న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Ravichandran Ashwin: కోహ్లీది అభిప్రాయమే.. డిమాండ్ కాదు!

 Ravichandran Ashwin says Virat Kohli never ‘demanded’ best of three WTC final

లండన్: వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్.. బెస్టాఫ్ త్రీగా ఉండాలన్నది విరాట్ కోహ్లీ అభిప్రాయం మాత్రమేనని టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. ఫార్మాట్‌ను మార్చాలని అతను ఎప్పుడూ డిమాండ్ చేయలేదని స్పష్టం చేశాడు. న్యూజిలాండ్‌తో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో కోహ్లీసేన 8 వికెట్లతో చిత్తయిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన కోహ్లీ.. వరల్డ్ టెస్టు చాంపియన్‌ను నిర్ధారించేందుకు ఒక ఫైనల్‌ మ్యాచ్‌ సరిపోదని, బెస్టాఫ్‌ త్రీ ఫైనల్స్‌లోనే అత్యుత్తమ జట్టు ఏదో తేలుతుందన్నాడు. అయితే ఈ వ్యాఖ్యలను కొంతమంది విశ్లేషకులు తప్పుబట్టారు.

అడిగితేనే చెప్పిండు..

అడిగితేనే చెప్పిండు..

అయితే విరాట్‌ను విమర్శించడాన్ని సహించలేకపోయిన అశ్విన్.. తన యూట్యూబ్ చానెల్‌ వేదికగా అందరికీ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. కొంత మంది విశ్లేషకులు విరాట్ కోహ్లీ వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని విమర్శించాడు. 'బెస్టాఫ్ త్రీ ఉంటే బెస్ట్ టీమ్‌ను సెలెక్ట్ చేయవచ్చన్నది కోహ్లీ అభిప్రాయం. మూడు మ్యాచ్‌లు ఉండటం ద్వారా కండీషన్స్‌కు అలవాటు పడటంతో పాటు పుంజుకోవడానికి చాన్స్ ఉంటుందని చెప్పాడు. అంతేగానీ బెస్టాఫ్ త్రీ ఉండాలని అతను డిమాండ్ చేయలేదు. మెగా ఫైనల్ అనంతరం మాజీ ఇంగ్లండ్‌ ప్లేయర్‌ అథర్టన్‌ డబ్ల్యూటీసీ రసవత్తరంగా మారాలంటే ఏం చేయాలి? అని అడిగిన ప్రశ్నకు బదులుగానే కోహ్లీ తన అభిప్రాయం చెప్పాడు.'అని అశ్విన్‌ స్పష్టం చేశాడు.

 స్వచ్చమైన గాలి పీలుస్తున్నాం..

స్వచ్చమైన గాలి పీలుస్తున్నాం..

ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు ఇంకా టైమ్ ఉండటంతో ప్రస్తుతం టీమిండియా క్రికెటర్లకు బ్రేక్ ఇచ్చారు. ఇలాంటి బ్రేక్ ప్లేయర్లకు చాలా మంచిదని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. 'మేం చాలా రోజుల నుంచి బబుల్‌లోనే గడుపుతున్నాం. ఇప్పుడే కొద్దిగా బయటకు వచ్చి స్వచ్చమైన గాలి పీలుస్తున్నాం. ఇలాంటి బ్రేక్ మాకు చాలా అవసరం. ఎందుకంటే దీనివల్ల ప్లేయర్లందరూ మళ్లీ ఉత్సాహంగా తయరవుతారు. ఫలితంగా మంచి క్రికెట్ ఆడే చాన్స్ లభిస్తుంది'అని అశ్విన్ చెప్పుుకొచ్చాడు.

కివీస్ సంబరాలు తట్టుకోలేకపోయా..

కివీస్ సంబరాలు తట్టుకోలేకపోయా..

డబ్ల్యూటీసీ ఫైనల్ 2021 గెలిచిన అనంతరం న్యూజిలాండ్ ఆటగాళ్లు అర్ధ‌రాత్రి వ‌ర‌కూ సంబురాలు చేసుకున్నారని, అది చూసి తాను త‌ట్టుకోలేక‌పోయానని అశ్విన్ తెలిపాడు. 'మ్యాచ్‌ ముగిశాక శీతల పానీయాలు, ట్రోఫీతో కలిసి సంబరాలు చేసుకోవడం న్యూజిలాండ్‌ జట్టుకు అలవాటు. ఆ దృశ్యం చూడటానికి చాలా కష్టంగా అనిపించింది. కివీస్ ప్లేయర్స్ రాత్రి 12 వరకూ వేడుకలు చేసుకున్నారు. వారు ట్రోఫీ తీసుకొని పిచ్‌ వద్దకు వచ్చారు. నిజానికి వారి సంబరాలు నాకు యుద్ధ నినాదాల్లా అనిపించాయి. మేము ఆ ప‌ని చేయాలేక‌పోయామే అన్న బాధ నన్ను వెంటటింది. మేం ట్రోఫీ గెలవనందుకు చాలాచాలా నిరాశపడ్డా' అని చెప్పాడు.

 హయ్యెస్ట్ వికెట్ టేకర్..

హయ్యెస్ట్ వికెట్ టేకర్..

డబ్ల్యూటీసీ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ రవిచంద్రన్‌ అశ్వినే. యాష్ 14 మ్యాచ్‌ల్లో 71 వికెట్లు పడగొట్టాడు. ఫైనల్ మ్యాచ్ ద్వారా ఆసీస్ పేసర్ ప్యాట్‌ కమ్మిన్స్‌ను అధిగమించాడు. కమ్మిన్స్‌ 14 మ్యాచ్‌ల్లో 70 వికెట్లు తీసి రెండో స్థానంలో ఉన్నాడు. ఇంగ్లీష్ పేసర్ స్టువర్ట్‌ బ్రాడ్‌ 17 మ్యాచ్‌ల్లో 69, కివీస్ బౌలర్ టిమ్‌ సౌతీ 11 మ్యాచ్‌ల్లో 56, ఆసీస్ స్పిన్నర్ నాథన్‌ లయన్‌ 14 మ్యాచ్‌ల్లో 56 వికెట్లు తీసి తర్వాతి స్థానాల్లో వరుసగా ఉన్నారు.

Story first published: Saturday, July 3, 2021, 12:45 [IST]
Other articles published on Jul 3, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X