న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బీసీసీఐ ఫిట్‌నెస్ టెస్ట్ విఫలమైన రాహుల్ తెవాటియా.. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు డౌటే!

Rahul Tewatia fails BCCIs fitness test ahead of England T20Is

న్యూఢిల్లీ: 'అదృష్టం తలుపు తడితే.. దరిద్రం వెనక్కి లాగిందంట'అనే సామెత రాజస్థాన్ రాయల్స్ ఆల్‌రౌండర్ రాహుల్ తెవాటియాకు సరిగ్గా సరిపోతుంది. ఇంగ్లండ్‌తో 5 టీ20ల సిరీస్‌కు టీమిండియా నుంచి తొలిసారి పిలుపును అందుకున్న తెవాటియా.. భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) నిర్వహించిన ఫిట్‌‌నెస్ టెస్ట్‌లో విఫలమయ్యాడంట. దాంతో టీమిండియా తరఫున ఆడాలనుకున్న అతని ఆశలపై నీలినీడలు కమ్ముకున్నాయి.

బీసీసీఐ ఫిట్‌నెస్ ప్రమాణాల ప్రకారం జట్టులో చోటు దక్కాలంటే ప్రతీ ఆటగాడు యోయో టెస్ట్‌లో 17.1 పాయింట్లు సాధించాలి. లేదా 8.5 నిమిషాల్లో 2 కిలోమీటర్ల పరుగును పూర్తి చేయాలి. కానీ రాహుల్ తెవాటియా ఈ ఫిట్‌నెస్ టెస్ట్‌ల్లో విఫలమయ్యాడని ది టెలిగ్రాఫ్ పేర్కొంది. దాంతో అతను ఇంగ్లండ్‌తో జరిగే 5 టీ20ల సిరీస్‌లో పాల్గొనడంపై అనుమానాలు నెలకొన్నాయి. కోల్‌కతా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కూడా ఫిట్‌నెస్ టెస్ట్‌లో విఫలమైనట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

అయితే ఈ ఇద్దరికి మరో అవకాశం ఉందని, అందులో పాసైతే జట్టుతో కలుస్తారని బీసీసీఐకి చెందిన ఓ అధికారి తెలిపారు. 'టీమ్ ఫిట్‌నెస్ ప్రమాణాలు మెరుగుపరిచేందుకు బోర్డు కఠినమైన టెస్ట్ తీసుకొచ్చింది. రాహుల్ తెవాటియాకు మరో అవకాశం ఉంది.'అని సదరు అధికారి తెలిపారు. గత సీజన్‌లో రాహుల్ తెవాటియా అద్భుత ప్రదర్శన కనబర్చిన విషయం తెలిసిందే. సెన్సేషన్ బ్యాటింగ్‌తో యావత్ క్రికెట్ ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు. 14 మ్యాచ్‌ల్లో 255 పరుగులు చేశాడు. షెల్డెన్ కాట్రెల్ వేసిన ఓ ఓవర్‌లో తెవాటియా కొట్టిన 5 సిక్స్‌లు ఆ సీజన్‌కే హైలైట్‌గా నిలిచాయి.

తెవాటియా దరిద్రం అటుంచితే.. వరుణ్ చక్రవర్తికి అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారడం ఇది రెండో సారి. గత ఐపీఎల్ సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున 13 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు తీసిన వరుణ్ చక్రవర్తి.. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే టీ20 జట్టులో అవకాశం దక్కింది. కానీ గాయం కారణంగా ఆ అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారింది. తాజాగా ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికవ్వగా.. మళ్లీ దురదృష్టం వెంటాడినట్లు తెలుస్తోంది.

Story first published: Wednesday, March 3, 2021, 20:44 [IST]
Other articles published on Mar 3, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X