న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఫెయిల్ స్టోరీ: కోటి రూపాయలకో వికెట్ తీసిన జయదేవ్ ఉనాద్కత్

By Nageshwara Rao
Rajasthan Royals bowler jaydev unadkat took one wicket for rs 1 crore

హైదారాబాద్: ఐపీఎల్ 2018 సీజన్ కోసం బెంగళూరు వేదికగా జరిగిన ఐపీఎల్ వేలంలో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ జయదేవ్ ఉనాద్కత్‌ను రూ.11.5 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో వేలంలో అత్యంత ఖరీదైన భారత ఆటగాడిగా జయదేవ్ ఉనాద్కత్ రికార్డులకెక్కిన సంగతి తెలిసిందే.

ఆ తర్వాత ఐపీఎల్ ప్రారంభమైంది. తనపై రాజస్థాన్ యాజమాన్యం పెట్టుకున్న ఎన్నో అంచనాలను నిలబెట్టడంలో ఉనాద్కత్ పూర్తిగా విఫలమయ్యాడు. ఈ సీజన్‌లో పేలవ ప్రదర్శనతో వికెట్లు రాబట్టడంలో పూర్తిగా విఫలమయ్యాడు. తద్వారా ఎలిమినేటర్ మ్యాచ్‌లో జట్టుని గెలిపించలేకపోయాడు.

ఈ సీజన్‌లో మొత్తం 15 మ్యాచ్‌లు ఆడిన ఉనాద్కత్ 11 వికెట్లు మాత్రమే తీశాడు. దీనిని బట్టి చూస్తే రాజస్థాన్ యాజమాన్యం తనపై పెట్టిన రూ.11.5 కోట్లకు గాను రూ.కోటికి ఓ వికెట్ చొప్పున తీశాడన్నమాట. అంతేకాదు జయదేవ్ ఉనాద్కత్ 44.18 బౌలింగ్ సగటు మాత్రమే నమోదు చేశాడు.

ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్

ఈ సీజన్‌లో జయదేవ్ ఉనాద్కత్ 16.50 ఎకానమీ రేటుతో చెత్త గణాంకాలు నమోదు చేశాడు. కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్‌లోనూ జట్టుకు అండగా నిలవడంలో విఫలమయ్యాడు. ఈ మ్యాచ్‌లో రెండు ఓవర్లు వేసిన ఉనాద్కత్ 33 పరుగులు సమర్పించుకుని తీవ్రంగా నిరాశపరిచాడు.

కోల్‌కతాలోని ఈడెన్ గార్డన్స్ వేదికగా జరిగన ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ 25 పరుగుల తేడాతో విజయం సాధించి క్వాలిఫయర్-2కు దూసుకెళ్లిన సంగతి తెలిసిందే.

Story first published: Friday, May 25, 2018, 15:48 [IST]
Other articles published on May 25, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X