న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ ముగ్గురికి బౌలింగ్ చేయడం చాలా కష్టం: రషీద్ ఖాన్

Rashid Khan reveals three batsmen he finds difficult to bowl to

న్యూఢిల్లీ: అఫ్గానిస్థాన్ సంచలనం రషీద్ ఖాన్ వరల్డ్ బెస్ట్ లెగ్ స్పిన్నర్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మైదానంలో అతను తీసిన వికెట్లే ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయి. ప్రపంచ దిగ్గజ బ్యాట్స్‌మనే.. అతని బౌలింగ్ ఎదుర్కోవడంలో తడబడుతారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)తో ప్రపంచానికి పరిచయమైన ఈ అఫ్గాన్ స్పిన్నర్.. అనతికాలంలోనే బెస్ట్ స్పిన్నర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల న్యూజిలాండ్ లెగ్ స్పిన్నర్ ఇష్ సోదీ సైతం ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఈ అఫ్గాన్ ప్లేయర్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. ప్రస్తుత తరంలో ప్రపంచ బెస్ట్ లెగ్ స్పిన్నర్ రషీదేనని కొనియాడాడు.

ఇన్‌స్టా లైవ్ సెషన్స్‌లో..

ఇన్‌స్టా లైవ్ సెషన్స్‌లో..

ఇక కరోనా లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన క్రికెటర్లు సోషల్ మీడియాలో కాలక్షేపం చేస్తున్నారు. ఇన్‌స్టా లైవ్ సెషన్స్‌ నిర్వహిస్తూ.. అభిమానులతో చిట్‌చాట్ చేస్తున్నారు. తాజాగా ఓ జర్నలిస్ట్‌‌తో ఇన్‌స్టా లైవ్‌లో పాల్గొన్న రషీద్ ఖాన్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. బౌలింగ్ చేయడం అత్యంత క్లిష్టంగా భావించే ముగ్గురు బ్యాట్స్‌మన్ పేర్లు చెప్పమని ఈ సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్‌ను సదరు జర్నలిస్ట్ ప్రశ్నించాడు.

హార్దిక్ పాండ్యాతో ఆ ఇద్దరు..

హార్దిక్ పాండ్యాతో ఆ ఇద్దరు..

ఈ ప్రశ్నకు రషీద్ సమధానమిస్తూ.. క్రిస్ గేల్, ఆండ్రూ రస్సెల్, హార్దిక్ పాండ్యా‌లకు బౌలింగ్ చేయడం చాలా కష్టమని చెప్పుకొచ్చాడు. ఈ ముగ్గురు విధ్వంసకర బ్యాట్స్‌మనే కావడం గమనార్హం. ఈ హార్డ్ హిట్టర్స్‌కు బౌలింగ్ చేయడం రషీద్ ఖాన్‌కే కాదు ఎవరికైనే కష్టమే. విండీస్ వీరులు క్రిస్‌గేల్, రస్సెల్‌‌లతో రషీద్.. ఐపీఎల్‌లోనే కాకుండా అంతర్జాతీయంగా జరిగే ఇతర లీగ్‌ల్లో కూడా ఆడాడు. బిగ్‌బాష్ లీగ్, ఎంజాన్సీ సూపర్ లీగ్, కరీబీయన్ ప్రీమియర్ లీగ్, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ వంటి అనేక టోర్నీల్లో ఈ ఇద్దరికి రషీద్ బౌలింగ్ చేశాడు.

బంతిని హిట్ చేయకున్నా..

బంతిని హిట్ చేయకున్నా..

ఇక అంతకు ముందు ఓ ఇంటర్వ్యూలో వెస్టిండీస్ క్రికెటర్లు బంతిని సరిగా హిట్‌చేయకపోయినా బౌండరీకి వెళ్తాయన్నాడు. ‘వెస్టిండీస్ క్రికెటర్లకు బౌలింగ్ చేయాలంటే చాలా కష్టం. వాళ్లు చాలా ప్రమాదకర ఆటగాళ్లు. బంతిని వాళ్లు సరిగా హిట్ చేయకపోయినా అది బౌండరీకి వెళ్తుంది. విండీస్ హిట్టర్ల తరహాలోనే హార్దిక్ పాండ్యా కూడా బ్యాటింగ్ చేస్తుంటాడు. టీ20ల్లో వీళ్లు చాలా ప్రమాదకరం'అని రషీద్ ఖాన్ వెల్లడించాడు. ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, మహేంద్రసింగ్ ధోనీ లాంటి అగ్రశ్రేణి బ్యాట్స్‌మెన్‌లను ముప్పు తిప్పలు పెట్టిన రషీద్ ఖాన్.. ఆండ్రూ రసెల్, కీరన్ పొలార్డ్, క్రిస్ గేల్, హార్దిక్ పాండ్యాకు కొన్ని మ్యాచ్‌ల్లో దొరికిపోయి చితక్కొట్టించుకున్నాడు.

211 మ్యాచ్‌లు.. 296 వికెట్లు..

211 మ్యాచ్‌లు.. 296 వికెట్లు..

2015లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన రషీద్ ఖాన్.. తన అద్భుత బౌలింగ్‌తో ఎన్నో రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. యంగెస్ట్ టెస్ట్ కెప్టెన్ ఘనతను కూడా అందుకున్నాడు. ఇప్పటి వరకు మొత్తం 211 టీ20 మ్యాచ్‌లాడిన రషీద్.. 296 వికెట్లు పడగొట్టాడు. 48 అంతర్జాతీయ టీ20ల్లో 89 వికెట్లు తీసిన ఈ అఫ్గాన్ సంచలనం.. 46 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 55 వికెట్లు పడగొట్టాడు. ఇక అఫ్గాన్ తరఫున 71 వన్డేలు ఆడిన రషీద్.. మొత్తం 133 వికెట్లు తీశాడు. 4 టెస్టుల్లో 23 వికెట్లని ఖాతాలో వేసుకున్నాడు.

Story first published: Thursday, May 14, 2020, 15:12 [IST]
Other articles published on May 14, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X