న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రవిచంద్రన్ అశ్విన్ రిక్వెస్ట్‌తో ఆజాజ్ పటేల్ ట్విటర్ అకౌంట్‌కు బ్లూ టిక్!

 Ravichandran Ashwin Helped Ajaz Patel Get A Blue Tick On Twitter

ముంబై: టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ విజ్ఞప్తి చేయడంతో న్యూజిలాండ్ స్పిన్ సెన్సేషన్ ఆజాజ్ పటేల్ ట్విటర్ ఖాతాకు అధికారిక బ్లూ టిక్ వచ్చింది. భారత్‌తో జరిగిన రెండు టెస్ట్‌ల సిరీస్‌లో ఆజాజ్ పటేల్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. ముఖ్యంగా ముంబై వేదికగా జరిగిన రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా పది వికెట్లు పడగొట్టి ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. దాంతో ఆజాజ్ పటేల్‌పై సర్వత్రా ప్రశంసల జల్లు కురిసింది. అశ్విన్ సైతం ఆజాజ్ ప్రదర్శనను కొనియాడాడు. బౌలర్లంతా కలలు కనే రికార్డు సాధించాడన్నాడు.

అశ్విన్ రిక్వెస్ట్‌తో..

అయితే ఆజాజ్ పటేల్ ట్విటర్ ఖాతాకు వెరిఫైడ్ బ్లూ టిక్ లేదు. దాంతో అది అతని ఖాతానేనా? అని అభిమానులు, మాజీ క్రికెటర్లు అనుమానపడ్డారు. ఇక ఈ విషయం తెలుసుకున్న అశ్విన్.. ట్విటర్‌కు స్పెషల్ రిక్వెస్ట్ పెట్టాడు. 10 వికెట్ల ఘనత సాధించిన ఆజాజ్ పటేల్‌కు బ్లూ టిక్ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నాడు. 'డియర్ ట్విటర్ వెరిఫైడ్. ఇన్నింగ్స్​లో 10 వికెట్ల ఘనత సాధించిన ఆజాజ్ పటేల్ ఖాతా వెరిఫై కావాల్సిన అవసరం ఉంది'అంటూ వారికి ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ చేసిన కొన్ని గంటల్లోనే ఆజాజ్ ఖాతా వెరిఫైడ్ అయింది. ట్విటర్ ఆజాజ్ ఖాతాకు బ్లూ టిక్ ఇచ్చింది. దీనిపై స్పందించిన అశ్విన్.. ట్విటర్​కు కృతజ్ఞతలు తెలిపాడు.

22 ఏళ్ల తర్వాత..

22 ఏళ్ల తర్వాత..

ఈ మ్యాచ్‌లో కివీస్‌ స్పిన్నర్‌ అజాజ్‌ 225 పరుగులిచ్చి 14 వికెట్లు పడగొట్టాడు. ఇక ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. ఆజాజ్‌కు ముందు భారత్ దిగ్గజం అనిల్ కుంబ్లే, ఇంగ్లండ్ లెజెండ్ జిమ్ లేకర్ ఈ ఘనత సాధించారు. 1956లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో జిమ్ లేకర్ ఒకే ఇన్నింగ్స్‌లో 53 పరుగులు ఇచ్చి 10 వికెట్లు తీసి ఈ ఘనతను అందుకున్న తొలి బౌలర్‌గా నిలిచాడు. ఆ తర్వాత మరో 43 ఏళ్లకు అనిల్ కుంబ్లే 1999లో పాకిస్థాన్‌పై ఒకే ఇన్నింగ్స్‌లో 74 పరుగులిచ్చి 10 వికెట్లు పడగొట్టాడు. కుంబ్లే తర్వాత మళ్లీ 22 ఏళ్లకు ఆజాజ్ పటేల్ ఈ అరుదైన ఫీట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. చివరి వికెట్‌గా మహమ్మద్ సిరాజ్‌ను ఖాతాలో వేసుకొని ఆజాజ్ పటేల్ ఈ వరల్డ్ రికార్డు అందుకున్నాడు.

కాగా, ఓ టెస్టు మ్యాచ్‌లో భారత్‌పై అత్యుత్తమ ప్రదర్శన చేసిన బౌలర్‌గానూ అతడు నిలిచాడు. కివీస్‌ తరపున టెస్టుల్లో అతడికిది రెండో అత్యుత్తమ ప్రదర్శన. రిచర్డ్‌ హ్యాడ్లీ (1985లో ఆస్ట్రేలియాపై 15/123) అగ్రస్థానంలో ఉన్నాడు.

అశ్విన్ స్పెషల్ గిఫ్ట్..

అశ్విన్ స్పెషల్ గిఫ్ట్..

వరల్డ్ రికార్డు అందుకున్న అజాజ్‌ పటేల్‌కు అశ్విన్‌ ప్రత్యేక కానుక అందించాడు. మ్యాచ్‌ ముగిశాక భారత జట్టు ఆటగాళ్ల సంతకాలతో కూడిన తన జెర్సీని అతనికిచ్చాడు. 'డ్రెస్సింగ్‌ గది నుంచి అజాజ్‌ పటేల్ బౌలింగ్‌ను ఎంతో ఆస్వాదించా. నా సహచరులు సంతకాలు చేసిన జెర్సీని నేనే అందుకుంటానేమో అనుకున్నా'అని అశ్విన్‌ తెలిపాడు. 'జెర్సీ అందుకున్న ఆనందాన్ని చెప్పలేను. అసలు మాటలు రావడం లేదు'అని అజాజ్‌ సంతోషం వ్యక్తం చేశాడు. మరోవైపు ముంబై క్రికెట్‌ అసోసియేషన్ (ఎంసీఏ) అధ్యక్షుడు విజయ్‌ పాటిల్‌ కూడా ఆజాజ్‌ను సత్కరించాడు. త్వరలో ప్రారంభం కాబోయే ఎంసీఏ మ్యూజియానికి అజాజ్‌.. బంతిని, తన టీషర్ట్‌ను అందించాడు.

 భారత్ భారీ విజయం..

భారత్ భారీ విజయం..

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ను క్వీన్‌ స్వీప్‌ చేసిన టీమిండియా.. టెస్టు సిరీస్‌నూ కూడా చేజిక్కించుకుంది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-0తో నెగ్గింది. తొలి టెస్టులో విజయానికి వికెట్‌ దూరంలో ఆగిపోయిన భారత్‌.. రెండో టెస్టులో రికార్డు స్థాయిలో 372 పరుగుల భారీ తేడాతో నెగ్గి సిరీస్‌ను చేజిక్కించుకుంది. 540 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌.. రెండో ఇన్నింగ్స్‌లో 167 పరుగులకే కుప్పకూలింది. ఓవర్‌నైట్‌ స్కోరు 140/5తో నాలుగో రోజు, సోమవారం బ్యాటింగ్‌ కొనసాగించిన ఆ జట్టు కేవలం 27 పరుగుల తేడాలో మిగతా అయిదు వికెట్లు కోల్పోయింది. అందులో నాలుగు వికెట్లను జయంత్‌ యాదవ్‌ (4/34) సొంతం చేసుకోవడం విశేషం.

Story first published: Tuesday, December 7, 2021, 14:08 [IST]
Other articles published on Dec 7, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X