న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రేసులో రవిశాస్త్రి ముందంజ: హెడ్ కోచ్ సెలక్షన్ ప్రాసెస్ తెలుసుకోండి!

Ravi Shastri frontrunner for India coach job: Check the coach selection process

హైదరాబాద్: శుక్రవారం రాత్రి 7 గంటలకల్లా టీమిండియా తదుపరి కోచ్ ఎవరన్నది తేలనుంది. ఈ మేరకు బీసీసీఐ ప్రెస్ మీట్ పెట్టి మరీ టీమిండియా హెడ్ కోచ్ ఎవరో ప్రకటించనుంది. ఇందులో భాగంగా ముంబైలోని బీసీసీఐ హెడ్ క్వార్టర్స్‌లో కపిల్‌దేవ్‌, అన్షుమన్‌ గైక్వాడ్‌, శాంత రంగస్వామిలతో కూడిన క్రికెట్‌ సలహా కమిటీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

<strong>నెలరోజులు కోమాలోనే!: బంతి తలకు తగిలి అంపైర్ మృతి</strong>నెలరోజులు కోమాలోనే!: బంతి తలకు తగిలి అంపైర్ మృతి

షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్ధులు వీరే!

షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్ధులు వీరే!

ఈ కమిటీ ప్రస్తుత కోచ్‌ రవిశాస్త్రితో పాటు టామ్‌ మూడీ, మైక్‌ హెసన్‌, ఫిల్‌ సిమన్స్‌, రాబిన్‌ సింగ్‌, లాల్‌చంద్‌ రాజ్‌పుత్‌లను షార్ట్‌లిస్ట్‌ చేసింది. ఈ ఆరుగురిని శుక్రవారం ముంబైలోని బీసీసీఐ హెడ్ క్వార్టర్స్‌లో ఇంటర్వ్యూ చేస్తున్నారు. హెడ్ కోచ్ పదవి కోసం షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్ధుల్లో టీమిండియా మాజీ ఫీల్డింగ్ కోచ్ రాబిన్ సింగ్, కివీస్ మాజీ కోచ్ మైక్ హెస్సెన్ నేరుగా హాజరయ్యారు.

ఏంటా షాట్ సెలక్షన్? పంత్ ఓవర్‌రేటెడ్ ప్లేయర్: నెటిజన్ల ఆగ్రహం

క్రికెట్‌ సలహా కమిటీ (సీఏసీ) పాత్ర!

క్రికెట్‌ సలహా కమిటీ (సీఏసీ) పాత్ర!

ప్రస్తుతం వెస్టిండిస్ పర్యటనలో ఉన్న రవిశాస్త్రి స్కైప్‌ ద్వారా క్రికెట్ సలహా కమిటీ ఇంటర్యూకు హాజరుకానున్నారు. మరోవైపు విదేశీ అభ్యర్థులు సైతం ఇలాగే ఇంటర్వ్యూల్లో పాల్గొంటారని తెలుస్తోంది. ప్రస్తుత కోచింగ్‌ బృందం కాంట్రాక్టు ప్రపంచకప్‌తో ముగిసినప్పటికీ వెస్టిండీస్‌ పర్యటన నేపథ్యంలో మరో 45 రోజుల కాంట్రాక్టును పొడిగించిన సంగతి తెలిసిందే.

సహాయ సిబ్బందిని ఎంపిక చేసేది ఎవరో తెలుసా?

సహాయ సిబ్బందిని ఎంపిక చేసేది ఎవరో తెలుసా?

హెడ్ కోచ్‌ను ఎంపిక చేసిన అనంతరం.. సహాయ సిబ్బందిని ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని సెలెక్షన్‌ కమిటీ ఎంపిక చేయనుంది. బ్యాటింగ్‌ కోచ్‌ సంజయ్‌ బంగర్‌ మినహా మిగతా సిబ్బంది యథాతథంగా ఉంటారని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. సహాయక సిబ్బంది కోసం జరిగే ఇంటర్వ్యూలో మాజీ సెలెక్టర్‌ విక్రమ్‌ రాథోడ్‌, ప్రమీణ్‌ ఆమ్రే, జాంటీ రోడ్స్‌ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. బ్యాటింగ్‌ కోచ్‌గా సంజయ్‌ బంగర్‌ స్థానంలో విక్రమ్‌ను ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అతడికి ఆమ్రే, ఇంగ్లండ్‌ మాజీలు జొనాథన్‌ ట్రాట్‌, రాంప్రకాష్‌ నుంచి గట్టిపోటీ ఎదురుకానుంది. ఒకవేళ రాథోడ్‌ను సెలెక్ట్‌ చేస్తే తనకు విరుద్ధ ప్రయోజనాలేమి లేవని ధ్రువీకరించుకోవాల్సి ఉంటుంది.

చెలరేగిన ఆసీస్ బౌలర్లు: లార్డ్స్‌లో ఇంగ్లాండ్ 258 ఆలౌట్

హెడ్ కోచ్ రేసులో ఫేవరేట్ ఎవరు?

హెడ్ కోచ్ రేసులో ఫేవరేట్ ఎవరు?

కాగా, టీమిండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లీ బహిరంగంగానే రవిశాస్త్రికి తన మద్దతు ప్రకటించాడు. కమిటీ సభ్యుడైన అన్షుమన్‌ గైక్వాడ్‌ సైతం అతడి పట్ల సానుకూలత వ్యక్తం చేశాడు. దీంతో రవిశాస్త్రికే మళ్లీ కోచ్‌ పదవి దక్కొచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. హెడ్ కోచ్‌ ఎంపిక విషయంలో కోహ్లీ మాట చెల్లుబాటవుతుందా లేక కపిల్‌ దేవ్‌ నేతృత్వంలోని క్రికెట్‌ సలహా కమిటీ మరో విధంగా ఆలోచిస్తోందా! అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

కోచింగ్ స్టాఫ్‌కు షార్ట్‌లిస్ట్‌ అయిన అభ్యర్ధులు

కోచింగ్ స్టాఫ్‌కు షార్ట్‌లిస్ట్‌ అయిన అభ్యర్ధులు

హెడ్ కోచ్: రవిశాస్త్రి, టామ్‌ మూడీ, మైక్‌ హెసన్‌, ఫిల్‌ సిమన్స్‌, రాబిన్‌ సింగ్‌, లాల్‌చంద్‌ రాజ్‌పుత్‌

బ్యాటింగ్ కోచ్: విక్రమ్ రాథోర్, సంజయ్ బంగర్ (ప్రస్తుత కోచ్), జోనాథన్ ట్రోట్, తిలాన్ సమరవీర, లాల్‌చంద్ రాజ్‌పుత్, హృషికేశ్ కనిత్కర్, అమోల్ మజుందార్, అరుణ్ కుమార్, మార్క్ రాంప్రాకాష్, షిబ్ సుందర్ దాస్, జాన్ లూయిస్, మిథున్ అమ్రేస్.

బౌలింగ్ కోచ్: వెంకటేష్ ప్రసాద్, భారత్ అరుణ్ (ప్రస్తుత కోచ్), క్లింట్ మెక్కే, దొడ్డ గణేష్, డారెన్ గోఫ్, సుబ్రోటో బెనర్జీ, పరాస్ మంబ్రే, సునీల్ జోషి, అమిత్ భండారి.

ఫీల్డింగ్ కోచ్: అభయ్ శర్మ, ఆర్ శ్రీధర్ (ప్రస్తుత కోచ్) మరియు జోంటి రోడ్స్.

Story first published: Friday, August 16, 2019, 12:42 [IST]
Other articles published on Aug 16, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X