న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చెలరేగిన ఆసీస్ బౌలర్లు: లార్డ్స్‌లో ఇంగ్లాండ్ 258 ఆలౌట్

Ashes 2019: Hazlewood leads the charge as Aussies tighten grip at Lords

హైదరాబాద్: లార్డ్స్ వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌ రెండో టెస్టులో ఇంగ్లాండ్ తొలిరోజే తేలిపోయింది. ఆస్ట్రేలియా పేసర్లు హాజెల్‌వుడ్‌ (3/58), కమిన్స్‌ (3/61)తో పాటు స్పిన్నర్‌ లయన్‌ (3/68) చెలరేగడంతో టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండ్ 77.1 ఓవర్లలో 258 పరుగులకే ఆలౌటైంది.

వర్షం వల్ల తొలి రోజు ఆట తుడిచిపెట్టుకుపోగా.. పిచ్‌ పరిస్థితుల దృష్ట్యా టాస్‌ నెగ్గిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఇంకేముంది పిచ్ బౌలర్లకు అనుకూలంగా మారడంతో గురువారం ఆస్ట్రేలియా బౌలర్లు చెలరేగారు. ముఖ్యంగా ప్యాటిన్సన్‌ గాయపడటంతో తుది జట్టులోకి వచ్చిన జోష్‌ హేజిల్‌వుడ్‌ మూడు కీలక వికెట్లు తీశాడు.

<strong>కోల్‌కతా నైట్‌రైడర్స్ కోచ్‌గా బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌</strong>కోల్‌కతా నైట్‌రైడర్స్ కోచ్‌గా బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌

ఇన్నింగ్స్‌ తొమ్మిదో బంతికే

ఇన్నింగ్స్‌ తొమ్మిదో బంతికే

ఇన్నింగ్స్‌ తొమ్మిదో బంతికే ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌ (0)ని హాజెల్‌వుడ్‌‌ను డకౌట్‌‌గా పెవిలియన్‌కు చేర్చి ఆస్ట్రేలియాకు శుభారంభం అందించాడు. వన్‌డౌన్‌లో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ వచ్చిన జో రూట్‌ (14)ని జట్టు స్కోరు స్కోరు 26 పరుగుల వద్ద హాజెల్‌వుడ్‌ పెవిలియన్‌కు పంపాడు. దీంతో 26 పరుగులకే 2 వికెట్లు ఇంగ్లాండ్ కష్టాల్లో పడింది.

బర్న్స్‌ హాఫ్ సెంచరీ

ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన జోయ్ డెన్లీ(30; 4 ఫోర్లు)తో కలిసి మరో ఓపెనర్‌ బర్న్స్‌ (53; 7 ఫోర్లు) నెమ్మదిగా ఆడుతూ వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. అయితే, లంచ్‌ విరామం తర్వాత డెన్లీని హాజెల్‌వుడ్‌ ఔట్‌ చేయగా, హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్న బర్న్స్‌ను కమిన్స్‌ పెవిలియన్‌ చేర్చాడు.

ఆఖరి వరకు పోరాడిన బెయిర్ స్టో

ఆఖరి వరకు పోరాడిన బెయిర్ స్టో

ఆ తర్వాత ఆసీస్ బౌలర్లు కమిన్స్‌, నాథన్‌ లియాన్‌లు కూడా విజృంభించడంతో జోస్ బట్లర్‌ (12), బెన్ స్టోక్స్‌ (13) స్వల్ప వ్యవధిలోనే వెనుదిరిగారు. దీంతో ఇంగ్లాండ్‌ 138 పరుగులకే 6 వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత క్రిస్ వోక్స్వోక్స్‌ (32; 3 ఫోర్లు, 1 సిక్స్‌)తో కలిసి బెయిర్ స్టో (52; 7 ఫోర్లు) కాసేపు పోరాడటంతో ఇంగ్లాండ్ స్కోరు 200 దాటింది.

నిరాశ పరిచిన డేవిడ్ వార్నర్

అనంతరం కమిన్స్‌ విజృంభించడంతో క్రిస్ వోక్స్, జోఫ్రా ఆర్చర్‌ (12) సైతం నిష్క్రమించారు. హాఫ్ సెంచరీ అనంతరం బెయిర్‌స్టో ఆఖరి వికెట్‌గా పెవిలియన్‌ చేరడంతో ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా ఆట ముగిసేసరికి 13 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 30 పరుగులు చేసింది. క్రీజులో బాన్‌క్రాఫ్ట్‌ (5), ఖవాజా (18) ఉన్నారు. వార్నర్‌ (3)ను బ్రాడ్‌ బౌల్డ్‌ చేశాడు.

Story first published: Friday, August 16, 2019, 8:21 [IST]
Other articles published on Aug 16, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X