికెట్లు కోల్పోయి చేధించింది.

Story first published: Tuesday, January 19, 2021, 15:58 [IST]
Other articles published on Jan 19, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X