న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పుజారా.. నువ్వు ఆ షాట్ ఆడితే సగం మీసం తీసేస్తా: అశ్విన్

Ravichandran Ashwin Says He Will Shave Half His Moustache If Cheteshwar Pujara Completes This Challenge
#Ashwin Ready To Shave Half Moustache If #Pujara Goes Over The Top Against Any England Spinner

చెన్నై: టీమిండియా నయావాల్ చతేశ్వర్ పుజారాకు అతని సహచర ఆటగాడు, టాప్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఓ సవాల్ విసిరాడు. త్వరలో ఇంగ్లండ్‌తో జరగబోయే టెస్ట్ సిరీస్‌లో మొయిన్‌ అలీతో పాటు మరే స్పిన్నర్‌ బౌలింగ్‌లోనైనా పుజారా పిచ్‌పై ముందుకు దూసుకొచ్చి బౌలర్‌ తల మీదుగా భారీ షాట్‌ ఆడితే తాను సగం మీసం తీసేస్తానని... అలాగే మైదానంలోకి అడుగుపెడతానని తెలిపాడు. తన యూట్యూబ్‌ ఛానల్‌ వేదికగా టీమిండియా బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాథోడ్‌తో జరిగిన చిట్‌చాట్ సందర్భంగా అశ్విన్‌ ఈ సవాల్ విసిరాడు. ఆసీస్ పర్యటనలో టాప్‌ బ్యాట్స్‌మన్‌ స్మిత్‌ను అవుట్‌ చేసే విషయంలో తన ఆలోచనల గురించి చెప్పిన అశ్విన్‌... పనిలో పనిగా ఇతర స్పిన్నర్లతో తనను పోల్చడంపై ఘాటుగా స్పందించాడు.

అర మీసంతో ఆడతా!

అర మీసంతో ఆడతా!

ఒక ఆఫ్‌ స్పిన్నర్‌పై పుజారా ఎదురుదాడి చేయడాన్ని మనమెప్పుడైనా చూడగలమా? అని విక్రమ్ రాథోడ్‌ను అశ్విన్‌ ప్రశ్నించగా.. ఈ విషయంలో తాను పుజారాను ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నానని, అతని పైపు నుంచి స్పందన మాత్రం లేదని బ్యాటింగ్ కోచ్ చమత్కరించాడు. ఆ వెంటనే అశ్విన్‌ స్పందిస్తూ.. రాబోయే ఇంగ్లండ్‌ పర్యటనలో మొయిన్‌ అలీ లేదా వేరెవరైనా స్పిన్నర్‌ బౌలింగ్‌లో పుజారా ముందుకు వచ్చి బౌలర్‌ తల మీదుగా భారీ షాట్‌ ఆడితే తాను సగం మీసంతో బరిలోకి దిగుతానని నవ్వుతూ సవాల్ విసిరాడు. అయితే ఈ విషయాన్ని పుజారా అంత సీరియస్‌గా తీసుకుంటాడని తాను అనుకోవడంలేదని రాథోడ్ బదులిచ్చాడు.

స్మిత్‌ను అలా ఔట్ చేశా..

స్మిత్‌ను అలా ఔట్ చేశా..

'ఒక మ్యాచ్‌కు ముందు నేను సొంతంగా హోమ్‌ వర్క్‌ చేసుకుంటాను. ఎనిమిది గంటల పాటు ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ వీడియోలు చూస్తాను. ఆపై మ్యాచ్‌లో ఎక్కడ, ఎలాంటి ఫీల్డింగ్‌ ఉండాలో నిర్ణయించుకుంటా. టిమ్‌ పైన్‌ను మెల్‌బోర్న్‌లో అలాగే అవుట్‌ చేశా. స్మిత్‌ను ఎవరు ఔట్‌ చేస్తారనే దానిపై బాగా చర్చ జరిగింది. ఎవరూ నా గురించి మాట్లాడనే లేదు. ఆసీస్‌ గడ్డపై స్మిత్‌ ఎప్పుడూ స్పిన్నర్ల బౌలింగ్‌లో ఔట్‌ కాలేదు. నేను దానిని మార్చాలనుకున్నా. ప్రపంచంలో నన్ను నేను అత్యుత్తమ బౌలర్‌గా భావించుకుంటా. అలాగే అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌ను ఔట్ చేయాలని కోరుకుంటా. కోహ్లీతో తలపడలేను కాబట్టి స్మిత్‌తో తలపడ్డా. ఇప్పుడు ఈ సిరీస్‌ తర్వాత అందరూ నా గురించి మాట్లాడుకునేలా చేశా' అని అశ్విన్‌ వ్యాఖ్యానించాడు.

