న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పీటర్సన్‌.. నువ్ మాత్రమే కాదు! ద్రవిడ్‌ నుంచి నేను సలహాలు పొందా: జింబాబ్వే మాజీ కెప్టెన్

Rahul Dravids of advice for Tatenda Taibu to tackle Anil Kumble

హరారే: భారత మాజీ కెప్టెన్ రాహుల్‌ ద్రవిడ్‌ తనకూ బ్యాటింగ్‌లో సలహాలు ఇచ్చారని జింబాబ్వే మాజీ సారథి తతెందా తైబు తెలిపారు. ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్ కెవిన్‌ పీటర్సన్‌ ట్వీట్‌కు తైబు రిప్లై ఇచ్చారు. శ్రీలంక పర్యటనలో స్పిన్‌ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతున్న ఇంగ్లండ్‌ ఓపెనర్లకు పీటర్సన్‌ తాజాగా విలువైన సలహా ఇచ్చారు. తాను క్రికెట్‌ ఆడే రోజుల్లో ఇలాగే ఇబ్బంది పడితే.. టీమిండియా దిగ్గజ క్రికెటర్ ద్రవిడ్‌ కీలక సలహాలిచ్చాడని గుర్తు చేసుకున్నారు. ద్రవిడ్‌ చేసిన ఆ సాయంతో తన ఆట పూర్తిగా మారిపోయిందని చెప్పారు.

పీటర్సన్‌ సూచనలు

ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టు లంక పర్యటనలో ఉంది. ఇంగ్లండ్ ఓపెనర్లు జాక్‌ క్రాలీ, డొమినిక్‌ సిబ్లీ తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లో, రెండో టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో మొత్తం మూడుసార్లు లంక స్పిన్నర్‌ ఎంబుల్డేనియా చేతిలోనే ఔటయ్యారు. దాంతో వారు స్పిన్‌ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతున్నారని గ్రహించిన పీటర్సన్‌.. స్పిన్‌ బౌలింగ్‌ను ఎలా ఎదుర్కోవాలో తెలియజేస్తూ రెండు ట్వీట్లు చేశారు. అందులో ఒకసారి రాహుల్‌ ద్రవిడ్‌ తనకు పంపిన ఈమెయిల్‌ను చదవాలని సూచించారు. అంతేకాదు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఆ మెయిల్‌ను ప్రింట్ తీసి ఓపెనర్లకు అందజేయాలని ట్వీట్ చేశారు.

పీటర్సన్ పోస్టుకు తైబు రిప్లై

కెవిన్‌ పీటర్సన్ పోస్టును చూసిన తతెందా తైబు అతడికి రిప్లై ఇచ్చారు. ఒకానొక సందర్భంలో రాహుల్ ద్రవిడ్‌ తనకూ సాయం చేశాడని గుర్తు చేసుకున్నారు. 'టీమిండియాతో నేను ఆడిన తొలి రెండు టెస్టుల్లో మూడుసార్లు అనిల్ కుంబ్లే నన్ను ఔట్ చేశాడు. ఆ సమయంలో ద్రవిడ్‌ నుంచి సలహాలు పొందాను. మ్యాచ్ డ్రింక్స్ సమయంలో ద్రవిడ్ దగ్గరికి వెళ్లి మాట్లాడా. కుంబ్లే బౌలింగ్‌ను.. స్లో మీడియం పేస్‌ బౌలర్‌ను ఎదుర్కొనేటట్లు ఆడాలని చెప్పాడు. బంతిని తదేకంగా చూస్తూ కాళ్ల కంటే ముందు బ్యాట్‌ను ఉంచాలని, కాస్త ఆలస్యంగా షాట్‌ ఆడాలని తెలిపాడు. ఆ షాట్‌ను చాలా తేలిగ్గా నేర్చుకోవచ్చు. బంతి టైమింగ్‌ను బట్టి ముందుకు వచ్చి దాన్ని గమనిస్తూనే ఫ్రంట్‌ఫుట్‌ తీసుకొని షాట్‌ ఆడాలి' అని తైబు తెలిపారు.

18 ఏళ్ల వయసులో ఆరంగేట్రం

18 ఏళ్ల వయసులో ఆరంగేట్రం

తతెందా తైబు 2001లో 18 ఏళ్ల వయసులో జింబాబ్వే జట్టు తరఫున ఆరంగేట్రం చేశారు. దాదాపు 11 సంవత్సరాలు తైబు అంతర్జాతీయ క్రికెట్ ఆడారు. జింబాబ్వే జట్టు తరఫున తైబు 28 టెస్టులు, 150 వన్డేలు, 17 టీ20 ఆడారు. టెస్టుల్లో ఒక శతకంతో 1546 పరుగులు, వన్డేల్లో రెండు శతకాలతో 3393 పరుగులు చేశారు. టీ20ల్లో 259 రన్స్ చేశాడు. అత్యధిక స్కోర్ 45 నాటౌట్.

లంక పర్యటన తర్వాత భారత్‌కు

లంక పర్యటన తర్వాత భారత్‌కు

లంక పర్యటన తర్వాత ఇంగ్లండ్ జట్టు భారత పర్యటనకు రానుంది. ఇరు జట్ల మధ్య మొత్తం నాలుగు టెస్టులు, ఐదు టీ20లు, మూడు వన్డేల సిరీస్ జరగనుంది. ఈనెల 27న భారత్-ఇంగ్లండ్ జట్లు చెన్నైకి చేరుకుని బయో బబుల్‌లో ఉంటాయి. తొలి టెస్టు వచ్చే నెల 5న ఆరంభం కానుంది. 17 నుంచి రెండో టెస్ట్ ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 24 నుంచి మూడో టెస్టుతో పాటు మార్చి 4 నుంచి నాలుగో టెస్టుకి కూడా అహ్మదాబాద్‌లోని మొతెరా స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది.

నిబంధనలు ఉల్లంఘించి.. బోట్‌మెన్‌ను కష్టాల్లో పడేసిన శిఖర్ ధావన్!!

Story first published: Monday, January 25, 2021, 15:16 [IST]
Other articles published on Jan 25, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X