న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ ఒక్కటే బాధ కలిగించింది.. టీమిండియా కోచ్ రవిశాస్త్రి ఎమోషనల్

Ravi Shastri on KL Rahul being used as wicketkeeper in limited-overs

న్యూఢిల్లీ : ఆస్ట్రేలియా‌పై సిరీస్ గెలిచిన ఆనందంలో ఉన్న తమకు స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ గాయపడటం, న్యూజిలాండ్ టూర్‌కు దూరమవ్వడం తీవ్ర బాధను మిగిల్చిందని టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి తెలిపాడు. ఓ సీనియర్ ప్లేయర్ గాయంతో దూరమైతే ఆ ప్రభావం జట్టు మొత్తం మీద ఉంటుందని తెలిపాడు. కీలక న్యూజిలాండ్ టూర్‌కు బయలు దేరే ముందు పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రవిశాస్త్రి.. టీ20 వరల్డ్ కప్ వ్యూహాలతో పాటు పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఈ మెగా టోర్నీకి ముందు జరిగే న్యూజిలాండ్, సౌతాఫ్రికా వన్డే సిరీస్‌లు తమ ప్రణాళికలకుచక్కని వేదికలని తెలిపాడు.

జట్టుకు ఎంపికైన ఆనందంలో చెలరేగిన పృథ్వీ షా, శాంసన్... ఇండియా-ఎ విజయంజట్టుకు ఎంపికైన ఆనందంలో చెలరేగిన పృథ్వీ షా, శాంసన్... ఇండియా-ఎ విజయం

ప్రత్యర్థి.. పరిస్థితులతో అవసరం లేదు..

ప్రత్యర్థి.. పరిస్థితులతో అవసరం లేదు..

‘టాస్ విషయాన్ని మా వ్యూహాల నుంచి తొలగించాం. పరిస్థితులతో, ప్రత్యర్థితో సంబంధం లేకుండా ప్రపంచంలో ఎక్కడైనా ఆడుతాం. అదే మా లక్ష్యం కూడా. దానికోసమే మేం కష్టపడుతున్నాం. ఇక వరల్డ్‌కప్ గెలవడం ఒక్కటి తీరని ఆశగా మిగిలిపోయింది. దాన్ని కూడా త్వరలోనే ఫుల్‌ఫిల్ చేస్తాం. అదే మా గోల్.'అని శాస్త్రి చెప్పుకొచ్చాడు.

 నేను అనేది మా జట్టులో లేదు..

నేను అనేది మా జట్టులో లేదు..

ప్రతి ఒక్కరి విజయాన్ని జట్టుగా ఆస్వాదిస్తామని, సెలబ్రేట్ చేసుకుంటామని ఈ మాజీ కెప్టెన్ కమ్ కోచ్ తెలిపాడు. తమ జట్టులో నేను అనే పదానికే చోటులేదన్నాడు.

‘నేను అనే పదం మా జట్టు డిక్షనరీలోనే లేదు. మేమంతా ఒక్కటే. జట్టు కూడా అదే స్పూర్తితో ముందుకు నడుస్తోంది. ప్రతీ ఒక్కరి సక్సెస్‌ను అందరం సెలబ్రేట్ చేసుకుంటాం.'అని రవిశాస్త్రి తెలిపాడు.

మా మానసిక దృఢత్వం ఏంటో తెలిసింది..

మా మానసిక దృఢత్వం ఏంటో తెలిసింది..

వన్డే సిరీస్ విజయం టీ20ల్లో కూడా కొనసాగింపుగా ఉంటుందని హెడ్ ‌కోచ్ చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ విజయానంతరం భారత్ మానసిక బలం ఏంటో తెలిసిందన్నాడు.

‘మా మానసిక దృఢత్వానికి ఆస్ట్రేలియా సిరీస్ నిదర్శనం. వాంఖడే వన్డే ఓటమి తర్వాత తీవ్ర ఒత్తిడిలో ఉన్న భారత్ పుంజుకొని విజయాన్నందుకుంది. ఇది జట్టు సత్తాను తెలియజేస్తోంది. అలాగే మా నిర్భయమైన ఆటను చూపిస్తోంది.'అన్నాడు. గతంలో జరిగింది చరిత్రని, భవిష్యత్తులో కూడా దాన్నే పునరావృతం చేస్తామని 57 ఏళ్ల శాస్త్రి తెలిపాడు.

కీపర్‌గా రాహులే..

కీపర్‌గా రాహులే..

రాహుల్ వంటి మల్టీపుల్ టాలెంట్ ఉన్న ప్లేయర్లు జట్టుకు అవసరమని, కీపర్‌గా రాహుల్‌ను కొనసాగిస్తే అదనపు బ్యాట్స్‌మన్ తీసుకునే అవకాశం ఉంటుందన్న కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యాఖ్యలతో శాస్త్రి ఏకీభవించాడు. మల్టీపుల్ ఆప్షన్స్ ఉండటం జట్టుకు మంచేదనన్నాడు. అంతా బాగున్నా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ గాయంతో జట్టుకు దూరమవ్వం తీవ్ర నిరాశకు గురిచేసిందన్నాడు.

‘సీనియర్ ప్లేయర్ గాయపడటం బాధకరమైన విషయం. అతనో మ్యాచ్ విన్నర్. ఎవరైన గాయంతో జట్టుకు దూరమైతే జట్టులోని ప్రతీ ఒక్కరిని హర్ట్ చేస్తోంది.'అని శాస్త్రి తెలిపాడు.

న్యూజిలాండ్ టూర్‌ కేదార్ జాదవ్‌కు చివరి అవకాశమని జరుగుతున్న ప్రచారాన్ని రవిశాస్త్రి కొట్టిపారేశాడు. అతను ప్రతీ ఆటగాడిలా జట్టులో భాగమేనని, ఇతర ప్లేయర్లను చూసినట్లే అతన్ని ట్రీట్ చేస్తామన్నాడు. కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చహల్ కలిసి ఆడటం చాలా రోజులైందన్న ప్రశ్నకు జట్టుకు అవసరమైన తప్పక ఆడుతారని సమాధానమిచ్చాడు. ఇక పవర్ హిట్టర్ సూర్యకుమార్ యాదవ్‌ను జట్టులోకి తీసుకోవాలని వస్తున్న డిమాండ్‌పై స్పందించడానికి రవిశాస్త్రి నిరాకరించాడు. అది సెలెక్టర్ల బాధ్యతని తనకు సంబంధం లేదని తెలిపాడు.

జనవరి 24 నుంచి ప్రారంభమయ్యే న్యూజిలాండ్ టూర్‌లో కోహ్లీసే 5 టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్ట్‌లు ఆడనుంది. అనంతరం మార్చిలో సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ ఆడునుంది. కివీస్ టూర్‌ కోసం ఇప్పటికే కోహ్లీ సేన అక్కడికి చేరుకుంది.

Story first published: Wednesday, January 22, 2020, 14:22 [IST]
Other articles published on Jan 22, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X