చాలా బాధించింది..

చాలా బాధించింది..

లయన్, అలీలతో పోలుస్తూ తనను మరీ 'మైక్రోస్కోప్‌' కింద ఉంచి పరీక్షించారని అశ్విన్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. గత ఆస్ట్రేలియా సిరీస్‌లో అశ్విన్‌కంటే లయన్‌ ప్రదర్శన బాగుండగా... 2018 సౌతాంప్టన్‌ టెస్టులో అలీ వికెట్లు తీసిన చోట అశ్విన్‌ విఫలం కావడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. 'లయన్‌గానీ అలీగానీ సరిగ్గా ఆఫ్‌ స్టంప్‌ బయట బంతులు వేస్తున్నప్పుడు కామెంటరీ బాక్స్‌ నుంచి వార్న్‌ వాటిని అద్భుతంగా వర్ణించినంత మాత్రాన నేను అలాగే బౌలింగ్‌ చేయాలని ఏమీ లేదు. గత సిరీస్‌లో అడిలైడ్‌లో నా పొత్తికడుపులో గాయమైనా సరే పట్టుదలగా ఆడి ఆరు వికెట్లు తీశాను. కానీ మ్యాచ్‌ ముగిశాక నాకంటే లయన్‌ ఎంత బాగా బౌలింగ్‌ చేశాడో అందరూ చెప్పుకున్నారు. ఇంత నిర్దాక్షిణ్యంగా మాట్లాడటం నన్ను చాలా బాధించింది. లయన్‌ మంచి బౌలరే. అతనంటే నాకు గౌరవం ఉంది. కానీ నా ఆలోచనలు వేరు. ఇకపై లయన్‌తో పోటీ పడటంకంటే స్మిత్‌తో తలపడటం ముఖ్యమని అర్థం చేసుకున్నా'అని అశ్విన్‌ వివరించాడు.

అందుకే ఆఖరి టెస్ట్ ఆడలేదు..

అందుకే ఆఖరి టెస్ట్ ఆడలేదు..

తాను నాలుగో టెస్టుకు దూరం అవడానికి బ్రిస్బేన్‌లో విధించిన నిబంధనలే కారణమని అశ్విన్ తెలిపాడు. తమ జట్టును పూల్ వద్దకు వెళ్లనివ్వలేదని, గాయాల నుంచి కోలుకునే సమయంలో పూల్ చాలా ముఖ్యమైన సాధనమని అశ్విన్ చెప్పాడు. ఈ కారణంగానే తాను నాలుగో టెస్టుకు ఫిట్‌నెస్ సాధించలేక పోయినట్లు అతను చెప్పాడు. తమ జట్టు ఫిజియో కూడా.. గాయాల నుంచి కోలుకునే ప్రక్రియ మొదలైతే.. నాలుగో టెస్టు ఆడేందుకు చాలా అవకాశాలు ఉన్నాయని తనకు చెప్పినట్లు అశ్విన్ వెల్లడించాడు. కానీ పూల్ వంటి సదుపాయాలకు దూరంగా ఉండటంతో తాను ఫిట్‌నెస్ సాధించలేక పోయానని చెప్పాడు.

శ్రీలంకపై క్లీన్ స్వీప్.. ఇంగ్లండ్ అరుదైన ఘనత.. క్రికెట్ చరిత్రలోనే తొలిసారి!

Story first published: Tuesday, January 26, 2021, 10:12 [IST]
Other articles published on Jan 26, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X