న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Ranji Trophy 2023: మరోసారి ఒంటి చేత్తో బ్యాటింగ్ చేసిన హనుమ విహారి.. కష్టాల్లో ఆంధ్ర! (వీడియో)

Ranji Trophy 2023: Hanuma Vihari Walks out Again to Bat With Fractured Arm

ఇండోర్: రంజీ ట్రోఫీ 2022-23లో భాగంగా మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న క్వార్టర్ ఫైనల్లో ఆంధ్ర జట్టు ఓటమి దిశగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో 151 పరుగుల ఆధిక్యాన్ని అందుకున్న ఆంధ్ర.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం దారుణంగా విఫలమైంది. పేలవ బ్యాటింగ్‌తో 93 పరుగులకే కుప్పకూలింది. ఆంధ్ర కెప్టెన్ హనుమ విహారి(15) విరిగిన చేతితో మరోసారి బ్యాటింగ్ చేసి జట్టుకు విలువైన పరుగులందించాడు.

దాంతో మధ్య ప్రదేశ్ ముందు 245 పరుగుల లక్ష్యం నమోదైంది. ఇక రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన మధ్యప్రదేశ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 58 పరుగులు చేసింది. మధ్య ప్రదేశ్ విజయానికి ఇంకా 187 పరుగులు అవసరం కాగా.. ఆంధ్ర గెలవాలంటే 10 వికెట్లు తీయాలి.

మణికట్టు గాయంతో విహారి బ్యాటింగ్..

ఈ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు ముందు బ్యాటింగ్ చేయగా.. మధ్యప్రదేశ్ బౌలర్ అవేశ్ ఖాన్ బౌలింగ్‌లో హనుమ విహారి గాయపడ్డాడు. అతను విసిరిన బౌన్సర్ హనుమ విహారి ఎడమ చేతి మణికట్టుకు బలంగా తగలడంతో అతను 16 పరుగుల వద్ద రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు.

అయితే ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 323/2తో పటిష్టంగా కనిపించిన ఆంధ్ర .. 30 పరుగుల వ్యవధిలోనే 7 వికెట్లు కోల్పోయింది. దాంతో విరిగిన చేతితోనే విహారి ఆఖరి వికెట్‌గా మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చాడు.

సింగిల్ హ్యాండ్‌తో బౌండరీలు..

సింగిల్ హ్యాండ్‌తో బౌండరీలు..

లెఫ్టాండ్ బ్యాటింగ్ చేస్తూ 20 బంతులాడి ఒంటి చేత్తోనే రెండు బౌండరీలూ బాదాడు. ముందు రోజు స్కోరుకు 11 పరుగులు జోడించిన తరువాత ఔటయ్యాడు. ఇక విహారి మణికట్టులో చీలిక వచ్చిందని, గాయం నుంచి కోలుకునేందుకు 5-6 వారాల టైమ్ పడుతుందని వైద్యులు తెలిపినట్లు విహారే తెలిపాడు.

సీరియస్ ఇంజ్యూరీ అయిన విహారి జట్టు కోసం రిస్క్ చేయడంపై సర్వత్రా ప్రశంసల జల్లు కురిసింది. చివరకు ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌లో 379 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన మధ్యప్రదేశ్‌ను 228 పరుగులకు ఆలౌట్ చేసింది.

రెండో సారి బ్యాటింగ్..

రెండో సారి బ్యాటింగ్..

అయితే రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం పేలవ బ్యాటింగ్‌తో కష్టాల పాలైంది. మరోసారి ఒంటి చేత్తో బ్యాటింగ్ చేసిన విహారి 15 పరుగులు చేశాడు. ఇందులో మూడు బౌండరీలు కొట్టడం విశేషం. అయితే విహారి కష్టానికి బ్యాటర్లు ప్రతిఫలం లేకుండా చేశారని నెటిజన్లు విమర్శిస్తున్నారు. జట్టులో గెలవాలనే కసిని పెంచడానికి తాను రిస్క్ చేసి బ్యాటింగ్ చేశానని హనుమవిహారి తెలిపాడు.

'నా ఎడమ చేతి మణికట్టు విరిగింది. డాక్టర్లు బ్యాటింగ్ చేయవద్దని సూచించారు. మా టీమ్ ఫిజియో కూడా బ్యాటింగ్ చేయడం కుదరదని చెప్పాడు. కానీ వికెట్లు పడిపోతున్నప్పుడు, ఒంటి చేత్తో లెఫ్టాండ్ బ్యాటింగ్ ఎందుకు చేయకూడదు? అనే ఆలోచన నాకు వచ్చింది.

10-15 బంతులాడి.. మరో 10 పరుగులు చేసినా గొప్పవిషయమే అనిపించింది. అంతేకాకుండా విజయం కోసం పోరాడాలనే తన ఉద్దేషం టీమ్‌కు అర్థమవుతుందనిపించింది. నేను వదిలేస్తే టీమ్‌లో నిరాశ నెలకొంటుంది. నేను పరుగులు చేయకున్నా.. తొలి బంతికే ఔటైనా.. గాయంతో బ్యాటింగ్‌కు సిద్దమయ్యాననే స్పూర్తి మా ఆటగాళ్లకు కలుగుతోంది.'అని చెప్పుకొచ్చాడు.

Story first published: Thursday, February 2, 2023, 18:09 [IST]
Other articles published on Feb 2, 2023
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X