Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఏంటా షాట్ సెలక్షన్? పంత్ ఓవర్‌రేటెడ్ ప్లేయర్: నెటిజన్ల ఆగ్రహం

Rishabh Pant Faces Fans Wrath for Throwing Away His Wicket Against West Indies

హైదరాబాద్: టీమిండియా యువ వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ ఆట తీరుపై క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా బుధవారం క్వీన్స్ పార్కు ఓవల్ వేదికగా వెస్టిండిస్‌తో జరిగిన మూడో వన్డేలో రిషబ్ పంత్ డకౌట్‌గా వెనుదిరిగిన సంగతి తెలిసిందే.

స్టీవ్ బక్నర్ ప్రపంచ రికార్డుని సమం చేసిన పాక్ అంఫైర్

తాను ఆడిన రెండో బంతికే రిషబ్ పంత్‌ పేలవమైన షాట్‌ ఆడి కీమోపాల్‌ చేతికి బౌండరీ లైన్ వద్ద క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. అంతకముందు ఓపెనర్ శిఖర్ ధావన్(36) సైతం కీమో పాల్‌కే క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో కీలక సమయంలో ఒకే ఓవర్‌లో టీమిండియా రెండు వికెట్లు కోల్పోయింది.

రిషబ్ పంత్ వికెట్‌ కోల్పోయి పెవిలియన్‌కు వెళ్తున్న సమయంలో నాన్‌స్ట్రైకర్‌ ఎండ్‌లో ఉన్న కెప్టెన్ విరాట్ కోహ్లీ అతడిని చూస్తూ షాట్‌ సెలక్షన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అభిమానులు సైతం పంత్‌ షాట్‌ సెలక్షన్‌ బాగోలేదని, అతడికి వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడని మండిపడుతున్నారు.

పేలవమైన షాట్‌ సెలక్షన్‌తోనే ఎప్పుడూ వికెట్‌ పోగొట్టుకుంటున్నాడని సోషల్ మీడియా వేదికగా విమర్శిస్తున్నారు. మిడిలార్డర్‌లో నాలుగో స్థానం ఎంతో కీలకం. అలాంటి నాలుగో స్థానంలో బరిలోకి దిగిన పంత్ ఆ స్థానం విలువ తెలియకుండా ఆడుతున్నాడంటూ పలువురు నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు.

పుణెరిపై ఈజీ విజయం: పట్టికలో మూడో స్థానానికి ఎగబాకిన జైపుర్

ఈ నేపథ్యంలో పంత్‌ని పక్కనపెట్టి అతడి స్థానంలో సంజూ శాంసన్‌, ఇషాన్‌ కిషన్‌ వంటి ఆటగాళ్లను జట్టులోకి తీసుకోవాలని సూచిస్తున్నారు. కాగా, పంత్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన శ్రేయస్‌ అయ్యర్‌ (65), కోహ్లీ(114 నాటౌట్‌) కలిసి జట్టుకు విజయాన్ని అందించిన సంగతి తెలిసిందే.

మూడు టీ20ల సిరిస్‌ను 3-0తో క్లీవ్ స్వీప్ చేసిన టీమిండియా.... మూడు వన్డేలను సైతం 2-0తో కైవసం చేసుకుంది. ఇక, రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ఆగస్టు 22 నుంచి తొలి టెస్టు ఆడనుంది.

Story first published: Friday, August 16, 2019, 11:11 [IST]
Other articles published on Aug 16, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+