
చెలరేగిన స్పిన్నర్లు..
అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంకను ఇంగ్లండ్ స్పిన్నర్లు డామ్ బెస్ (4/49), జాక్ లీచ్ (4/59), జో రూట్ (2/0) దెబ్బతీశారు. ఈ ముగ్గురి ధాటికి లంక 35.5 ఓవర్లలో 126 పరుగులకే ఆలౌటైంది. శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు ఇంగ్లండ్ పేసర్లు తీయగా... రెండో ఇన్నింగ్స్‌లోని 10 వికెట్లను స్పిన్నర్లు తీయడం విశేషం. అజేయశతంకంతో రాణించిన ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్‌కు 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్'తో పాటు 'ప్లేయర్ ఆఫ్ ద సిరీస్'అవార్డులు లభించాయి.

వరుసగా ఆరో విజయం..
ఇక శ్రీలంక గడ్డపై ఇంగ్లండ్‌కు ఇది వరుసగా ఆరో టెస్టు విజయం కావడం విశేషం. విదేశీ గడ్డపై ఆతిథ్య జట్టుపై ఇంగ్లండ్ వరుసగా ఆరు టెస్టుల్లో గెలుపొందడం ఇదే ప్రథమం. శ్రీలంకలో 2012లో ఒక టెస్టు నెగ్గిన ఇంగ్లండ్... 2018 పర్యటనలో ఆడిన మూడు టెస్టుల్లోనూ గెలిచింది. తాజా పర్యటనలో ఆడిన రెండు టెస్టుల్లోనూ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ గెలుపుతో 4 రేటింగ్ పాయింట్లు సాధించిన ఇంగ్లండ్.. ప్రస్తుతం 108 పాయింట్లతో ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానంలో ఉంది. న్యూజిలాండ్(118.44) టాప్‌లో ఉండగా.. భారత్(117.65), ఆస్ట్రేలియా (113) తర్వాత ర్యాంకుల్లో ఉన్నాయి.

క్రికెట్ చరిత్రలోనే..
ఈ సిరీస్ విజయంతో ఇంగ్లండ్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. టెస్ట్‌ల్లో ఒక ఇన్నింగ్స్‌లో పేస్‌తో 10 వికెట్లు, మరో ఇన్నింగ్స్‌లో స్పిన్‌తో 10 వికెట్లు తీసిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది. ఇప్పటి వరకు ఈ ఘనతను ఏ టీమ్ అందుకోలేదు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో పేసర్లు అండర్సన్ 6 , మార్క్ వుడ్ 3 వికెట్లు తీయగా.. సామ్ కరన్‌కు ఓ వికెట్ దక్కింది. రెండో ఇన్నింగ్స్‌లో స్పిన్నర్లు డామ్ బెస్(4), లీచ్(4), రూట్(2) వికెట్లు తీశారు.

27న భారత్‌కు
ఈ నెల 27న భారత్ గడ్డపై అడుగుపెట్టనున్న ఇంగ్లండ్ టీమ్.. ఆరు రోజుల క్వారంటైన్ తర్వాత ఫిబ్రవరి 5 నుంచి వరుసగా నాలుగు టెస్టులు, ఐదు టీ20లు, మూడు వన్డేలను ఆడనుంది. 52 రోజుల ఈ పర్యటనను బయో- సెక్యూర్ బబుల్ వాతావరణంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్వహించనుంది. క్వారంటైన్, తొలి టెస్టుకు మధ్య కేవలం మూడు రోజులు మాత్రమే ఇంగ్లండ్ టీమ్ ప్రాక్టీస్ చేయనుంది. ఇప్పటికే బెన్ స్టోక్స్, ఆర్చర్, రోరీ బర్న్స్ భారత్‌కు వచ్చారు.


Click it and Unblock the Notifications












