ఆ క్షణమే సర్ఫరాజ్ అహ్మద్ టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాల్సింది: రమీజ్ రాజా

కరాచీ: ఇంగ్లండ్‌తో జరిగిన ఫస్ట్ టెస్ట్‌లో అవకాశం దక్కనప్పుడే పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ టెస్ట్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాల్సిందని ఆ దేశ మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ రమీజ్ రాజా అభిప్రాయపడ్డాడు. సర్ఫరాజ్‌ సంప్రదాయక ఆటకు స్వస్థి పలికి లిమిటెడ్ ఓవర్ల ఫార్మాట్‌కు పూర్తి స్థాయి సమయం కేటాయించడం ఉత్తమమని సూచించాడు. ఇక సుదీర్ఘ విరామం తర్వాత పాక్ జట్టులోకి వచ్చి సర్ఫరాజ్ అహ్మద్.. ఫస్ట్ టెస్ట్‌కు ప్రకటించిన 16 మంది ప్రాబబుల్స్‌లో కూడా ఉన్నాడు. కానీ మరో వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్‌తో పోటీ కారణంగా తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు.

 డ్రింక్స్, బూట్లు మోసిన సర్ఫరాజ్..

డ్రింక్స్, బూట్లు మోసిన సర్ఫరాజ్..

మాజీ కెప్టెన్ అయిన సర్ఫరాజ్ 12వ ఆటగాడిగా .. మైదానంలోకి డ్రింక్స్ మోసుకెళ్లాడు. అంతేకాకుండా ఓ సందర్భంలో బ్యాట్స్‌మన్ బూట్లు కూడా పట్టుకెళ్లాడు. ఈ ఫొటోలు నెట్టింట వైరల్ కావడంతో పాకిస్థాన్ క్రికెట్‌లో తీవ్ర దుమారం రేగింది. అద్భుత కెప్టెన్సీతో 2017 చాంపియన్స్ ట్రోఫీ అందించిన ఓ మాజీ సారథి పట్ల ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా? అని ఆ దేశ మాజీ క్రికెటర్లు షోయబ్ అక్తర్, రషీద్ లతీఫ్‌, అభిమానులు పాక్ మెనేజ్‌మెంట్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా రమీజ్ రాజా కూడా ఓ మాజీ ఆటగాడిగా సర్ఫరాజ్ చేయాల్సిన పని అది కాదన్నాడు.

అది చాలా కష్టం..

అది చాలా కష్టం..

జట్టుకు సారథ్యం వహించి అవకాశం కోసం ఎదురు చూడటం ఏ ఆటగాడికైనా చాలా కష్టంగా ఉంటుందని తన యూట్యూబ్ చానెల్‌లో చెప్పుకొచ్చాడు. ‘టెస్ట్ క్రికెట్‌లో అతనికి అవకాశం దక్కుతుందని నేనే ఏ మాత్రం అనుకోవడం లేదు. అతను వైట్ బాల్ క్రికెట్‌పై ఫోకస్ పెట్టడం ఉత్తమం. అలా చేస్తే అతనికి కనీస గౌరవమన్నా దక్కుతుంది. అలా కాకుండా టెస్ట్ ఆడాలని ఉంటే... మరో వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్‌పై తీవ్ర ఒత్తిడి నెలకొంటుంది. మాజీ కెప్టెన్ రేసులో ఉన్నాడని ఊపిరి కూడా మెసలదు. సర్ఫరాజ్ బెంచ్‌కు పరిమితం కావాల్సిన అవసరం లేదనేది నా అభిప్రాయం. టెస్ట్ క్రికెట్ నుంచి అతను తప్పుకోవాలి.'అని రమీజ్ రాజా అభిప్రాయపడ్డాడు.

 స్టోక్స్ లేకపోవడం...

స్టోక్స్ లేకపోవడం...

వ్యక్తిగత కారణాలతో మిగతా రెండు టెస్ట్ మ్యాచ్‌లకు ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ దూరమైన విషయం తెలిసిందే. అయితే స్టోక్స్ గైర్హాజరి పాకిస్థాన్‌కు కలిసొస్తుందని రమీజ్ రాజా తెలిపాడు. ‘వరల్డ్ టాప్ మోస్ట్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్. బంతితో బ్యాట్‌తో మ్యాచ్ ఫలితాన్ని శాసించగల గేమ్ చేంజర్. అతని గైర్హాజరి పాకిస్థాన్‌కు అడ్వాంటేజ్ అవుతుందని అనుకుంటున్నా'అని రమీజ్ రాజా పేర్కొన్నాడు.

చెత్త బౌలింగ్, ఫీల్డింగ్..

చెత్త బౌలింగ్, ఫీల్డింగ్..

ఇక గెలవాల్సిన ఫస్ట్ టెస్ట్‌లో పాకిస్థాన్ ఓడిపోవడం నిరాశకు గురిచేసిందని, ఈ ఫలితాన్ని జీర్ణించుకోలేకపోయానని రమీజ్ రాజా చెప్పుకొచ్చాడు. ‘మ్యాచ్ ఆసాంతం ఆధిపత్యం కనబర్చిన పాక్ అనూహ్యంగా ఓడిపోవడం నిరాశను కలిగించింది. ఈ ఓటమిని జీర్ణించుకోలేకపోయా. తీవ్ర ఒత్తిడిలో జోస్ బట్లర్, టేయిలెండర్ క్రిస్ వోక్స్ పరుగుల చేయడం.. వారు ఆడేలా పాకిస్థాన్ బౌలర్లు బౌలింగ్ చేయడం ఆశ్చర్యం కలిగించింది. పాక్ పేసర్లు వారిద్దరికి కనీసం షార్ట్ పిచ్ బంతులు కూడా వేయలేకపోయారు. ఫీల్డింగ్ కూడా చెత్తగా చేశారు'అని రమీజ్ రాజా అసహనం వ్యక్తం చేశాడు. ఇక ఇంగ్లండ్-పాక్ రెండో గురువారం నుంచి సౌతాంప్టన్ వేదికగా ప్రారంభంకానుంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Wednesday, August 12, 2020, 14:23 [IST]
Other articles published on Aug 12, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X